8, జులై 2020, బుధవారం

దేవతలు కూడా కాలం చేయవలసినదే,

అమృతం తాగిన దేవతలు కూడా ఒకనాడు కాలం చేయవలసినదే, కానీ విషాన్ని మింగిన శివుడు మృత్యుంజయుడు. ఆ తల్లి మాంగళ్యాన్ని ఎవ్వరు స్మరించినా గండాలు ఆపదలు తొలగిపోతుంది. మాంగళ్యాన్ని భావన చేసి నమస్కారం చేసుకోవాలి.

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే.

తాత్పర్యం:
 ఓం = ఓంకారము
సర్వ = సమస్తములైన
మంగళ = శుభములకును
మాంగళ్య = శుభ కరమగు దానా !
శివే = శివుని అర్ధాంగి అయిన
సర్వ = సమస్తములైన
అర్ధ = ప్రయోజనములను
సాధికే = నెర వేర్చెడి శక్తి గలదానా
శరణ్యే = భక్తులకు పెద్ద దిక్కు అయినదానా !
త్ర్యంబకే = ముక్కంటి అర్ధాంగి
నారాయణి = విష్ణుమూర్తి సోదరికి
గౌరీ = ఓ పార్వతి మాతా !
తే = నీకు
నమః = నా యీ వందనము
అస్తు = చెందును గాక !

🌹భావం: 
      సకల శుభములకు మూలమైన పార్వతీ! కోరికలన్నీ తీర్చు తల్లీ ! అందరికీ శరణము నిచ్చు,  మూడు కన్నుల కల శివుని అర్ధాంగి అయిన గౌరీ ! నారాయణుని సోదరీ ! నీకు నమస్కరము.

ఈ  శ్లోకమ్ స్త్రీలు పురుషులు అన్న బేధం లేకుండా అందరూ నిత్యం స్మరించవచ్చు.. ఉదయాన్నే వినాయకుడిని

ఓం గం గణపతయే నమః (21 సార్లు)

ఓం గంగా దేవై నమః (మూడు సార్లు) తలుచుకుని తర్వాత

సర్వ మంగళ మాంగళ్యే శివ సర్వార్ధ సాధికే
శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే||
సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతని
గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే||
శరణాగత దీనార్త పరిత్రాణ నారాయణే
సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే||
జయ నారాయణి నమోస్తుతే ( చై చూసుకుని నమస్కారం చేసాకే గణపతి స్మరణ తో మొదలు పెట్టాలి)

ఇలా స్త్రోత్రం చేసి తర్వాత మీ నిత్య కర్మలు పూర్తి చేసి ఇంటిదేవుణ్ణి, విష్ణు ఆరాధన చేసే వాళ్ళు వారి వారి పూజ విధులు యదా విధిగా పూర్తి చేసుకోవచ్చు.

రాత్రి పడుకునే సమయంలో 11 సార్లు శివ నామ స్మరణ చేయాలి.

🌹శ్రీ మాత్రే నమః🌹

కామెంట్‌లు లేవు: