మానవ దేహం జీవంతో కూడిన యంత్రం. వారి జీవం యంత్రంలోకి ప్రవేశిస్తే అది నిరంతరం గమనం కలిగియుంటుంది. లేనియెడల వృధ్ది చెందదు. మానవ పరిణామ క్రమం ఆగిపోవును. దేహంలోని శక్తి ప్రవేశించిన తరువాత మాత్రమే అనగా యంత్రం నుండి శక్తి వుత్పత్తై మళ్ళీ దేహంలోనికి ప్రవేశించి మళ్ళీ వృధ్దినొంది ప్రకాశించుచున్నది. దేహంలేని యెడల ప్రకాశించదు ఆత్మ. ఆత్మ అనగా సూక్మరూపమైన అణువు అని పిలవబడే వృధ్ధనొందు లక్షణము కలిగియుండాలి. అందుకే నారు పోసినవాడు నీరు పోయు. నారు పురుషుడు నీరు స్త్రీ అని పురుషుడు కూడా కారకుడు మాత్రమే దానికి కూడా ప్రకృతి రూపమైన స్ర్తీ మూలము. ఏ లక్షణము అనగా దాని ధర్మం జ్యోతిష శాస్త్రం వలననే తెలియును. అనగా దీనికి ఉదాహరణ ప్రహ్లాదుడు. రాక్షసప్రవృతి గల దేహంలోకి దైవ లక్షణములు గల జీవి జీన్ ప్రవేశించుట. యిది ఎలా అసంభవం కదా. కాని అది హిరణ్యకశిపుడు అనే జీవి దేహంలోంచి మాత్రమే ఉద్భవించింది. ఆయన తన జీవి ప్రేరణ యే. అది ఆయన మరణ రూపంలో యున్న కోరిక. ప్రహ్లాదుడు కారకత్వం మాత్రమే నరసింహం ఆవిర్భవించింది. సూత్ర కారకుడు హిరణ్యకశ్యపుడే. మనం కూడా కారణం మాత్రమే కారకుడు జీవులు. ఎవరికి వారు కారకులు ఎవరికి ఎవరూ సంబంధం కాదు. ఎవరి దేహ కారణ శరీరం, మరియు వారి ఆత్మ లక్షణము వారి స్వతంత్రము. దీనికి మాతా పితరులు కారకులు మాత్రమే. కారణము ఎవరిది వారిదే. తండ్రి లాగ కొడుకు నుండడు. కొడుకు లాగ తండ్రి వుండడు.యిది అనుకోవడమే వక మాయ. కొడుకు లక్షణము మాయమాయకు అతీతుడైనవానికి తెలుస్తుంది. అది దాని స్వతంత్రతను బట్టి వాటి లక్షణములు తెలియును. అందువలన ఏ జీవి ఉధ్దరణ ఆజీవిదే. దేహమున్నంతవరకే ఆలోచించి తెలుసుకొని ఆచరణలో వున్న గాని ఎఱుక పడదు. ఎఱుక అనగా ఙ్ఞానమే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి