2, అక్టోబర్ 2020, శుక్రవారం

అయ్యప్ప దీక్షవల్ల

 *అయ్యప్ప దీక్షవల్ల మనకు కలిగే లాభాలు (దీక్ష తీసుకునే స్వామికి, వారి కుటుంబ సభ్యులకు)* 


*సమర్పణ: అఖిల భారతీయ అయ్యప్పధర్మ ప్రచారసభ (ABAP), తెలంగాణ*


1. అయ్యప్ప దీక్ష సకల పాపహరణం, పుణ్యదాయకం మరియు మోక్ష కారకం. అందుచేత ఎంత నిష్ఠతో చేస్తే అంత సత్పలితం లభిస్తుంది. అయ్యప్ప దీక్ష మనిషి శరీర, మనసు, ఆత్మలను ఏకం చేస్తుంది. ఇది భక్తి, జ్ఞాన, కర్మ, రాజ యోగల సమాహారం.


2. పొద్దున, సాయంత్రం పూజలు, భజనలు చేయటం వలన ఇంటిల్లిపాదికి దైవ భక్తి, విశ్వాసం పెరుగుతుంది. కార్తీక, మార్గశిర మాసాల్లో, రోజు ఇల్లు శుద్ది చేసుకొని దీపాలు వెలిగించడం వలన ఇల్లంత కూడా దైవిక కాంతులతో వెలిగిపోతోంది.


3. ఉదయమే లేవటం వలన మానసిక ఉల్లాసం, ఒత్తిడి నుండి దూరం, బిపి షుగర్ తగ్గుతుంది. పొద్దునే లేవటం వలన కాలాన్ని నిత్యజీవిత కార్యక్రమాలకు సంపూర్ణంగా వినియోగించవచ్చు.


4. ఒంటిపూట భోజనం, అల్పాహారం వలన జీర్ణ వ్యవస్థ తిరిగి యాధస్థితికి వస్తుంది. సాత్విక ఆహరం తీసుకొవటం వలన నాలుగు నుండి ఆరు కిలోల బరువు కోల్పోయే అవకాశం. క్షమించాలి ఈ ప్రయోజనం మితంగా తింటేనే లభిస్తోంది.


5. బెల్లం, నెయ్యి, పళ్ళు,పాలు సంబంధ ఆహరం, ప్రసాదాలవలన రక్తశుద్ధి, కాలేయం పని తీరు మెరుగైతుంది. గుండె, మెదడు పనితీరులో మార్ప కలుగుతుంది. జ్ఞాపక శక్తీ పెరుగుతుంది.


6. సన్నిధానంలో అందరూ స్వాములతో కలిసి జీవించటం వలన మనషుల ప్రవర్తన, సమాజం గురించి అవగాహనా, జీవించే విధానం అర్థం చేస్కునే అవకాశం కలుగుతుంది.


7. అయ్యప్ప పూజలో తల్లితండ్రికి విశిష్ట స్థానం ఉండటం వలన తల్లితండ్రులకు, పిల్లలకు మధ్య వాత్సల్య భావన పెరుగుతుంది. టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే చూడటంతో చిన్నప్పటి నుండే పిల్లలకు దైవ చింతన కలుగుతుంది. పగలు ప్రతికరాలు చొప్పించే పనికిమాలిన టివి సీరియళ్లుకు, పిల్లలను వ్యసననికి గురిచేసే కార్టూన్లకు దూరం


8. అయ్యప్ప మాలధారణ మొదలుకొని పడి పూజ, ఇరుముడి కార్యక్రమాల్లో మన ఇంటి సభ్యులే కాకా, బంధుమిత్రులు కలవటం, పాలుపంచుకోవడం వలన అందరితో సఖ్యత భావన కలుగుతుంది. 


9. అయ్యప్ప మాలధారణ చేసుకున్న వ్యక్తి సాక్షాత్ అయ్యప్ప స్వరూపంగా చూడటం వలన సమాజంలో వారి మీద, వారి కుంటుంబం మీద ఉన్న ఏమైనా చెడ్డ అభిప్రాయం ఉన్నా తొలిగి, మంచి అభిప్రాయం కలుగుతుంది.


10. పొద్దునే లేవటం, తొందరగా నిద్రపోవటం వలన సమయ పాలనా జరిగి స్వాములు, ఇంటి సభ్యులు వారి వారి విద్య, వ్యాపార, వృత్తి, గృహ తదితర దైనందిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనవచ్చు తద్వారా విద్య వ్యాపార వృత్తులలో అభివృద్ధిని పొందవచ్చు.


11. మద్యపానం, ధూమపానం లాంటి చేడు వ్యసనాలకు దూరం కావటం వలన డబ్బు ఆదా అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు, భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతాయి.


12. స్వాములు, వారి కుటుంబం ఎవరిపట్ల కోపం, ఆవేశం ప్రదర్శించకూడని కారణంగా, అందరూ వారిని ప్రేమిస్తారు, అభిమానిస్తారు.


*మూలం: Own post, Facebook page ఈ జీవితం అయ్యప్పకు అంకితం నుండి*

కామెంట్‌లు లేవు: