2, అక్టోబర్ 2020, శుక్రవారం

🪔 దీపోజ్యోతిః నమోస్తుతే🪔🪔



*దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమోపహః|

దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ||

 

*భావం.*.. దీపం జ్యోతి స్వరూపమైనది. అదే పరంబ్రహ్మం, దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమం అవుతున్నాయి. అటువంటి సంధ్యా దీపమా! నీకు నమస్కారం అని అర్థం. *

 

*దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని పురోహితులు అంటున్నారు. *అజ్ఞానం = చీకటి,* *జ్ఞానం = వెలుతురు. *మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే కాంతిని సర్వత్ర ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపం అని శాస్త్రాలు చెబుతున్నాయి.*


    🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏 

కామెంట్‌లు లేవు: