5, సెప్టెంబర్ 2021, ఆదివారం

గురువు

 గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు అని అర్దం.

చిన్నతనంలొ గురువు మేష్టారు (Teacher), కళాశాలలో అద్యాపకుడు (Lecturer), విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు (Professor) గాను పిలువబడతాడు. కాని చిత్రమేమిటంటే మేష్టారు అన్ని సబ్జక్టులు అంటే తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు, సామాన్య, సాంఘిక శాస్తాలలో విద్యా బోధనతో పాటు ఆటలు, పాటలు, కరంట్ ఎయిర్స్ (జనరల్ నాలెడ్జ్) రంగాలలో పిల్లల ఎదుగుదల, మానశికోల్లాసము మరియు మంచి భావిభారత పౌరులుగా స్థిరపడడానికి బీజం వేస్తాడు.

అధ్యాపకుడు తనకు నిర్దేశించిన విషయమును మాత్రమే వివరిస్తాడు. ఇక్కడ గురువు ప్రాధాన్యత తక్కవ. విద్యార్ధి యొక్క కృషి, అభిరుచుల ప్రాధాన్యత ఎక్కువ.

ఆచార్యుడు విద్యార్ధి యొక్క ఉత్సుకత, అభిరుచి, ఆసక్తతలను గమనించి విషయ జ్ఞానాన్ని అందిస్తారు.

వీరందరు కూడా గురువులే. 

కాని విద్యార్ది తన జీవిత కాలంలో తనపై ఎక్కువ ప్రభావాన్ని చూపిన గురువుని మాత్రమే జీవిత చరమాంకము వరకు జ్ఞప్తియందు ఉంచుకుంటాడు. 

కావున ఈ కాలంలో, తన శిష్యులు తమ జీవితాంతం గుర్తుంచుకునేలా మెలగవలసిన బాధ్యత గురువులపై ఎంతగానో ఉంది. అప్పుడే తమ శిష్యుల పురోభినృధ్దితో పాటు దేశానికి కూడా మంచి పౌరులని అందించిన వారౌతారు. 

ఈ దిశలో, మన తెలుగువాడు, ప్రియతమ నేత శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ, మన భావి తరాలకు మన భాష, సంప్రదాయాలను అందించే ప్రయత్నం చేద్దాం.

తెలుగులోనే చదువుట, వ్రాయుట, మాట్లడుట ప్రారంభిద్దాము. మన మాతృ భాషను గౌరవిద్దాము.

కామెంట్‌లు లేవు: