2, అక్టోబర్ 2020, శుక్రవారం

మూకపంచశతి

 దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏


**మూకపంచశతి**


**ఆర్యాశతకము**


🌹14.

శ్లోకం


**అధికాఞ్చిపరమయోగిభి**


**ఆదిమపరపీఠ సీమ్ని దృశ్యేన౹**


**అనుబద్ధం మమ మానసం**


**అరుణిమ సర్వస్వ సమ్ప్రదాయేన౹౹**


🌺భావం :అమ్మాకామాక్షీ ! కాంచీపురమునందు ఆది ఐనదీ ,శ్రేష్ఠమైనదీ అయిన పరశివపీఠమున అధిష్ఠించియున్న ,పరమయోగులు మాత్రమే కాంచ గలిగిన ,సంపూర్ణ అరుణిమసంప్రదాయముతో ఒప్పుచున్న నీ యందే నామనస్సు అనుబంధింపబడినది.🙏



💮 పంచాశత్పీఠరూపిణి అయిన ఆ సర్వేశ్వరి ,కాంచీక్షేత్రమున ఆదిమపర పీఠముపై కొలువైయున్నది.కేవలము శ్రేష్ఠులైన యోగులకు మాత్రమే దర్శనీయమైన ఆతల్లి పూర్తి అరుణిమకాంతులతో శోభిల్లుచున్నది.అరుణా , కరుణాతరంగితాక్షి అయిన ఆ కామాక్షీ దేవితో నామనస్సునకు అనుబంధ మేర్పడినది.


🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏



**ధర్మో రక్షతి రక్షితః**

కామెంట్‌లు లేవు: