5, జులై 2023, బుధవారం

ఈ రోజు పదము

 211వ రోజు: (సౌమ్య వారము) 05-07-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

కూతురు: అంగజ, ఆడుబిడ్డ, ఆత్మజ, ఆత్మసంభవ, కుమారి, కొమరిత, కొమరి, ఝుల, తనయ, తనూభవ, తనూజ, నందన, నందిని, పుత్రి, పుత్రిక, సుత, స్వజ. 


 ఈ రోజు పద్యము:


అక్కఱపాటు వచ్చు సమయంబునఁజుట్టములొక్కరొక్కరి/

న్మక్కువనుద్దరించుటలు మైత్రికిఁజూడగ యుక్తమేసుమీ/

యెక్కట నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలన్/

దక్కక వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా!

 

 భాస్కరా! మానవులు ఇచ్చిపుచ్చుకొనుట సహజము. అలాగే అవసరమున్న వేళయందు బంధువులు ఒకరినొకరు ప్రేమతో, కష్టముతో నుండిన  వేళలయందు ఉద్దరించుటకు ప్రయత్నములు చేయుట స్నేహమునకు భావము. ఏలననగా, నీటిలో పడవల మీద బండ్లు తీసుకొని వెళ్ళునట్లు. భూమి మీద బండ్ల మీద పడవలను తీసుకు వెళ్ళునట్లు. అలాగే తగిన అవసరము వచ్చిన వేళ ఒకరినొకరు అన్యోన్యతలు పాటించాలని సారాంశము.

కామెంట్‌లు లేవు: