26, అక్టోబర్ 2020, సోమవారం

నవగ్రహాల అనుగ్రహానికి

 *నవగ్రహాల అనుగ్రహానికి.. ‘ఓం సహస్ర రశ్మయే నమః’*


*నమోస్తు సూర్యాయ సహస్ర రశ్మయే*

*సహస్ర శాఖాన్విత సంభవాత్మనే*

*సహస్ర యోగోద్భవ భావ భాగినే*

*సహస్ర సంఖ్యాయుధ ధారిణే నమ:*


జ్యోతిషశాస్త్రం ప్రకారం శుభాశుభ గ్రహాలుంటాయి. అవి అన్నీ మనకు శుభాన్నే కలిగించాలన్నా, ఆయా గ్రహాలు మనపై అనుగ్రహ వర్షాన్ని కురిపించాలన్నా వాటిని నియంత్రించే *సహస్ర కిరణ తేజస్సును* ప్రార్థించాల్సి ఉంటుంది. 


మన శరీరం కూడా పూర్తి సౌర మండలమే. *మన హృదయం, ప్రసరణ వ్యవస్థలు రవికి ప్రతీకలు. మనస్సు, ఇంద్రియాలు, జీర్ణ వ్యవస్థలన్నీ చంద్రునికి ప్రతీకలు.*


 అదే విధంగా *నాడీ వ్యవస్థకు బుధుడు, హార్మోన్‌ల వ్యవస్థకు శుక్రుడు, ఎముకలు, కండర కణజాల వ్యవస్థలకు కుజుడు, విసర్జక- శ్వాస వ్యవస్థలకు శని, దురాశకు రాహువు, నిరాశకు కేతువు సంకేతాలుగా* కారణాలవుతున్నాయి. 


 *భూమిచుట్టూ ఉన్న గ్రహాలు భూమికి వేర్వేరు దిశల్లో ఉన్నప్పుడు భూవాతావరణంలో మార్పు వచ్చినట్లుగానే, మన జాతకాలలో ఉన్న గ్రహాలు లగ్నానికి వేర్వేరు దూరాల్లో ఉన్నప్పుడు ప్రభావాలు వేరుగా* ఉంటుంటాయి. 


ఈ ప్రభావం ఎప్పటికీ అనుకూలంగానే ఉంచుకోవడానికి *ఆయా గ్రహాలకు అధినాథుడైన సూర్య భగవానుని ప్రార్థించడం* ఉత్తమం. 


 *‘సహస్ర’ అంటే ‘అనేకం’. ‘రశ్ములు’ అంటే ‘కిరణాలు’ లేదా ‘పగ్గాలు’. ‘రశ్మి’* అంటే వ్యాపించింది. 


అనేక కిరణాలతో మనలో వ్యాపించేవాడు *సహస్ర రశ్మి* .


 మనకు *వేర్వేరు గ్రహాల వల్ల ఏర్పడిన బంధనాల (పగ్గాలు)ను తొలగింపజేసి మనలో అనంతమైన శక్తిని ప్రసరింపజేయడానికి సహస్ర రశ్ములను వినియోగించుకుంటాడు* సూర్యుడు. 


 *గ్రహపతి అయిన సూర్యుని సహస్ర రశ్మి శబ్దాన్ని నిరంతరం జపించడం ద్వారా నవగ్రహాల వ్యతిరేకమైన కిరణ ప్రభావం తొలగిపోతుంది* .


 *జ్ఞానం, ప్రకాశం, తేజస్సు, కీర్తి, సంపదలకు ఆలవాలమైన సహస్ర రశ్ముల ప్రభావంతో నవగ్రహ అనుగ్రహం అధికంగా* కలుగుతుంది. 


అందుకోసం, *ప్రతిరోజూ కనీసం 1 గంటసేపు ‘ఓం సహస్ర రశ్మయే నమ:’ అని జపించడం ద్వారా నవగ్రహాల అనుగ్రహం కలిగి, ఆనందం అధికమవుతుంది.* 


*✍ సాగి కమలాకరశర్మ*

కామెంట్‌లు లేవు: