18, నవంబర్ 2021, గురువారం

బ్రహ్మవిద్యను

 మొదటి రెండు అధ్యాయాలలోను బ్రహ్మవిద్య గురించి వచ్చింది; మూడవ అధ్యాయంలో నిర్గుణ బ్రహ్మను సగుణ బ్రహ్మగా చూపించి గురువు ద్వారా బ్రహ్మవిద్యను పొందాలని సూచించింది.

బ్రహ్మవిద్యను గురుశాస్త్ర ఉపదేశం ద్వారానే పొందగలము. అది పొందటానికి మనకు అధికారత్వం కూడా ఉండాలి. ఉదాహరణకు మన అందమైన మొహం మనం చూసుకోవాలనుకుంటే, దానికి ఏం కావాలి? కన్ను, అద్దం.

అద్దం ఎంత బాగున్నా, మన కన్ను కనపడకపోతే మనం అద్దంలో చూసుకోలేము. అలాగే కన్ను ఎంత అందంగా ఉన్నా, అద్దం లేకపోతే మన మొహం చూసుకోలేము. అలాగే ఆత్మజ్ఞానం పొందాలంటే రెండు కావాలి. సంసిద్ధమైన అంతఃకరణం, గురుశాస్త్ర ఉపదేశం. అంతఃకరణం కన్ను లాంటిది; గురుశాస్త్ర ఉపదేశం అద్దం లాంటిది. మనం సంసిద్ధమైన మనస్సుతో లేకపోతే గురువు శాస్త్రం ఎంత చెప్పినా అర్థం కాదు. అలాగే మనం ఎంత సంసిద్ధంగా ఉన్నా, గురుశాస్త్ర ఉపదేశం లేకపోతే ఆత్మజ్ఞానం పొందలేము. ఉపనిషత్తు గురువునూ, శాస్త్రాన్ని కలిపి చెపుతుంది. ఎందుకంటే శాస్త్రంలో ఉన్న విద్యే గురుపరంపరగా వస్తుంది. దాన్నే గురువు శిష్యునికి నేర్పిస్తాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయించవచ్చు. శాస్త్రం అర్థంచేసుకోవటం కష్టమా, తేలికా? ఒకచోట తేలిక అంటుంది. ఒకచోట కష్టం అంటుందిm

. సుసుఖం కర్తుమవ్యయమ్ గీత 9-2

ఈ విద్య నేర్చుకోవటం చాలా తేలిక.

క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తత్కవయో వదని

కథ 1-3-14

విద్య నేర్చుకోవటం క్షురకుని పదునైన కత్తి అంచుమీద నడవటంలాంటిది. ఏది నిజం? రెండూ నిజమే. మనసు సంసిద్ధంగా ఉంటే, బ్రహ్మ విద్యను అర్థం చేసుకోవటం చాలా తేలిక. మనస్సు సంసిద్ధంగా లేకపోతే అర్థం చేసుకోవటం

కేనోపనిషత్తు

చాలా కష్టం. మొదటి రెండు అధ్యాయాలు అర్థమయితే మీ మనస్సు సంసిద్ధంగా ఉన్నట్టు; అర్థం కాకపోతే సంసిద్ధంగా లేనట్టు అర్థం. మనసు సంసిద్ధంగా లేకపోతే నేను వెనక్కి భక్తియోగానికి వెళ్ళిపోతాను అనకూడదు. ఒకసారి జ్ఞానమార్గానికి వచ్చాక, దానిలో కొనసాగటానికి ప్రయత్నించాలి. మనస్సు సిద్ధంగా లేకపోతే సిద్ధం చేసుకోవటమే మార్గం.

అదికూడా ఉపనిషత్తే సూచిస్తుంది. ఇంతవరకూ ఉపనిషత్తు జ్ఞానమార్గం చెప్పి ఇందులో రెండు రకాలు సాధనలు కూడా చెపుతున్నది.

1. కర్మయోగం

2. ఉపాసనాయోగం

గుర్తుంచుకోండి, ఇవి మోక్షాన్ని ప్రత్యక్షంగా ఇవ్వవు. మోక్షం పొందటానికి సహకారీ సాధనలవుతాయి. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ఏర్పరుస్తాయి. వాటి తర్వాత మళ్ళీ మొదటి రెండు అధ్యాయాలు చదివితే బాగా అర్థమవుతుంది.

కొంతమంది విద్యార్థులు కొన్నేళ్ళు స్వామీజీ బోధలు విన్నాక, స్వామీజీ ఇప్పుడు మీరు ఇంకా బాగా చెపుతున్నారు అంటారు. అంటే వారికి బాగా అర్థమవుతున్నదని అర్థం. అందువల్ల స్వామీజీ దాన్ని పట్టించుకోకుండా, వారికి విషయం బాగా తెలుస్తున్నదని సంతోషిస్తారు. అందువల్లనే పదే పదే శ్రవణం చేయాలని చెబుతారు. కేనోపనిషత్తు మళ్ళీ మళ్ళీ వినాలంటే ఎవరికైనా బోరు కొడుతుంది కాని, వేరే ఉపనిషత్తు చెబుతారంటే మళ్ళీ శ్రద్ధగా వెళతారు. కొత్త గురువు, కొత్త కేనోపనిషత్తు

చాలా కష్టం. మొదటి రెండు అధ్యాయాలు అర్థమయితే మీ మనస్సు సంసిద్ధంగా ఉన్నట్టు; అర్థం కాకపోతే సంసిద్ధంగా లేనట్టు అర్థం. మనసు సంసిద్ధంగా లేకపోతే నేను వెనక్కి భక్తియోగానికి వెళ్ళిపోతాను అనకూడదు. ఒకసారి జ్ఞానమార్గానికి వచ్చాక, దానిలో కొనసాగటానికి ప్రయత్నించాలి. మనస్సు సిద్ధంగా లేకపోతే సిద్ధం చేసుకోవటమే మార్గం.

అదికూడా ఉపనిషత్తే సూచిస్తుంది. ఇంతవరకూ ఉపనిషత్తు జ్ఞానమార్గం చెప్పి ఇందులో రెండు రకాలు సాధనలు కూడా చెపుతున్నది.

1. కర్మయోగం

2. ఉపాసనాయోగం

గుర్తుంచుకోండి, ఇవి మోక్షాన్ని ప్రత్యక్షంగా ఇవ్వవు. మోక్షం పొందటానికి సహకారీ సాధనలవుతాయి. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ఏర్పరుస్తాయి. వాటి తర్వాత మళ్ళీ మొదటి రెండు అధ్యాయాలు చదివితే బాగా అర్థమవుతుంది.

కొంతమంది విద్యార్థులు కొన్నేళ్ళు స్వామీజీ బోధలు విన్నాక, స్వామీజీ ఇప్పుడు మీరు ఇంకా బాగా చెపుతున్నారు అంటారు. అంటే వారికి బాగా అర్థమవుతున్నదని అర్థం. అందువల్ల స్వామీజీ దాన్ని పట్టించుకోకుండా, వారికి విషయం బాగా తెలుస్తున్నదని సంతోషిస్తారు. అందువల్లనే పదే పదే శ్రవణం చేయాలని చెబుతారు. కేనోపనిషత్తు మళ్ళీ మళ్ళీ వినాలంటే ఎవరికైనా బోరు కొడుతుంది కాని, వేరే ఉపనిషత్తు చెబుతారంటే మళ్ళీ శ్రద్ధగా వెళతారు. కొత్త గురువు, కొత్త శిష్యుడు, కొత్త ప్రశ్న, కొత్త మార్గంలో జవాబు, కొత్త పద్ధతిలో వివరణ కాని విషయం మాత్రం అదే. బ్రహ్మవిద్య! జీవ, ఈశ్వర ఐక్యం! జ్ఞానం కలుగుతుంది.

అధ్యాయం-4లో 4 అంగాలను చెపుతున్నది ఉపనిషత్తు. 1. బ్రహ్మవిద్యాస్తుతి 2. కర్మయోగ సాధన 3. ఉపాసన సాధన 4. దైవీ సంపత్తి ఈ నేపథ్యంతో అధ్యాయంలోకి అడుగుపెడదాము.

121, కొత్త ప్రశ్న, కొత్త మార్గంలో జవాబు, కొత్త పద్ధతిలో వివరణ కాని విషయం మాత్రం అదే. బ్రహ్మవిద్య! జీవ, ఈశ్వర ఐక్యం! జ్ఞానం కలుగుతుంది.

అధ్యాయం-4లో 4 అంగాలను చెపుతున్నది ఉపనిషత్తు. 1. బ్రహ్మవిద్యాస్తుతి 2. కర్మయోగ సాధన 3. ఉపాసన సాధన 4. దైవీ సంపత్తి ఈ నేపథ్యంతో అధ్యాయంలోకి అడుగుపెడదాము.

121

కామెంట్‌లు లేవు: