🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌷మదర్స్ డే! - ఫాదర్స్ డే!🌷*
( శ్రీ చెరుకు రామమోహనరావు)
🌷🌷🌷
మదర్స్ డే --ఫాదర్స్ డే .........
దయ వుంచి ఓపికతో ఒక్క సారి చదవండి. చదివి మీ అభిప్రాయం తెలుపండి. బాగుంటే పదిమంది తో పంచుకోండి.
సంక్రాంతి సందడి ముగిసింది. సెలవరోజు సంబరాలు. తలంటి స్నానాలు. కొత్త బట్టలు. పొంగళ్ళు, పూజలు. దేవాలయ సందర్శనాలు. బంధుమిత్రులకు శుభాభినందనలు. మిఠాయి పంపకాలు. మృష్ఠాన్న భోజనాలు. అన్నిటినీ అనుభవించి అలసి నిద్రాదేవిని ఆహ్వానిస్తున్నవేళ ఒక చిన్న ఆలోచన చిగురించింది.
ఈ పండగలన్నిటి చారిత్రక, పౌరాణిక కారణాలు ఏమైనప్పటికీ…నా అభిప్రాయములో…మూలాన వున్న కారణము…చెడుపై మంచి సాధించిన విజయాన్ని సంబరంగా జరుపుకోవటమే.
మనకు అకారణమైన పండుగలు వుండవు. పాశ్చాత్యులకు సకారణమైన పండుగ ఒక్కటి లేదు. వాళ్ళు అతి గొప్పవనుకొనే పండుగలు కూడా, పాత పుస్తకాలపై కొత్త లేబుళ్ల లాంటివే! మిగిలినవన్నీ దివసాలే ! దివసము అంటే దినము అని అర్థము (Day) అది వాస్తవమే. వానిని తద్దినాలు అనికూడా అనవచ్చు. తప్పుగా అనుకోవద్దు. తత్+దినము అంటే ఆ రోజు అని అర్థము .అది అమ్మ రోజు కావచ్చు నాన్న రోజు కావచ్చు మరే రోజైనా కావచ్చు. కానీ మన సాంప్రదాయ మదికాదు. కాలే వత్తిని కాస్త ఎగ దోస్తాము ఎందుకంటే అది ఇంకా బాగా మండాలని. అంటే మన అన్ని పండగల సారాంశము ఒకటే కాబట్టి మనలో వుండే మంచిని మళ్ళీమళ్ళీ ఉత్తేజితము చేస్తాము. పెద్దలైన తలిదండ్రులు గతించిన తరువాత కూడా వారు గతించిన దినమును గుర్తుంచుకొని మరీ జ్ఞాపకార్థము పేదలకు అన్నము పెట్టుట, బ్రాహ్మణునికి దానము చేయుట మొదలైనవి చేసి తృప్తి చెందుతాము. పాశ్చాత్య సంస్కృతికి మన సంస్కృతికి హస్తిమశకాంతరము. వాళ్ళ పద్ధతికి మన పద్ధతికి పండుగకు తద్దినానినికి ఉన్నంత తేడా వుంది.
దాదాపు 13 వ శతాబ్దపు చివరి వరకు నాగరికత లేని ఆ జాతికి పెళ్లి అన్నది ,నేటికి కూడా,ఆడామగా సంబంధము. అదే మనకు రెండు కుటుంబాల అనుబంధం. వారిది సంబంధమే కాబట్టి ఈ రోజు ఒకరితో వుంటే రేపు వీనికి విడాకులిచ్చి వేరొకనితో సంబధం ఏర్పరచు కొంటారు . విడాకులు అన్న మాట మనకు కూడా ఉన్నదే అని ఆశ్చర్య పడవద్దు. 'ఆకు' అనే మాటకు 'కాగితము' అన్న అర్థము ఒకటుంది. 'విడి' అంటే విడిపోవుటకు అని అర్థము. ఈ పదము 'divorce papers' అన్న మాటకు అనువాదార్థకముగా వచ్చినది. మన సాంప్రదాయములలోని పెళ్లి మంత్రములలో ఈ ప్రస్తాపన ఎక్కడా రాదు. ఇక పెళ్లి చేసుకొన్నా దంపతులు అదృష్ట వశాన రెండు మూడేళ్ళు వుంటే వారికి సంతానము కలిగితే ఎవరితో వుండేది ముందే వ్రాసుకొంటారు లేకుంటే ఆ పిల్లలకు అనాధాశ్రమమే గతి. ఆమె వేరోకనితో పెళ్లి చేసుకొంటే వాడు ఆమె పిల్లలకు 'అంకులు'. ఆ మగ వాని పిల్లలకు ఆమె 'ఆంటి'. ఇట్లా స్వంత తల్లి దగ్గర లేని వాళ్ళు mothers' day రోజు వాళ్ళ అమ్మను కలిస్తే లేక వాళ్ళ అమ్మ వాళ్ళను కలిస్తే వారు కలిసి భోంచేస్తారు. తరువాత ఎవరి దోవ వారిది. ఇది MOTHERS' DAY. ఆలాగే Fathers' Day కూడా. మిగతవన్నీ మతాకర్షణ మారణాయుధాలు.
PALTO పాశ్చాత్యుల మహా పురుషుడు. ఆయన 'THE REPUBLIC' 'THE LAWS' అన్న రెండు పుస్తకాలు వ్రాసినాడు. ఆ వ్రాతలు వారికి శిరోధార్యములు. ఆయన గారి 'THE REPUBLIC' లో 'స్త్రీ' కి ఆత్మ వుండదు అది పురుషునిలో మాత్రమె ఉంటుందని నుడివినారు. అనగా స్త్రీ కేవలము ఒక వస్తువుతో సమానము. ఇది ఆయన వచనము లోని తాత్పర్యము. వారే తమ 'THE LAWS'అను పుస్తకములో స్త్రీ కి ఆత్మ లేనందున ఆమెకు ఆత్మానాత్మ విచారణ కలుగదన్నారు. అందువల్ల స్త్రీ కి న్యాయస్థానములో సాక్ష్యము నిచ్చు అర్హత లేదు.
ఇంచుమించు 14 వ శతాబ్దము వరకు ఓటు హక్కు వారికి లేదు ఎందుకంటే వారికి ఆత్మా లేదు కావున. ఇటువంటి అసమానతలు ఎన్నో కలిగి యుండిన ఈ ప్రథ ఇంచుమించుగా 1950 వరకు ఐరోపా దేశాలలో ఉండినదని విన్నాను. వారు '50 వరకు బ్యాంకులలో ఖాతా ప్రారభించుటకు కూడా అనర్హులు. ఒకవేళ భర్త భార్యను వదిలిపెడితే ఆమెను 'మంత్రగత్తె' గా పరిగణించేవారు. అటువంటి ఆడవారిని అమిత క్రూరముగా కాల్చి చంపిన ఉదంతములు వేనకు వేలు. వ్యభిచారము విచ్చలవిడిగా వుండేది. కన్న బిడ్డలను కాన్వెంట్ల వద్ద (అంటే సన్యాసినుల మఠము)(మనము బడి కి ప్రత్యామ్నాయముగా వాడే కాన్వెంటుకు ఆ అర్థము ఆంగ్ల నిఘంటువులో దొరకదు. అది కూడా తెలుసుకోకుండా మన పిల్లలను కాన్వెంటు కు పంపుచున్నాము) దిగ విడిచి పోయేవారు. వ్యభిచార నేరము కోర్టులో విచారణ జరిగితే ఆడవారి సాక్ష్యములు అంగీకరింప బడేవి కావు.
దాదాపు 200 వందల సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్క స్త్రీ కూడా ఆమెరికాలో ప్రసిడెంటు కాలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి