5, సెప్టెంబర్ 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం*

 *5.09.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*


*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*6.1 (ప్రథమ శ్లోకము)*


*అథ బ్రహ్మాఽఽత్మజైర్దేవైః ప్రజేశైరావృతోఽభ్యగాత్|*


*భవశ్చ భూతభవ్యేశో యయౌ భూతగణైర్వృతః॥12376॥*


*6.2 (రెండవ శ్లోకము)*


*ఇంద్రో మరుద్భిర్భగవానాదిత్యా వసవోఽశ్వినౌ|*


*ఋభవోఽఙ్గిరసో రుద్రా విశ్వే సాధ్యాశ్చ దేవతాః॥12377॥*


*6.3 (మూడవ శ్లోకము)*


*గంధర్వాప్సరసో నాగాః సిద్ధచారణగుహ్యకాః|*


*ఋషయః పితరశ్చైవ సవిద్యాధరకిన్నరాః॥12378॥*


*6.4 (నాలుగవ శ్లోకము)*


*ద్వారకాముపసంజగ్ముః సర్వే కృష్ణదిదృక్షవః|*


*వపుషా యేన భగవాన్నరలోకమనోరమః|*


*యశో వితేనే లోకేషు సర్వలోకమలాపహమ్॥12379॥*


*శ్రీశుకుడు నుడివెను* శ్రీకృష్ణభగవానుని దర్శించుటకై బ్రహ్మదేవుడు ఒకనాడు ద్వారకకు విచ్చేసెను. అతనితోపాటు ఆయన కుమారులైన సనకాది మహామునులును, దేవతలును, ప్రజాపతులును ఏతెంచిరి. భూతపతియైన పరమశివుడు భూతగణముతోగూడి విచ్చేసెను. మరుద్గణసహితుడై ఇంద్రుడు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, అశ్వినీ దేవతలు, ఋభవుడు, అంగిరసుడు, ఏకాదశరుద్రులు, విశ్వేదేవతలు, సాధ్యగణములవారు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, యక్షులు, ఋషులు, పితృదేవతలు, విద్యాధరులు, కిన్నరులు మున్నగువారు అందరును శ్రీకృష్ణదర్శనమునకై బ్రహ్మదేవుని వెంట విచ్చేసిరి. శ్రీకృష్ణపరమాత్ముని యొక్క దివ్యరూప సౌభాగ్యము నరలోక వాసుల హృదయములను దోచుకొనునదియై యుండెను. ఆ ప్రభువు అద్భుతలీలా విలాసములతో తన యశస్సును దిగంతముల వరకును విస్తరింపజేసెను. ఆ లీలలను గానము చేసినవారు, విన్నవారు, కీర్తించినవారు సకలపాపములనుండి ముక్తులగుదురు.


*6.5 (ఐదవ శ్లోకము)*


*తస్యాం విభ్రాజమానాయాం సమృద్ధాయాం మహర్ద్ధిభిః|*


*వ్యచక్షతావితృప్తాక్షాః కృష్ణమద్భుతదర్శనమ్॥12380॥*


ఆ ద్వారకానగరము సకలభాగ్యభోగోపకరణాదులతో సమృద్ధమై తేజరిల్లుచుండెను. అందు విరాజిల్లుచున్న శ్రీకృష్ణప్రభువుయొక్క అద్భుతమైన రూపసౌందర్యమును గాంచి వారు కృతార్థులైరి. ఆ దివ్యరూపమును ఎంతగా దర్శించినను తనివితీరకుండెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: