*🚩కాశీలో దిగగానే ఏం చేయాలి? అక్కడ ఏం చూడాలి ?*🚩
కాశీ.. వారణాశి. సాక్షాత్తు కైలాసనాథుడి దివ్యక్షేత్రం. ఆ క్షేత్ర దర్శనం జన్మరాహిత్యం కలిగిస్తుంది. అయితే ఆ క్షేత్రంలో.. ఏం చూడాలి? అక్కడ క్షేత్రంలో సందర్శించాల్సిన ప్రదేశాలు గురించి తెలుసుకుందాం.కాశీ లో ప్రవేశించగానే ముందుగా..కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి. బస చేరుకున్న తరువాత ముందుగా.. గంగా దర్శనం..గంగా స్నానం. కాలభైరవుని దర్శనం కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం కాశీ విశ్వేశ్వరుని దర్శనం (ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది) కాశీ భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది. అన్నపూర్ణ దర్శనం భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది).
కాశీ విశాలాక్షి దర్శనం వారాహి మాత గుడి ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు. లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు.
మణికర్ణికా ఘట్టంలో స్నానం. (వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి) గంగా హారతి - దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు) కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం చింతామణి గణపతి దర్శనం అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ లోలార్కఈశ్వరుని దర్శనం దుర్గా మందిరము గవ్వలమ్మ గుడి తులసీ మానస మందిరము సంకట మోచన హనుమాన్ మందిరం. తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం. తిలాభాండేశ్వర దర్శనం.
వీలైతే సారనాధ్ స్థూపం బుద్ధ మందిరం ఇది కొంతదూరంగా ఉంటుంది. ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్.గంగా నదీ ఘట్టాల దర్శనం అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు. ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి. ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు. గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి. లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు.
🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి