5, సెప్టెంబర్ 2021, ఆదివారం

గుర్వనుగ్రహయాచనం

 🌻గుర్వనుగ్రహయాచనం🌻


సనాతనభారతీయ

సంస్కృతీ.

సంప్రదాయములు

పతనమవడానికి.

కొంతమనఅలసత్వం

కారణమవగా.

మరికొంత

కాలంబలీయమై

బుధ్ధులువక్రగతినపడి.

కాపాడుకోలేక

అచేతనమైస్థితిలో

ఉండిపోయామనేది.

వాస్తవమైనవిషయం.


ఇప్పటికైనాసరే.

పొరపాటుదొర్లిన

కొన్నివిషయాలను

విశ్లేషించుకుని

సవరణంగావించుకుందాం.

మరలా!

మనభావితరాలను

ఈసనాతనవైదికమార్గ

అనుయాయులుగ

తీర్చిదిద్దబడేందులకుగాను

మనవంతు

ప్రయత్నంచెద్దాము.


1;సంధ్యావందనంచేయనివిప్రులు.


2; నుదుటిన

బొట్టుపేట్టుకోవడానికి

నామర్దాపడేజనాలు.


3;వేదంచదవనినోరు.


4;ధర్మశాస్త్రచర్చరహితమైనబుధ్ధి.


5;శస్త్రంలేనిహస్తం.


6;శుధ్ధంలేనటువంటిమనస్సు.


7;శ్రధ్ధలేనటువంటికర్మ.


8;భక్తిలేనటువంటిఆరాధన.


9;అనుభవంలేనివేదాంతజ్ఞానం.


10;శుశ్రూషారహితమైనగుర్వాశ్రయం.


11;స్వార్థముతోవృత్తులను

చెపట్టడం.


12;దేశభక్తిరహితమైనసమాజం.


13;సంస్కారంనేర్పనిచదువులు.


14; వేదశాస్త్రాదులకొసం

త్యాగంచేయలేనిసంపద.


15.అనవసరమవిషయములపై

అన్వేషణంచేయుట.


16.మహదాచార్యుల

ప్రబోధములను

చింతనగావించకపొవుట.


ఈపదహారుఅంశములను

ప్రస్తుతపుతరం

ఈక్షణంనుండే

సవరణంగావించుకొనుట

ప్రారంభంచేసినయడల

భావితరమైనసరే.

సనాతనభారతీయ

ధర్మావలంబులై.

దేశభక్తి.దైవచింతన.

ధర్మరక్షణ.

సంస్కృతీ-సంప్రదాయ

అనుసరణం.వంటి.

మనమహర్షులు

ఉపదేశంచేసిన

పంథాను

అవలంబించి.

మరలా!మనభారతదేశమును

విశ్వమునకే

గురుస్థానములొనిలబేట్టి.

భరతమాతఖ్యాతిని

దశదిశలావ్యాపింపజేయగలరు.


ఇవన్నీ

మనంసాధించుటకుగాను

తగిశక్తియుక్తులను

ప్రసాదించమని

ఈఉపాధ్యాయ పర్వముదివసమునందు

మనపూర్వాచార్యులందరినీ

ప్రార్థిస్తూ. వాళ్ళఅనుగ్రహమును

యాచిస్తున్నాను...



జైగురుదేవ్ 

జైభారత్ మాత.


*పూషారక్షతునోవయమ్*


స్వస్తి

...జగర్లపూడివీరభద్రశర్మ...

కామెంట్‌లు లేవు: