" సృష్టి రహస్యమనదగ్గ ప్రకృతి ఆరాధనకు ప్రత్యక్ష దార్శనికత వినాయక చవితి " విశ్వ జీవరాశి సంరక్షణ, సిద్ధి వినాయక దివ్య ఆశీఃఫలమై శోభించే తరుణమిది ! ప్రకృతి నేర్పెడి నిత్య సత్య చైతన్య స్ఫూర్తి, సన్మైత్రీ భావనాత్మక చింతన ! సకల జీవ ప్రశాంత మనుగడ, విశ్వ మానవాళి సన్మార్గ జీవన పథాన బంగరు భవితగ శోభించే క్షణం ! ఈ పవిత్ర పృధ్విపై ఆవిర్భవించిన ప్రకృతి శోభ, పచ్చని వనాలతో నిత్య చైతన్య దార్శనికత ! సకల లోక గణాలకు నాయకుడైన విఘ్నేశ్వరుడు, సమస్త విఘ్న నివారకుడన్నది, నిత్య సత్య వాక్కు ! "వినాయక చవితి పండగ ", ప్రకృతి ప్రసాదిత ఉత్పత్తుల ప్రత్యక్ష సద్వినిమయ దర్పణం ! జగజ్జనని పార్వతీ మాత ప్రియతమ తనయుడు వినాయకుడు, పరమేశ్వర కృపతో గజాననుడయ్యె ! సద్భక్తి పూర్వక మాతాపితరుల సేవ, వినాయకుని సకల లోక గణాలకధిపతిగ తీర్చిదిద్దిన వైనం ! సకల లోకాలందు, ప్రప్రథమ పూజలందుకునే గణేశుడు, గణాధ్యక్షుడై నిలిచెడి అభయ వరప్రదాత ! భక్తవత్సలుడై తన భక్తులు స్థిరచిత్తంతో ఒసగెడి ప్రకృతి ప్రసాదిత ఫలపుష్ప పత్రాదులను స్వీకరించి, వారి కోరికలీడేర్చే దేవదేవుడు ! గణేశారాధనలో వాడెడి ప్రకృతి ఉత్పత్తుల మహిమ వర్ణనాతీతం, సకలలోక సంపూర్ణ పరిరక్షణం ! సర్వకాల సర్వావస్థలందు విఘ్నేశ్వరుని నమ్మి కొలిచే భక్తాళికి ఎట్టి విపత్తి రాదనేది, పురాణేతిహాసాల సత్య చైతన్య దార్శనికత ! " ఓం గం గణపతయే నమః ", అనే మనఃపూర్వక నిత్య ఆరాధనా సంపూర్ణ ఫలం, సకల లోక పరిపూర్ణ సంరక్షణం ! 🙏🌹🌺🌹💐🌻🌹 💐🌻🌸🌹🙏🙏🙏 రచన : గుళ్లపల్లి ఆంజనేయులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి