ఆయనే ఘన చరిత కలిగిన!.....
జన గణ మన అంటూ!
జాతి గీతాన్ని ఎలుగెత్తి చాటి
వందే మాతరం అంటూ!
మనదే భారత మంటూ!
దేశ భక్తిని చాటి
మా తెలుగు తల్లికి
మల్లె పూదండ అంటూ!
మన తెలుగు తేజాన్ని
విశేషంగా ప్రశంసించి
విశ్వ నరు డై. నిలిచి
నిరక్షరాస్యత అనే
అజ్ఞాన తిమిరాన్నీ తొలగించి
అక్షరాస్యత అనే విజ్ఞాన జ్యోతిని
వెలిగించి
చక్కని క్రమశిక్షణను నేర్పి
మంచి విద్యాబుద్ధుల నీ నేర్పించి
విద్యార్థుల పురోగ తే తమ సోపానమనీ యెంచి
దేశభక్తిని నేర్పించి
మాతృ,పితృ,దైవ భక్తుల్ని కలుగజేసి
విద్యార్థుల భవితకు
చక్కని బాటను వేసి
జాతి జాగృతి కి. ప్రతి రూపాలుగా
నిలిచి
"ఆచార్య దేవోభవ",!....అంటూ!
ఈ జగతి చే సదా కీర్తింప బడే
వారే
ఈ వసుధ కు నిజమైన
అక్షర బ్రహ్మ!
నిజంగా!..ఆయనే!
ఘన చరిత కలిగిన ఉపాధ్యాయుడు!
(సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా!....)
దోస పాటి.సత్యనారా
యణ మూర్తి
రాజమహేంద్రవరం
9866631877
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి