2, అక్టోబర్ 2020, శుక్రవారం

శివామృతలహరి


.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


శా||

రాగద్వేష భవాబ్ధితారక మహారత్నోడుపా! దుర్విషా

దాగధ్వంసక వజ్రరూప ! గిరిచాపా! మౌనిహృద్దీప!దు

ర్యోగారణ్య విదాహ దావహుతభుగ్రూపా!శివా!పాహి మాం

శ్రీగౌరీ హృదయాంబుజాతమధుపా! శ్రీ సిద్ధలింగేశ్వరా!


భావం;

రాగద్వేషాలుతో నిండివున్న ఈ సంసార సాగరాన్ని దాటించే ఒక పెద్ద శ్రేష్టమైన నావ లాంటి వాడివి,

పెను విషాదము అనే కొండను ధ్వంసం చెయ్యడంలో ఒక వజ్రాయుధం వంటి వాడివి.

మేరుపర్వతాన్ని విల్లుగా ధరించిన వాడివి.

తపోనిష్టా గరిష్టులైన మునుల యొక్క హృదయాల్లో ఆత్మజ్యోతిగా వెల్గెడి వాడివి.

దుర్యోగములు అనేటువంటి అరణ్యాలను పూర్తిగా దగ్ధం చేసేటు వంటి అగ్ని స్వరూపుడివి.

 శ్రీ గౌరీ మహాదేవి యొక్క హృదయ తామర నుండి ప్రేమామృతమును గ్రో లెడి తుమ్మెద వంటి వాడివి.స్వామీ శివా! నన్ను రక్షించి ఏలుకో వయ్యా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: