6, అక్టోబర్ 2020, మంగళవారం

*ధార్మికగీత - 26*

 

                                *****

*శ్లో:- సుఖస్యా నంతరం దుఃఖం ౹*

      *దుఃఖస్యా నంతరం సుఖం ౹*

      *చక్రవత్ పరివర్తంతే ౹*

      *దుఃఖాని చ సుఖాని చ ౹౹* 


                    

సుఖ దుఃఖంబులు వెంటవెంటగను

         తా శోధించగా వచ్చెడున్ ,

సుఖమున్ పొందిన వెంట దుఃఖమును

         యా శోకంబు బో సౌ ఖ్యమున్,  

సుఖ దుఃఖంబులు చక్రరీతిగను

          తా శోభిల్లుచున్ తిర్గు , యా

సుఖ దుఃఖంబులు శాశ్వతంబు లిల

          లో చూడంగ గావె ప్పుడున్



✍️ గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు: