*⛑️లవంగాలు - ఉపయోగాలు⛑️*
*శ్రీ ఆంజనేయస్వామి కి జయవారం నాడు ఐదు తమలపాకులు లో ఐదు లవంగాలు నైవేద్యం పెడితే...ఋణ విముక్తులౌతారు*
*లవంగాలు … ఆరోగ్యానికి మేలు*
లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాదు .. విలువైన పోషకాలు ఉన్నాయి ....
ఇండోనేషియాలోని స్పైస్ ఐల్యాండ్స్ గా పిలిచే మొలక్కస్ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బ్రెజిల్, ఇండియా, వెస్టిండీస్, మారిషస్, జాంజిబార్, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు. మిర్టేసీ మొక్క నుండి కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారి లవంగాల ఆకారాన్ని సంతరించుకుంటాయి.
ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగించే ఈ లవంగాల నుండి నూనెలను కూడా తీస్తారు. ఎన్నో ఔషధగుణాలున్న ఈ లవంగాలను ఏవిధంగా ఇంటిచిట్కాల్లో ఉపయోగించాలో తెలుసుకుందాం.
లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల జలుబు, సైనస్, దగ్గు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆ నీటిలో కొంచెం తేనే కలిపి తాగడం ద్వారా అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతుంది.
నోటి దుర్వాసనతో బాధపడే వాళ్లు ఓ లవంగాన్ని బుగ్గన పెట్టుకుంటే ఆ సమస్య తగ్గుతుంది.
పంటినొప్పితో బాధపడేవాళ్లు రోజూ ఓ లవంగాన్ని నములుతూ ఉంటే క్రమేపీ పంటి నొప్పి తగ్గుతుంది.
ముక్కు దిబ్బడగా ఉన్నప్పుడు.. కర్చీఫ్ మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఏడెనిమిది లవంగాలను నీటిలో వేసి మరిగించి ఆవిరి పడితే త్వరిత ఉపశమనం లభిస్తుంది.
లవంగంలోని 'యుజెనాల్' కు నులిపురుగులను నాశనం చేసే శక్తి ఉంది. చిన్నపిల్లలకు కడుపులో నులిపురుగులు చేరినప్పుడు లంవంగరసాన్ని పాలలో కలిపి ఇస్తే ఆ పురుగులు తగ్గుతాయి.
కొవ్వు తగ్గించుకోవాలనేకునే వారు రోజూ ఒక లంవంగం తింటే తగ్గుతుంది.
లవంగాలను నూరి, పటికబెల్లంతో సేవిస్తే కడుపులో మంట తగ్గుతుంది.
వాంతులు, కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
టీలో లవంగాలు, తులసి, పుదీనా, యాలకలను వేసి మరిగించి తాగితే నరాలకు శక్తి లభించడమే కాక మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే.. ఇవి తీసుకోవాల్సిందే…
అయితే గర్భిణులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు, బౌల్ సిండ్రోమ్‌తో బాధపడేవాళ్లు దీన్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. మరీ ఎక్కువగా వాడితే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.
💠💠💠💠💠💠💠
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి