26, అక్టోబర్ 2020, సోమవారం

*స్థిత ప్రజ్ఞుని

 *స్థిత ప్రజ్ఞుని లక్షణములు*

💫🌞🌏🌙🌟🚩

🕉ఓంశ్రీమాత్రేనమః🕉

అద్వైత చైతన్య జాగృతి

💫🌞🌏🌙🌟🚩


*(గీత 2వ అధ్యాయమున 55వ శ్లోకము నుండి)*


*1) కోర్కెలను విడచినవాడు (ప్రజహాతి కామాన్‌).*


*2) ఆత్మయందు సంతుష్టి బొందువాడు (ఆత్మన్యేవాత్మనా తుష్టః).*


*3) దుఃఖములందు క్షోభ నొందకుండవాడు (దుఃఖేష్వను ద్విగ్న మనాః).*


*4) సుఖములయం దాసక్తి లేకుండువాడు (సుఖేషు విగత స్పృహః).*


*5) రాగ, భయ, క్రోధములు లేనివాడు (వీత రాగ భయ క్రోధః).*


*6) సమస్త విషయములయందును అభిమానము లేనివాడు (యస్సర్వ త్రాభిస్నేహః).*


*7) ప్రియా ప్రియములు సంభవించినను. సంతోషముగాని ద్వేషముగాని లేనివాడు (తత్తత్ప్రాప్యశుభాశుభమ్‌ నాభినందతి నద్వేష్టి).*



 *విషయము నింద్రియముల నుండి మరల్పువాడు (యదా సంహరతే చా యం కూర్మోంగాని వ సర్వశః ఇంద్రియా ణీంద్రియార్ధేభ్య స్తస్యప్రజ్ఞా ప్రతిష్ఠితా ||*


*గీతా 2-58) భక్తుని లక్షణమలు:-*


*(గీత 12వ అధ్యయమున 13వ శ్లోకమునుండి)*



*1) ఏ ప్రాణిని ద్వేషింపకుండుట.*


 *2) మైత్రి.*


*3) కరుణ.*


*4) మమత్వము లేకుండుట.*


 *5) అహంకారము లేకుండుట.* 


*6) సుఖదుఃఖము లందు సమత్వము.* 


*7) ఓర్పు  నిత్య సంతుష్టి.*


*9) మనో నిగ్రహము.*


*10) దృఢ నిశ్యయము.*


*11) మనోబుద్ధులను భగ వంతునకు సమర్పించుట.* 


*12) లోకమువలన తాను గాని తన వలన లోకముగాని భయపడకుండుట.* 


*13) హర్షము క్రోధము భయము లేకుండుట.*


*14) దేనియందును అపేక్షలేకుండుట.*


 *15) శుచిత్వము కలిగియుండుట.*


*16) కార్య సామర్థ్యము.*


*17) తటస్థత్వము.*


*18) మనోవ్యాకులత లేకుండుట.* 


*19) సర్వ కర్మఫల త్యాగము.*


 *20)హర్షము లేకుండుట.* 


*21) ద్వేషము లేకుండుట.* 


*22) శోకము లేకుండుట.* 


*23)కోరిక లేకుండట.* 


*24) శుభాశుభ పరిత్యాగము.*


*25) శత్రుమిత్రులందు సమత్వము.* 


*26) మానావ మానములయందు సమభావము.* 


*27) శీతోష్టములందు సమత్వము.*


 *28) సుఖదుఃఖము లయందు సమ భావము.*


 *29) సంగవర్జిత్వము.*


 *30) నిందాస్తుతు లందు సమత్వము.*


 *31)మౌనము.*


*32) దొరకిన దానితో సంతుష్టి.* 


*33) నివాసము నందభిమానము లేకుండుట.* 


*34) స్థిరబుద్ధి.* 


*35) భగవంతుని యందు భక్తి.*



*స్థితప్రజ్ఞునికి చెప్పిన లక్షణములను పరిశీలించిన భక్తుని లక్షణములు నవియేయని గమనించవచ్చును.*


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: