శివానందలహరి
66_ వ శ్లోకం
" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ":
అవతారిక :
శంకరులు ఈ శ్లోకం లో తనను రక్షింపుమని
ఈశ్వరుణ్ణి కోరారు.
శ్లోకం :క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః
యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ ।
శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం
తస్మాన్మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా ।।66।।
తాత్పర్యము :
ಓ పరమేశ్వరా ! ಓ పశుపతీ ! నీవు నీ వినోదము
కొఱకే, ఈ సర్వ ప్రపంచాన్నీ సృష్టిస్తున్నావు. ఈ
జనమంతా నీ వినోదం కోసం ఏర్పడ్డ జంతువులు.
వారి వారి పెంపుడు జంతువుల నడవడులు, వారికి
ప్రేమాస్పదములు కావడం జగత్ప్రసిద్దమే. కాబట్టి
నేను చేసే సత్కర్మలు గానీ , దుష్కర్మలు గానీ, ఏ చేష్ట
లయినా, నీకు అవి తృప్తికరములే అవుతాయి.
కాబట్టి నీవు నన్ను రక్షింపవలసిన వాడవవు తున్నావు. (పిల్లలు తమ ఆట బొమ్మలను తాము
రక్షింౘు కొనే విధంగా నీవే నా రక్షణమును చేయ
వలసి యుంది ) అది నీ కర్తవ్యం.
వివరణ :
శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుడికి ఇలా నివేదించారు
" ಓ శంభూ ! పశుపతీ ! ఈ ప్రపంచాన్ని సర్వమునూ
నీవే నీ ఆట కోసం పుట్టిస్తూ వున్నావు. నీవు సర్వ వాంఛలూ తీరిన వాడవు. అలాటప్పుడు ఈ పంచ
భూతాలు అనే ముడి పదార్థాల తో నీవు నిర్మించే ఈ
ప్రపంచం , నీవు సరదాగా ఆడుకోవడం కోసమే. ఈ
ప్రపంచములోని జనులంతా నీ చేతి లోని కీలు బొమ్మ
లు. వీరంతా నీ విలాసం కోసం సృష్టింౘ బడ్డ మృగాలు. వీరు నీ వాడించి నట్లల్లా ఆడుతారు.
నీవు తిప్పేవాడవు వారు తిరిగేవారు. నీవు జగన్నాటక సూత్ర ధారివి. ఈ ప్రపంచానికీ దీనిలోని
ప్రజలకు ఏమాత్రం స్వతంత్ర త లేదు. భగవద్గీత లో
పరమాత్మ సైతమూ ఇలాగే చెప్పాడు.
" ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతానియంత్రారూఢానిమాయయా
తాత్పర్యము :
అర్జునా! శరీర రూప యంత్రములను అధిరోహించిన
సర్వ ప్రాణుల హృదయాలయందూ, అంతర్యామి గా ఉన్న పరమేశ్వరుడు, తన మాయ చేత వారి వారి
కర్మలననుసరించి వారిని తిప్పు తున్నాడు.
కాబట్టి నాతప్పేమీ లేదు . నేను చేసిన తప్పేదైనా
వుంటే నేను ఒకడిని ఉన్నానని అనుకోవడం మాత్రమే
ప్రపంచములో ఉన్నదంతా నీవే. అందువల్ల నేను
మంచి చేసినా ,చెడు చేసినా అది నీకు ప్రీతికరంగా
ఉండాలి . నేను చేసిన చేష్టలన్నీ నీ వేడుకకు సాధన
ములు. కాబట్టి నన్ను రక్షింౘడం నీ కర్తవ్యం.
తోలుబొమ్మలాట లో బొమ్మ లన్నీ సూత్రధారుని
ఇష్టాను సారంగా తిరిగి వినోదాన్ని కల్పిస్తాయి. అదే
విధంగా జగన్నాటక సూత్రధారుడైన పరమాత్మ
ఇచ్ఛాను సారంగా నడిపే మన జీవిత రూపమైన ఈ
జగన్నాటకం , పరమేశ్వరుని కి వినోదాన్నే కల్పిస్తుంది.
LIKE | COMMENT | SHARE |
🔱 శివానందా రూపం శివం శివం 🔱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి