8, జులై 2020, బుధవారం

కరోనా సమస్యపై విశ్లేషణ -

     కరోనా అనే వ్యాధి ఒక వైరస్ వలన సంభవిస్తుంది అన్నది అందరికి తెలిసిన విషయమే . అసలు ఈ వైరస్ ల గురించి ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఏమి ఉన్నదో ఇప్పుడు మీకు వివరిస్తాను . కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఈ బ్యాక్టీరియా , వైరస్ ల పైన సంపూర్ణ అవగాహన కలిగి ఉండి అవి వేటివేటి ద్వారా సంక్రమిస్తాయో అన్నది కూడా తెలుసుకోగలిగారు. వారువారు తమ ఆయుర్వేద గ్రంథాల యందు వీటిని భూతాలుగా , వాటికి చేయు చికిత్సలను భూతచికిత్సలుగా పేర్కొన్నారు. 

                  ప్రస్తుతం సమస్త మానవాళిని పట్టిపీడిస్తున్న ఈ " కరోనా వ్యాధి " కూడా ఇటువంటి భూత సంబంధ దోషమే . సరైన అవగహన ఉన్న పరిశోధకులు ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో వివరించిన భూత చికిత్సలపైన అవగాహన ఏర్పరచుకొని పరిశోధించవలెను. మనుష్యునికి ఎదైనా వ్యాధి సంభవించినప్పుడు ఏ ఔషధం పడితే ఆ ఔషధం వాడకుండా ముందు అసలు ఆ వ్యాధి సంభవించడానికి గల కారణం కనుక్కొని ఆ దోషాన్ని నివారించుటకు సరైన ఔషధాలను తీసుకుంటూ వచ్చిన వ్యాధిని తగ్గించుకోవలెను . వ్యాధి నివారణలో ఆహార సేవన అన్నది కూడా ప్రధానపాత్ర వహించును. 

                 కరోనా వ్యాధిని కలిగించు వైరస్ మన శరీరంలో ప్రవేశించినప్పుడు మన శరీరం నందు కఫదోషాన్ని ప్రకోపింపచేయును. కావున కఫాన్ని నిరోధించు ఔషధాలు వాడవలెను. ఈ వ్యాధి ప్రథమముగా నాసిక ద్వారా మనుష్య శరీరం నందు ప్రవేశించి గొంతు ఆ తరువాత ఊపిరితిత్తులను చేరును. ఊపిరితిత్తులను చేరిన తరువాత దీని క్రూర స్వభావాన్ని చూపించును. ఉపిరితిత్తులను చేరిన తరువాత ఉచ్చ్వాస , నిచ్చ్వాసాలు 50 నుండి 60 వరకు నిమిషానికి పెరుగును . నాడి 110 నుండి 120 వరకు ఉండును. పెదవులలో నలుపుదనం రావొచ్చు. తీవ్రమైన దగ్గు వస్తుంది. దగ్గుతో పాటు కళ్ళే వచ్చును. కొంతమందికి కళ్ళెతో పాటు రక్తం రంగుతో వచ్చును. మరికొంత మందికి నురుగుతో కూడి చిక్కగా కాని పసుపు రంగుతో గాని ఉండవచ్చు. జ్వరం వచ్చును. ఇది తీవ్రతరం అయినప్పుడు ముఖవర్చస్సు తప్పి రోగి తీవ్రముగా భాధపడును. పెదవులు నల్లబడి రక్తప్రసరణ మండలం స్తంభించి పోవును . వ్యాధి తీవ్రత ఎక్కువై గుండెకొట్టుకొనుట తగ్గును. తీవ్రమైన తలనొప్పి ఉండును. కంఠం ఆరిపోయి ఎర్రబడును. జ్వరం మూడు నుంచి నాలుగు రోజులపాటు ఉండును. ఒక్కోసారి వారంపాటు కూడ ఉండును. ఒక్కోసారి చెమట పట్టి జ్వరం తగ్గును. ఈ వ్యాదికి సంబంధించిన విషక్రిములు మనుష్య శరీరం ఏయే భాగాలకు చేరునో ఆయా భాగాలు రోగగ్రస్తం అయ్యి ఆయా దుష్ప్రభావాలు బయటకి కనిపించును. 

             ప్రస్తుత మనం అత్యంత ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాము . ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యని సరైన జాగ్రత్తలు పాటిస్తూ శరీరంలో రోగనిరొధక శక్తిని పెంచుకోవటం ఒక్కటే మార్గం . నాకు తెలిసినంత వరకు పాజిటివ్ వచ్చింది అన్నవారికి అంత తొందరగా అది వదలదు అని నా నమ్మకం . రోగకారణమైన క్రిమి సూప్తావస్థలో ఉండి ఏ రోజైతే మనుష్యుడులోని రోగనిరోధక శక్తి తగ్గినపుడు తన తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. 

              ఇప్పుడు మనుషులలో రోగనిరోధకశక్తి అత్యంత తక్కువుగా ఉంది. దీనికి ప్రధానకారణం మనం తీసుకునే పురుగు మందులు కలిసిన ఆహారం . ప్రతి సంవత్సరం మన భారతీయులు ఆహారం ద్వారా 300ml పురుగుమందు లోపలికి తీసుకుంటున్నారు. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనలో రోగనిరొధక శక్తి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ముందు మన ఆహారం మరియు దినచర్యలో తప్పక మార్పులు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

                  మనలో రోగనిరోధక శక్తిని పెంపొందించుటకు వీలైనంతవరకు శాకాహారం తీసుకోవడం చాలా మంచిది . విటమిన్స్ కలిగిన తాజా ఆకుకూరలు , పండ్లు తీసుకోవడం చాలామంచిది. ఎంత అవసరమో అంతవరకే వండుకొని తినండి. ఫ్రిజుల్లో నిలువ ఉంచుకుని మరలా వేడి చేసుకుని తినడం అత్యంత ప్రమాదకరం . సాధ్యమైనంతవరకు తేలికగా ఉండి త్వరగా జీర్ణం అయ్యే ఆహారపదార్ధాలు తీసుకోవడం అత్యంత ఉత్తమమైన పని . 

       ఇప్పుడు మీకు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాల గురించి తెలియచేస్తాను. వాటిలో అత్యంత ప్రధానమైనది స్వర్ణభస్మం . దీనిని వాడటం వలన శరీరానికి అత్యంత బలం వచ్చును. ఓజస్సును పెంపొందించును. ఓజస్సు అనగా ఆయుర్వేదం నందు రోగనిరొధక శక్తి అంటారు. ఈ స్వర్ణభస్మం ఖరీదు ఎక్కువుగా ఉండును. అనుభవ వైద్యుల సహాయంతో వాడవలెను. అశ్వగంధ కూడా రోగనిరొధక శక్తిని పెంపొందించుటలో ప్రధానపాత్ర పెంపొందించును. 

          కరోనా లక్షణాలు కనిపించినచో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కఫాన్ని హరించు ఔషధాలు వాడుకోవలెను. అదేవిధముగా రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలు వాడవలెను. నా అనుభవసారం కొన్నిరకాల మూలికల గురించి తెలియచేస్తాను. అవి 

    * కరక్కాయ 

     * అక్కలకర్ర . 

     *  అశ్వగంధ . 

      * చ్యవన్ ప్రాశ  ఇందులో ఉశిరిక ముఖ్యమయినది.

      *  అడ్డసరం . 

      *  గోమూత్రము . 

      *  మిరియాలు .

      *   పిప్పిళ్లు . 

      *   శొంఠి . 

      *   లవంగాలు . 

      *  వేపనూనె , వేపచెక్క కషాయం . 

      *  వెల్లుల్లి . 

       *  కుంకుమపువ్వు . 

       *  ఉలవల కషాయం . 

       *  తేనె . 

       *  నిమ్మపండ్లు . 

       *  నీరుల్లిపాయ . 

       *  మంజిష్ట . 

       * రజత భస్మం . 

       *  స్వర్ణభస్మం . 

       *  సన్నరాష్ట్రం . 

       *  అల్లం . 

       *  పచ్చకర్పూరం . 

       *  తులసి . 

       *  చండ్ర కషాయం . 

           పైన చెప్పినవన్నీ బ్యాక్టీరియా , వైరస్ లను నిర్మూలించగలిగిన శక్తి ఉండి శరీరంలో కఫదోషాన్ని నివారించగలిగినవే . గొంతు నందు నొప్పి మొదలైన వెంటనే అల్లం ముక్కకి ఉప్పు అద్దుకుని బుగ్గన పెట్టుకుని రసం మింగండి. కొంత సమయంలోనే సమస్య తీరిపోవును . జ్వరం వచ్చుచున్న బెత్తెడు వేపచెట్టు బెరడు తీసుకుని ఒక గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తాగించి లొపలికి గాలిచొరబడకుండా రోగికి నిండుగా దుప్పట్లు కప్పవలెను ఇలా 3 పూటల 3 రోజుల పాటు చేసిన ఎంతటి తీవ్రమైన జ్వరం అయినా తగ్గును. 

        చివరగా ఒక్క విషయం ఆల్కాహాల్ తో కూడినటువంటి శానిటైజర్లను చేతులు శుభ్రపరచుకోవడానికి అదే పనిగా వాడకండి. "పటిక" అత్యుత్తమ శానిటైజర్ . పటిక ని మెత్తటి చూర్ణం చేసి ఒక కప్పు నీటిలో 3 చిటికెల చూర్ణం కలిపి శానిటైజర్ తయారుచేసుకోండి . ప్రమాదరహితమైనది. 

         తగిన జాగ్రత్తలు పాటిస్తూ మీయొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ మీదనే ఆధారపడిన మీ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడండి. 

              కాళహస్తి వేంకటేశ్వరరావు 

          అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                     9885030034

కామెంట్‌లు లేవు: