5, జులై 2023, బుధవారం

పరమాచార్య గొప్పదనం

 పరమాచార్య గొప్పదనం


1950-51 సంవత్సరాలలో, పరమాచార్య స్వామివారు కుంభకోణం మఠంలో ఉన్నారు. ఒకరోజు రాత్రి స్వామివారు ఉపన్యసిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా మైక్ కూడా లేదు. శ్రీమఠానికి చాలామంది భక్తులు వచ్చారు. స్వామివారు ఉపన్యాసాంతర్గాతంగా ఒక శ్లోకంలోని ‘కర్మనాశ జలస్పర్శత్’ అన్న రెండు పదాలను పదే పదే చెబుతున్నారు కాని, పూర్తీ శ్లోకం చెప్పడంలేదు. నా అజ్ఞానం వల్ల స్వామివారికి మిగిలిన శ్లోకం తెలియదేమో అనుకున్నాను. నాకు ఆ శ్లోకం మొత్తం రావడంతో బాల్య చాపల్యం చేత, స్వామివారు ప్రసంగిస్తున్నా అత్యుత్సాహంతో గట్టిగా ఆ శ్లోకాన్ని చెప్పాను. 


కర్మనాశ జలస్పర్శత్ కరదోయ విలంగనాత్

గండకీ బాహుదరనాత్ ధర్మఃక్షరతి కీర్తనాత్


మహాస్వామివారు తమ ఉపన్యాసాన్ని ఆపి, ఆ శ్లోకాన్ని మరలా చెప్పమని నన్ను ఆజ్ఞాపించారు. ఎవరినా ఉపన్యసిస్తున్నప్పుడు మధ్యలో భాగం కలిగిస్తే, వారికి కోపం రావడంతో పాటు ఆ ఇబ్బంది కలిగించినవాణ్ణి అధికప్రసంగి అని తిట్టుకోవడం సహజం. కాని పరమాచార్య స్వామివారు కరుణామూర్తి. శ్లోకం చెప్పమని స్వామివారు ఆదేశించిన వెంటనే నేను చెప్పడం మొదలుపెట్టాను కాని, సరిగ్గా గుర్తుకురాలేదు. అయినా “ఆ పిల్లవాడు చెప్పాడు చూడండి” అని స్వామివారు నన్ను ఆశీర్వదించారు. నాకు అవకాశం కల్పించడానికే స్వామివారు అ శ్లోకాన్ని మరచిపోయినట్టుగా నటించారు. దాంతోపాటు నా అజ్ఞానాన్ని కూడా బయటపడకుండా చేశారు. పరమాచార్య స్వామివారి కరుణ ఎటువంతిదని తెలిపే ఈ సంఘటన ఇప్పటికి నా జ్ఞాపకాల పొరల్లో ఎంతో తాజాగా ఉంది.


***********************************************************************


ఒకసారి పరమాచార్య స్వామివారు కాంచీపురంలోని శివాస్థానంలో ఉన్నారు. వృక్షశాస్త్రంలో డాక్టరు డిగ్రీ పొందిన ఒక యువకుడు స్వామివారి దర్శనానికి వచ్చాడు. మహాస్వామివారు అతణ్ణి, “వెట్రిలై(తమలపాకు) కు ఆ పేరు రావడానికి గల కారణమేమి?” అని అడిగారు. తనకు తెలియదని చెప్పడంతో, స్వామివారే డానికి కారణం తెలిపారు, “అది ఒక లత. ఏ లత అయినా పువ్వులు పూచి, కాయలు కాస్తుంది. కొన్ని పాదులు కాయలు కాయకపోయినా పువ్వులు పూస్తుంది. కాని ఈ తమలపాకు లత పువ్వులు పూయదు, కాయలు కాయదు. కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి. ఈ తీగ కేవలం ఆకులతో ఉంటుంది కాబట్టి దీనికి వెట్రిలై(కేవలం ఆకు) అని పేరు”.


నిజంగా డాక్టరేటు ఇవ్వాల్సింది మహాస్వామివారికే అని అనుకున్నాడు ఆ యువకుడు.


***********************************************************************


పరమాచార్య స్వామివారికి శిల్పశాస్త్రంలో అపారమైన జ్ఞానం. శిల్పులకు కూడా తెలియని ఎన్ని విషయాలను స్వామివారు తెలిపేవారు. ఆగమశాస్త్రంలో శిలలను మూడు రకాలుగా విభాజించారు: ఆడవి, మగవి, ఆడ మగ కానివి. కొన్ని శిల్పాలు కేవలం మగ శిలలతోనే చేయాలి, కొన్ని ఆడ శిలలతో, మరికొన్ని నపుంసక శిలలతోనే చెయ్యాలి. ఉలి దెబ్బ ద్వారా శిల యొక్క గుణాన్ని శిల్పులు తెలుసుకుంటారు. కాని పరమాచార్య స్వామివారు కేవలం ఆ శిలను చూసే, దాని గుణం తెలుసుకుంటారు.


దాంతోపాటు ఒక్కోసారి ఆ శిలల్లో కప్పలు ఉంటాయి. అటువంటి శిలలతో దైవప్రతిమలు చెయ్యరాదు. ఒకసారి స్వామివారి వద్దకు స్థపతి ఒకరు ఒక శిలను తెచ్చారు. స్వామివారు అందులో కప్ప ఉందని చెప్పారు. అందుకు ఆ శిల్పి పరీక్ష చేసి నిర్ధారించుకున్న తరువాతనే తాను ఈ శిలను తెచ్చానని వాదించాడు.

ఆ శిలను పగులగొట్టమని స్వామివారు ఆదేశించారు. ఆ శిలను బద్ధలుకొట్టగానే ఒక కప్ప ఎగురుకుంటూ బయటకు వచ్చింది. ఆ శిల్పి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ శిలలతో పనిచేసే శిల్పాచార్యులకు కూడా లేని శిల్పశాస్త్ర పాండిత్యం స్వామివారికి సొంతం.


--- యస్. పంచపకేశ శాస్త్రిగళ్, కుంభకోణం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: