నిత్యాన్వేషణ:
*అతులిత బలధాముడు, జ్ఞానులలో అగ్రగణ్యుడు, సకల గుణ సంపన్నుడు అయినప్పటికీ, హనుమంతుడు, రాముని దాసుడెందుకయాడు?*
హనుమంతుని గొప్పదనం ఇక్కడ ప్రస్తుతించబడినది:
*అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం*
*దనుజ వనకృశానుం ఙ్ఞాణినామగ్రగణ్యమ్*
*సకలగుణనిదానం వానరాణామధీశం*
*రఘుపతి ప్రియభక్తం వాతాజాతా నమామి॥*
అర్ధం: అసమానమైన శక్తివంతుడు, బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం, భూతప్రేతపిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతం, ఙ్ఞానులలో అగ్రగణ్యుడు,అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీ రామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కారాలు.
శక్తి, జ్ణానం గుణం, ధైర్య పరాక్రమాలున్నప్పటికీ, హనుమంతుడు రామబంటు ఎందుకయాడు అనేది:
रामो विग्रहवान् धर्मस्साधुस्सत्यपराक्रमः।
राजा सर्वस्य लोकस्य देवानां मघवानिव।। 3.37.13 ।।
[Sloka 13 from 37th Sarga in Aranya Kanda from Sri Valmiki Ramayanam]
అర్ధం: రాముడు ధర్మ అవతారం. అతను ధర్మవంతుడు. అతని బలం సత్యం. దేవతలకు ఇంద్రునివలె, అన్ని ప్రపంచాలకు ఆయన రాజు.
ధర్మమే మహోన్నతమైనది. దానిని మించినది మరొకటి లేదు. ఎంతటి వ్యక్తి, శక్తి అయినా ధర్మం ముందు తల వంచవలసిందే. ఎందుకంటే, ధర్మం సత్యం, నిత్యం మరియు అంతిమ శక్తి. రాముడు మానవుడయినా, ధర్మావతారం - రామో విగ్రహవాన్ ధర్మ- ధర్మానికి విగ్రహ రూపం ఇస్తే, అది రాముడే!
అందుకే, హనుమంతుడు ఎంతటి శక్తివంతుడు, గొప్పవాడయినప్పటికీ, రామ (అదే ధర్మ) దాసుడయాడు.
ధర్మో రక్షతి రక్షిత: - ధర్మాన్ని ఎవరూ రక్షించాల్సిన పని లేదు; దాన్ని పాటించటం వలన, మిమ్ములను మీరు రక్షించుకున్న వాళ్ళవుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి