🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*****
*శ్లో:- అవినయ మపహర౹ విష్ణో!*
*శమయ మనః ౹ దమయ*
*విషయ మృగ తృష్ణామ్౹*
*భూత దయాం విస్తారయ ౹*
*తారయ సంసార సాగరతః ౹౹*
*****
*భా:- సర్వ వ్యాపకుడవైన హే! భగవాన్! నాలో మాటిమాటికి పొడసూపుచున్న విద్యా, రూప, ధన, యౌవన,అధికార, ఇత్యాది అష్టవిధ "గర్వము"లను క్రమముగా పోగొట్టుము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములచే దారితప్పుతున్న "మనసు"ను నిగ్రహిస్తూ, నీ రూప,గుణ,లీలా ధ్యానము నందు మరలింపుము. దార, ధన, పుత్ర అనే త్రివిధ ఈషణములతో పాటు "తుచ్ఛమైన విషయ వాసనలనే ఎండమావులను" ఉపశమింపజేయుము. పుడమిపై గల సకల జీవకోటి యెడల పరిపూర్ణ "దయాస్వభావము"ను, ఆర్ద్రతను పెంపొందించుము. ఈద శక్యము గాని యీ ఘోర సంసార సాగరమును సులువైన ఉపకరణమైన నామస్మరణ మనెడి నావపై అపారకరుణచే దాటించి "ఉద్ధరింపుము". తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా, తోడూనీడగా సర్వము నీవై నా జన్మను ధన్యము చేయుము. నీ కివే నా సాష్టాంగదండప్రణామములు*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః.🙏
(శ్రీ లలితా సహస్రనామములలో ౫౦౫ వ నామము)
కం. పరవు, చతుర్వక్త్ర మనో
హరవు. సుగుణ చరితులకు స్పృహనుగొలిపెడి ని
న్నరయగ స్వాధిష్ఠానా
క్షరవు జనని., నిను నుతింతు, కావుము జగతిన్.🙏
అమ్మకు పాదాభివందనములతో🙏
చింతా రామకృష్ణారావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి