26, అక్టోబర్ 2020, సోమవారం

రామాయణమ్ .104

 రామాయణమ్ .104

...

భరతుడిని ఇంకా రాజధర్మాల విషయంలో ప్రశ్నిస్తూనే ఉన్నాడు శ్రీ రాముడు.

.

అమాత్యులు శాస్త్రపండితులయినవారు    

మంత్రాంగపు ఆలోచనలను తమలోనే రహస్యముగా ఉంచుకొంటున్నారుకదా ! 

బహిర్గతపరచటములేదు కదా ! 

(రహస్యముగా ఉంచుకొన్న వారివలననే రాజుకు విజయం లభించేది).

.

నీవు నిద్రకు వశుడవ్వటం లేదుకదా ! 

తగుకాలమునందే మేల్కొనుచున్నావు కదా ! వివిధములయిన కార్యములను గురించి తెల్లవారుఝామునందే ఆలోచిస్తున్నావు కదా!

.

నీవు ఒక్కడవే ఆలోచించటంలేదు కదా! 

అలాగని చాలా మందితో ఆలోచించటంలేదు కదా! .

నీ ఆలోచనలు రాజ్యములోని వారికి తెలిసిపోవడం లేదుకదా! (Secrecy Maintain చేస్తున్నావు కదా అని అర్ధం).

.

స్వల్పమైన ప్రయత్నముతో ఎక్కువ ఫలితాలు సాధించకలిగే కార్యములను నిశ్చయించి ఏ మాత్రము ఆలస్యము లేకుండా వెంటనే ప్రారంభిస్తున్నావు కదా!

.

ఇతరులకు నీవేమి చేయదలుచుకున్నావో మునుముందు తెలియకుండా ఉంటున్నది కదా!.

.

నాయనా ఇతరులెవ్వరూ ...

ఊహలచేత కానీ ,యుక్తిచేతగానీ, 

ఇతరములయిన ఏ ఉపాయము చేత గానీ నీవు ,

నీ మంత్రులు చేసిన ఆలోచనలు తెలుసు కొనడం లేదు కదా ! (Strictly Confidential).

.

వేయిమంది మూర్ఖుల కన్నా ఒక్కడు మేధావీ,శూరుడు,సమర్ధుడు అయిన  పండితుడిని చేరదీస్తే చాలు.

ఎందుకంటే సంకటస్థితిలో పండితుడే గొప్ప సహాయము చేయగలడు. మూర్ఖులు వేలకొద్దీ నీ చుట్టూ ఉన్నప్పటికీ అవసరమైన పరిస్థితి లో ఒక్కడూ ఉపయోగపడడు.

.

నీవు అధిక సామర్ధ్యము కలవారిని గొప్పపనులు చేయుటకు ,

మామూలు సామర్ధ్యము గలవారినీ చిన్నపనులు చేయుటకు ,

అతితక్కువ సామర్ధ్యము కలవారిని అధమమైన కార్యములు చేయుటకు వినియోగిస్తున్నావు కదా! .

.

NB.

.

( సేవకుడి సామర్ధ్యాన్ని Capabilities ని ప్రభువు గమనిస్తూ ఉండి తదనుగుణంగానే పనులు అప్పగించాలి .అంతే గానీ ఎవడెక్కువ భజన చేస్తే వాడికి కాదు.)

.

.ఇంకావుంది


వూటుకూరు జానకిరామారావు 

.

కామెంట్‌లు లేవు: