6, అక్టోబర్ 2020, మంగళవారం

ధార్మికగీత - 56*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                       *

                                *****

    *శ్లో:- విద్యా దదాతి వినయం ౹*

           *వినయా ద్యాతి పాత్రతాం ౹*

           *పాత్రత్వా ద్ధన మాప్నోతి ౹*

           *ధనా ద్ధర్మం తత స్సుఖమ్ ౹౹*

                                *****

*భా:- "విద్య" సర్వాభరణము. "విద్య" సర్వధన ప్రధానము."విద్య" మూడవ నేత్రము. "విద్య" నృపాలపూజితము అని వింటుంటాము.అట్టి విద్య వలన వినయము, విధేయత అలవడతాయి. వినయము లేని విద్య విద్యయే కాదు. అవిద్యయే. వినయము వల్ల పాత్రత-అర్హత లభిస్తుంది. ఆ అర్హతతో ఉపాధి, తద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. ఆ ధనంతో సంసారంలో ఉత్తమ గృహస్థుగా వివిధ దానాలు చేస్తూ, తక్కిన బ్రహ్మచర్య, వృద్ధ,వానప్రస్థాశ్రమా నుయాయులను విధ్యుక్తకర్మగా సేవిస్తూ, ధర్మాచరణ, ధర్మరక్షణకై పూనుకుంటాడు. ఆ ధర్మమే అతనికి సిరిసంపదలు, భోగభాగ్యాలను ప్రసాదించి ఇహ, పరలోక సుఖాలను అనుభవింపజేస్తుంది. జ్ఞాన ప్రదాయినియై ముక్తికి మార్గం సుగమం చేస్తుంది. దీనికంతటికీ మూలము "విద్య"యే యని సారాంశము. కొద్ది జీవితాన్ని విద్యకు అంకితమిస్తే, అది జీవితాంతం మనకు తోడూనీడగా ఉండి, అమేయసుఖాలు అందించి తరింపజేస్తుంది*. 

                              *****

              

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲


🌺 *ఓం నమో నారాయణాయ* 🌺



*3. మఱియును.*


*భావము:-* ఇంతే కాకుండా




*4. ఆకార జన్మ విద్యార్థవరిష్ఠుఁ డై; గర్వసంస్తంభ సంగతుఁడు గాఁడు వివిధ మహానేక విషయ సంపన్నుఁడై; పంచేంద్రియములచేఁ బట్టుబడఁడు భవ్య వయో బల ప్రాభవోపేతుఁడై; కామరోషాదులఁ గ్రందుకొనఁడు కామినీ ప్రముఖ భోగము లెన్ని గలిగిన; వ్యసన సంసక్తి నావంకఁ బోఁడు విశ్వమందుఁ గన్న విన్న యర్థము లందు వస్తుదృష్టిఁ జేసి వాంఛ యిడఁడు ధరణినాథ! దైత్యతనయుండు హరి పరతంత్రుఁ డై హతాన్యతంత్రుఁ డగుచు.*



*భావము:-* ఇంకా ఆ ప్రహ్లాదుడు ఎల్లప్పుడు విష్ణువును తన చిత్తము నందు చేర్చుకుని ఇతర ఆలోచనలు అన్నీ వదిలేస్తాడు. సౌందర్యము, కులము, చదువు, ధనము సమృద్ధిగా ఉన్నా కూడా గర్వపడడు. గొప్ప వస్తువులు ఎన్నో అందుబాటులో ఉన్నా ఇంద్రియ లోలుడు కాడు. దివ్యమైన యౌవనమూ బలమూ అధికారములు అన్నీ ఉన్నా కామము, క్రోధము మొదలగు అరిషడ్వర్గానికి లొంగడు. స్త్రీలు మున్నగు చాపల్య భోగములెన్ని ఉన్నా ఆ వ్యసనాలలో తగులుకోడు. లోకంలో కనబడేవీ, వినబడేవీ అయిన వస్తువులను వేటినీ కావాలని వాంఛించడు.




*5. సద్గుణంబు లెల్ల సంఘంబు లై వచ్చి యసురరాజ తనయు నందు నిలిచి పాసి చనవు విష్ణుఁ బాయని విధమున నేఁడుఁ దగిలి యుండు నిర్మలాత్మ!*



*భావము:-* నిర్మలమైన మనసు గల ధర్మరాజా! ఆ రాక్షస రాకుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఎప్పటికీ వదలిపెట్టడు. అలాగే సుగుణాలు అన్నీ, ఎప్పటికీ విడిచిపెట్టకుండా, అతనిలో ప్రోగుపడి ఉంటాయి.

కామెంట్‌లు లేవు: