*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
పద్యం: 1915 (౧౯౧౫)*
*10.1-901-*
*క. గురు దేవ హీను బాలుని*
*గిరిభూజ ప్రముఖ వాసుఁ గృష్ణు ననీశుం*
*బరిమాణశీల కుల గుణ*
*విరహితుఁ జేపట్టి యింద్రు విడిచిరి గొల్లల్.* 🌺
*_భావము: ఈ యాదవులు "గురువులను, దైవమును లక్ష్యపెట్టని వాడును, కొండలు, గుట్టలు, చెట్లు పుట్టల్లో తిరిగెడి వాడును, జ్ఞానము, విద్య లలో ఏ శిక్షణ పొందని వాఁడును, ఏ మాత్రము మంచి గుణములు గాని, నడవడి గాని లేని వాడును అగు ఒక సామాన్య బాలుని ఆశ్రయించి నావంటి ప్రతిభావంతుడు, శక్తివంతుడగు ఇంద్రుడను, అని కూడా ఆలోచించక" నన్ను వదిలివేశారు._* 🙏
*_ఈ కృష్ణుని గురించి మరొక తాత్విక నిగూఢమైన భావన లో: "తనకంటూ ఒక గురువు కానీ, దైవము కానీ లేని ఆది దైవము, కొండలు, చెట్లు, పుట్టలు, నీరు ఆకాశము అన్నీ తానే యైన విరాట్పురుషుడు, సకల విద్యలకు, జ్ఞానమునకు మూలమైన ఆదిగురువు, ఇంత అని కొలవలేని అనంతుడు, ఈ కులము, వంశము అని చెప్పజాలని అప్రమేయుడు, త్రిగుణములకు మూలమై యుండియు, ఆ గుణములకు అతీతుడగు పరమాత్మ"._* 🙏
*_పోతనగారు ఈ భాగవతమనే సుమధుర ఫలప్రసాదమును అందించారు. అత్యంత సరళమైన భాష లో చిన్ని చిన్ని పదములలో చొప్పించిన మహత్తరమైన భావము - భాషకు, భావానికి, భక్తికి వారు చేసిన సేవకు మన తెలుగు వారము తరతరాలుగా ఋణపడి ఉంటాము._* 🙏
*_Meaning: Indra was angry with the Yadava folks and was thinking: "These cowherds ignored me as they depended on the words of a boy, who does not care for God or Guru, who moves in forests and plains, who is not aware of any higher knowledge, who does not possess good character and not a single good quality. Heeding to the advice of such ignorant lad, these folks snubbed and disregarded me"._* 🙏🏻
*_Meaning of the same poem in philosophical sense: "This super-human lad is the God-incarnate Himself and Guru of Gurus. He is the creator of the entire universe and occupies the whole of the earth and sky. He is the origin of all knowledge and is beyond the trigunas (Sattva, Rajas and Tamo). He is Immeasurable, Omniscient, Omnipresent and Omnipotent"._* 🙏
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454).*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి