5, సెప్టెంబర్ 2021, ఆదివారం

శ్రీమద్భాగవతము

 *05.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2252(౨౨౫౨)*


*10.1-1365-*


*క. బలభద్రుండును లోకులు*

*బలభద్రుం డనఁగఁ బెనఁగి పటుబాహుగతిన్*

*బలభేది మెచ్చఁ ద్రిప్పెను*

*బలవన్ముష్టికునిఁ గంసు బలములు బెగడన్.* 🌺



*_భావము: ఈ లోగా అక్కడ సభికులంతా బలరాముని చూచి "భేష్ బలరామా! నీవు మహా బలశాలివి", అంటున్నారు. అప్పుడు బలరాముడు, ఆ ముష్టిక మల్లునితో పోరాడి, తన భుజబలంతో బాహు విన్యాసాలతో బలాసురసంహారి యగు ఇంద్రుడు మెచ్చుకొనేటట్లుగా, ఆ ముష్టికుడిని గిరగిర తిప్పాడు. ఈ దృశ్యం చూసి కంసుని సేనలు భయంతో గడగడా వణికాయి._* 🙏



*_Meaning: Meanwhile the spectators turned on Balarama with encouraging accolades like, "You are great balarama!". He took on Mushtika and fought with him. Earning the praise of Indra, the killer of Balasura. Balarama then got hold of Mushtika and twirled and turned him round and round, causing bewilderment and consternation in the army of Kamsa._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కామెంట్‌లు లేవు: