రాతికి ప్రాణం ఉంటుందా అని బ్రిటిష్ గవర్నర్ హేళన చేసి నివ్వెరపోయి తాను కూడా గణపతి భక్తుడిగా మారడానికి కారణం ఏమిటి ???
మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉన్నవి. అలాంటి అరుదైన అద్భుత ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. బ్రిటిష్ కాలంలో అప్పటి గవర్నర్ ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేస్తుంటే వచ్చి రాతికి ప్రాణం ఉంటుందా అని హేళన చేయగా , ఒక సిద్ధయోగి దాన్ని రుజువు చేసి ఆ గవర్నర్ నమస్కరించేలే చేసాడు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట అప్పుడు ఎం జరిగిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేరి జిల్లాలో కుర్తాళం ఉంది. ఇక్కడే మౌనస్వామి మఠం, కుర్తాల పీఠం, గణపతి ఆలయం ఉన్నవి. ఇక్కడ అద్భుత జలపాతం ఉండగా ఇందులోని మూలికలు ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తాయని నమ్మకం మాత్రమే కాదు పరిశోధనలలో రుజువు అయింది. ఇక్కడ ఉన్న చిత్రావతి జలపాతం దాదాపుగా అరవై అడుగుల ఎత్తు నుండి చాలా వేగంగా క్రిందకు దూకుతుంది. ఇక్కడ అనేక రకాల మూలికలు దొరకడమే కాదు మానసిక వికలాంగులు ఈ నీటిలో స్నానం చేస్తే ఎన్నో శారీరక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు.
ఇక గణపతి ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ ఉన్న గణపతి ని ‘నాడి గణపతి’ అని పిలుస్తారు. ఇలా నాడి గణపతి అని పిలవడానికి కారణం ఏంటంటే, మహా సిద్ధయోగి మౌనస్వామి తపస్సుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ఒక మఠాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ముందుగా శ్రీ సిద్దేశ్వరి అమ్మవారిని ప్రతిష్టించారు. ఆ తరువాత ఇక్కడ గణపతి దేవుడిని ప్రతిష్టించి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయాలనీ భావించగా, అది తెలిసిన మద్రాస్ గవర్నర్ ఎడ్వార్డ్ రాతికి ప్రాణ ప్రతిష్ట ఏంటి అంటూ అనడంతో ఆ సిద్ద యోగి ఒక వైద్యుడిని పిలిపించమని చెప్పగా అతడు పిలిపించగా, మౌనస్వామి వైద్యుడితో విగ్రహానికి నాడి పరీక్షించామని చెప్పగా అతడు కూడా విగ్రహానికి ప్రాణం ఉండదు కదా అంటూ పరీక్షించి నాడి చప్పుడు లేదని చెప్పగా, అప్పుడు మౌనస్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి ఇప్పుడు చూడండి అని చెప్పగా స్టెతస్కోప్ తో పరిశీలించగా ఆ వైద్యుడిలో ఒక ఆశ్చర్యం గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకుంటుందని చెప్పాడు.
దింతో ఈ అద్భుతాన్ని చూసిన ఆ వైద్యుడు ఇంకా బ్రిటిష్ గవర్నర్ మౌనస్వామి దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకొని గణపతికి నమస్కరించి అక్కడి నుండి వెళ్లారు. ఇలా మౌనస్వామి మహిమ తో ఇక్కడ వెలసిన గణపతి దేవుడికి నాడి గణపతి అనే పేరు వచ్చినది. అయితే ఇక్కడ స్వామివారి తొడల నుండి శబ్దం వచ్చినదని అందుకే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా ధోవతి కడతారు.
ఇలా ప్రకృతి ఒడిలో వెలసిన ఈ మహిమ గల ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వచ్చి నాడి గణపతిని, మౌనస్వామి మఠాన్ని, శ్రీ సిద్దేశ్వరి పీఠాన్ని దర్శిస్తుంటారు.🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి