జగతి కనంత శక్తియుత సన్నుత ప్రభ్వివి, రాజ్యవల్లభా!
ప్రగణిత సత్యపాలన నిరంతర ధర్మముతోడ నొప్పగా
నగణిత దుష్టనాశిని వనంగ రహింతువు దేహమందు, నిన్
దగిన విధంబుగా నుడువ నాకు వశంబొకొ? అంజలించెదన్.🙏
109. ఓం మహాసక్త్యై నమః.🙏
శివశక్త్యైక్య విశిష్ఠ తత్వమెద భాసింపంగ తాద్రూప్యమున్
స్తవనీయంబుగ నొందుటందున మహాసక్తీ! ముదంబొందెదే?
జవసత్వంలు నీవె కాన శివునిన్ శక్తిన్ మదిన్ గల్పుమా.
శివశక్త్యైక్యము నాత్మఁ గొల్పి సుగతిన్ సిద్ధింపగా చేయుమా.🙏
అమ్మపాదములకు ప్రణమిల్లుచు🙏
చింతా రామకృష్ణారావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి