శ్రీ ప్రహ్లాద భక్తి
************************
173శ్లోకము కొనసాగింపు
**************************
" ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబరశోభిత కటిప్రదేశుండును, నిర్జరనిమ్నగావర్తవర్తుల కమలాకరగంభీర నాభివివరుండును, ముష్టిపరిమేయవినుత తనుతరస్నిగ్ద మధ్యుండును, కులాచల సానుభాగ సదృశ కర్కశవిశాల వక్షుండును, దుర్జన దనుజభట ధైర్య లతికా లవిత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాప జ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖరతర ముఖనఖరుండును, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమర ప్రముఖ నానాయుధమహిత మహోత్తుంగ మహీధరశృంగసన్నిభ వీరసాగరవేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకశత భుజార్గళుండును,"
*భావము* : “ఆ ఉగ్రనరసింహుని ఊరువులు క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం తొండాల లాగా బలిష్ఠంగా బలవత్తరంగా ఉన్నాయి. పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టి ఉన్న మణులు పొదిగిన మువ్వల ఒడ్డాణం గణ గణ మని మ్రోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న మడుగులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహుడి నడుము పిడికిలిలో ఇమిడేటంత సన్నంగా ఉండి నిగనిగ మెరుస్తోంది. వక్షస్థ్సలం పెద్ద కొండ చరియ లాగా అతి కఠినంగా, విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది. ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడి తేలి, రాక్షససేనల ధైర్యలతలను తెగగోసే కొడవళ్ళలాగా ఉన్నాయి. రాక్షసరాజుల బండబారిన గుండె లనే పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళకి మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అవి గోళ్ళు కావు వజ్రాయుధాలు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తాయి. మహోన్నతమైన పర్వత శిఖరాలవంటి ఆ నరసింహ స్వామి మూర్తి బాహువులు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి. వందలాదిగా ఉన్న ఆ బాహువులు వీరరసం అనే సముద్రానికి చెలియికట్టలలాగా ఉన్నాయి.”
+++++++++++++++++++++
*విష్ణుసహస్రం* .... అర్థం, పరమార్థం.
+++++++++++++++++++++
572) సర్వదృగ్య్వాస: - సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు.
+++++++++++++++++++++
*ఈ ఉదయం శ్రీహరి కీర్తన*
+++++++++++++++++++++
" ఈ సురలు ఈ మునులు
ఈ చరాచరములు "
+++++++++++++++++++++
[06/10, 2:43 pm] +91 93913 24915: _*శ్రీ దేవి భాగవతం - 52 వ అధ్యాయము*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*స్వయంవరమును గూర్చిన వాదోపవాదములు*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*వ్యాస సంయమి యిట్లు వాక్రుచ్చెను :* ఈ విధముగ కేరళాధిపతి వాదింపగా యుధాజిత్తు మరల నిట్లనియెను : ఓ భూపాలా! ఈ రాజ సమాజమునందు సత్యవాది జితేంద్రియుడు అని పేరొందిన నీవు పలుకునది నీతియేనా? యోగ్యులైన నరపతు లిందఱుండగ కన్యారత్నము విషయమున అయోగ్యుడు తగియుండునా? ఇట్టి న్యాయము నీకు రుచించును. మఱి యితరులకు రుచించదు. సింహము పాలి సొమ్ము నక్క యెట్లనుభవించగలదు? రాజులపాలి యీ కన్యారత్నమును సుదర్శను డెట్లనుభవింపగలడు? విప్రులకు వేదము బలము. క్షత్రియులకు చాపము బలము. కాన నిట నేను అన్యాయ మేమి చెప్పుదును? వివాహముందు రాజులకు వీర్యమే శుల్క మగుట ప్రసిద్ధమేగద! బలవంతుడే కన్యను గ్రహింపవలెను. బలహీనుడెప్పుడును గ్రహింపరాదు. కాన నిపుడు కన్యను పణముగ నుంచుటయే నీతి. కాదేని రాజలోకమున పెద్ద కలవరము బయలుదేరును. ఈ విధముగ రాజుల మధ్య వాద వివాదములు చెలరేగగా నృపోత్తముడగు సుబాహు నృపతి సభామధ్యమునకు బిలువబడెను. తత్త్వవిదులగు రాజులెల్లరు సుబాహుని బిలిచి, ఓ రాజా! నీ వీ వివాహమున జక్కని నీతి పాటింపవలయును. నీవు చేయదలచిన కార్యము మాకు సమాహిత మతితో దెలుపుము. నీ మదిలో నీ పుత్రిక నెవ్వని కీయదలంచితివో నిక్కము బలుకుమనిరి. నా కూతురు తన మదిలో సుదర్శనునే పతిగ వరించినది. నేను వలదని యెంత చెప్పినను నా మాట వినుటలేదు. ఇంక నేనేమి చేతును? నా కూతురు మనసు నా వశమందు లేదు. సుదర్శనుడొంటరిగ నిరాకులుడై యేతెంచెను అని సుబాహుడనెను.
అపుడు శిష్టులైన రాజులందఱు సుదర్శనుని రావించిరి. అత డేకాకియై శాంతుడై రాగా వారతని కిట్లు నెమ్మదిగా బలికిరి : మహాభాగా! రాకుమారా! సువ్రతా! నిన్నెవరు పిలువగ నీ రాజుల సమాజమున కొంటరిగ నురుగుదెంచితివి? నీ చెంత సైన్యముగాని సచివులుగాని కోశముగాని మహాబలముగాని లేదే? మరియేల వచ్చితివో యథార్థము తెల్పుము. ఎల్లరాజులును యుద్ధకాములై సేనాసమేతులై కన్యకార్థము వచ్చిరి. నీవొక్కడవిక్కడ వట్టిచేతుల నేమి చేయవచ్చితివి? నీ సోదరుడు మహాసైన్యము వెంటబెట్టుకొని నిన్ను హతమార్చ వచ్చియున్నాడు. అతనికి యుధాజిత్తు సాయము చేయ వచ్చియున్నాడు. నీవున్న నుండుము. పోయిన పొమ్ము. నిజము చెప్పుము. నీవు బలహీనుడవై యున్నావు. కాన నీకు తగినొట్లనరింపుము. *సుదర్శుడిట్లు పలికెను :* ఇపుడు నా చెంత సుహృన్మిత్రులుగాని రాజభటులుగాని కోశముగాని దుర్గబలముగాని సాయమొనర్చువారుగాని ఎవ్వరును లేరు. ఇచట జరుగు స్వయంవరమును చూచు వేడుకతో నేతెంచితిని. కలలో భగవతి యగు శ్రీదేవి చేత ప్రేరితుడనైతిని. ఇందు సందియము లేదు. నా మదిలో మరెట్టి కోరికయు లేదు. అన్నియు నా తల్లియే నాకు జెప్పెను. నా తల్లి పలికిన పలుకు అక్షరాల జరిగి తీరును. నాకీ ప్రపంచమందంతట శత్రు వెవ్వడును లేడు - నాకెల్లెడల నెల్ల ప్రాణులందాభవానియే ప్రత్యక్షముగ గనంబడుచున్నది. నృపులారా! నాతో నెవడైన బగబూనినచో వానిని ఆ మహావిద్య దండించి తీరును. నేనుమాత్ర మెవ్వనితోడను శత్రుత్వము బూనను. ఏది జరుగనున్నదో అది జరిగి తీరును. వేరుగ జరుగదు. నేను దైవాధీనుడను - నాకింత చింత యెక్కడిది?
సురనరాది సకల భూతములందు నిరంతర మా దివ్య చైతన్యశక్తి విరాజిల్లుచుండును. ఆ శక్తి తలంపునకు భిన్నముగ నేదియును జరుగుటకు వీలులేదు. ఆ తల్లి తలచుకొన్నచో నెవ్వనినైన నిఱుపేదనైన రాజుగ చేయగలదు. నాకింక లేనిపోని చింతయేల? ఆ పరాశక్తి - జనని - దయలేనిచో దేవతలును హరిహర బ్రహ్మలు కూడ కదలశక్తులుగారు. ఇక నాకీ చింత యేటికి? నేనశక్తుడనో సుశక్తుడనో యెట్టివాడనో యట్టివాడను. నేనీ స్వయంవరమునకు ఆ జగన్మాతృ నానతి చేత వచ్చితిని. ఆ తల్లి యేది దలచిన నది చేసితీరును. ఇంక నడుమ నాకెందులకు విచారము? ఈ విషయమై శంకింప పనిలేదు. నేను చెప్పినది అంతయును సత్యము. జయాపజయముల విషయమున లేశమైన నాకు లజ్జ గలుగదు. నేనా తల్లి కధీనుడను. నాకేదైన లజ్జ కల్గిన నది ఆమెకే కలుగును. సుదర్శనుని వచనము లాలకించి నరపతు లొండొరుల మొగములు చూచుకొని నిశ్చితమతులై యతని కిట్లనిరి: ఓ సాధూ! నీ పలికినదంతయు నిజమే. అందులో సందేహమేమియు లేదు. కాని యుజ్జయినీపతి నిన్ను చంపుటకు చూచుచున్నాడు. నీ ఆచరణ చూచి నీమీది దయకొలది చెప్పుచున్నాము. నీకేది యుక్తమని తోచునో యది మనస్సులో చక్కగ విచారించి యాచరింపుము.
సుదర్శనుడిట్లనియె : ఓ నృపతులారా ! కృపాళురు సుహృజ్జనులునైన మీరు నిజము పల్కితిరి. నేనింక పలుక వలసినది లేదు. ఐనను చెప్పుచున్నాను. ఒకనిచావు మరొకని వలన నెన్నడు సంభవింపదు. స్థావర జంగమాత్మకమగు నీజగమంతయును దైవాధీనమే. ఈ జీవుడు సంతతమును స్వవశమునుండక కర్మ పరాధీనుడై యుండును. తత్త్వవిదులగు విబుధులు కర్మ ముత్తెఱంగుల నుండు నందురు. అవి సంచితము వర్తమానము ప్రారబ్ధము ననబరగును. ఈ బ్రహ్మాండమంతయును కాలము కర్మము స్వభావము వీనితో నిండి యున్నది. దేవడు గూడ కాలము రాని వానిని చంపజాలడు. కాని సనాతనమైన కాలము నిమిత్త మాత్రమున హతుడైన వానిని చంపివేయును. శత్రునిషూదనుడగు నా తండ్రి సింహము చేత నిహతుడయ్యెను. నా మాతామహుడును యుధాజిత్తు చేత చంపబడెను. కోటి ప్రయత్నములు చేయుచున్న వాడును దైవయోగమున వాయువు మూడిన నాడు చచ్చి తీరును. ఒకడు (నేలపై నూకలున్నవాడు) రక్షణ లేకున్నను దైవేచ్ఛచే వేయేండ్లు జీవింపగలడు. ధర్మిష్ఠులగు నృపులారా! యుధాజిత్తునకు నే నేనాడును భయపడుటలేదు. నేనన్నిటికి ఆ దైవమే పరమమని భావించి నిబ్బరముగ నున్నాను. నేను నిరంతరముగ నిత్య మాపరమ భగవతి మధురనామ సంస్మరణము చేయుచున్నాను. ఆ జగదేకమాత దేవి నాకు తప్పక కళ్యాణము జరుపగలదని దృఢముగ నాశించుచున్నాను. జీవుడు శుభమునుగాని - యశుభమునుగాని తన పూర్వార్జిత కర్మఫలమునే - యనుభవించును. అతడు స్వయంకృతము ననుభవించుచుండును. ఇది యెరిగిన జ్ఞానికి శోకమెట్లు గల్గును? బుద్ధిలేని మూఢుడు తన కర్మఫలానుసారముగ దుఃఖము లనుభవించుచు నల్పబుద్ధియగుటచే నా దుఃఖములకు నిమిత్త కారణమైన పరులతో పగ పెంచుకొనును. నాకు వైరమును శోకమును భయమును లేవు. కనుకనే నేను నిశ్శంకముగ నీ రాజన్యుల నడుమకు రాగలిగితిని. నేనీ యుత్తమ స్వయంవరమును వీక్షించు కాంక్షతో శ్రీ చండికాదేవి యనుమతి బడసి యేతెంచితిని. ఏది జరుగనున్నదో అది జరిగి తీరును. నాకు పరమ భగవతి వచనమే యన్నివిధాల ప్రమాణముగ మదిలో నమ్మియున్నాను. ఇంకెవ్వరిని నమ్ముట లేదు. నా తల్లి నాకు కలుగచేసిన సుఖముగాని దుఃఖముగాని వేఱుగ కాదు. నదియు ఆ యుధాజిత్తునే సుఖము బడయనిండు. నాకు మాత్ర మతని పట్ల ఎట్టి వైరము లేదు. నా యందెవ్వనికైన వైరమున్నచో దాని ఫలము నతడనుభవించి తీరును.
సుదర్శనుని మాటలకు రాజులు సంతసిల్లిరి. అతడును తన యాశ్రమమున కేగి సుఖముండెను. మరునాడు శుభసమయమున రాజులెల్లరును తన సుందర భవనమునకు రావలసినదిగ సుబాహువు ఆహ్వానించెను. రాజులందఱును శుభాలంకారములతోనేతెంచి శుభాసనములతో రచింపబడిన పీఠములపై నాసీనులైరి. వారు దివ్యవేషధారులైన విమానములందలి దేవతలో యన విరాజిల్లుచు స్వయంవరము నవలోకించు వేడుకతో నుండిరి. ఆ రాచకూతు రెప్పుడెప్పుడు వచ్చునో యామె శ్రుతకీర్తి భాగ్యవంతుడునైన యేరాచకుమారుని వరించునో యని యెల్లరును దారితెన్నులు చూచుచుండిరి. ఒకవేళ నామె సుదర్శనునే పూలమాలతో నలంకరించినచో రాజలోకమునందు నిస్సంశయముగ కల్లోలము బయలుదేరును. ఇట్టు లాసనములందున్న నరపతులు తలపోయుచున్నంతలో మంగళవాద్యఘోషములు చెలరేగెను. అంత శుచిస్నాతయై శుభ్ర వసనములును సొమ్ములును దాల్చి మధూక పుష్పమాలిక చేతబూని తన కూతురు రాగా లక్ష్మివలె నొప్పుచు వివాహ యోగ్య లక్షణములు గల్గి సువసనములు దాల్చి చింతలో మునిగిన తన కూతును జూచి నగుచు సుబాహువామె కిట్లనియెను : పుత్త్రీ! లెమ్ము. శుభసుమమాల చేబూనుము. ఈ రాజుల సమూహము బాగగ పరికించి చూడుము. ముందునకు సాగుము. ఇందఱిలో గుణవంతుడును కులీనుడును రూపసంపన్నుడునగు నే రాకుమారుడు నీ చిత్తమునకు నచ్చునో యతనినే వరింపుము. దేశదేశాలనుండి వచ్చిన రాజు లున్నతాసములం దుపవిష్టులై యున్నారు. వారినందఱిని చక్కగ గాంచి నీ కిష్టమైనవానినే వరింపుము.
తన తండ్రి మాటలు విని మితభాషిణియగు నా కన్య ధర్మసమ్మతమైన లలిత వచనము లిట్లు పలికెను : తండ్రీ! కాముకులును సామాన్యులునగు పురుషులను కన్నెత్తియైనను జూడను. తండ్రీ! స్త్రీచే నొక్కరుడే చూడదగినవాడుకాని వేరొకరిని చూడగూడదని ధర్మశాస్త్రమున నేను వింటిని. ఎవ్వతె పెక్కుమందితోడ గూడునో దాని సతీత్వము చెడిపోవును. అట్టి దానిని గని యందఱును నిది నాదిగనైన బాగుగనుండునని లోలోన దలంచుదురు. ఒక స్త్రీ తనచేత పూలమాలగొని యెప్పుడు స్వయంవర మంటపమెక్కెనో యప్పుడామె కులటవలె సర్వ సామాన్యగ తలంపబడును. ఒక వారవనిత వీథికేగి యచట గల నరుల జూచి వారి మంచి చెడ్డలను గూర్చి తనలో భావించుకొనుచుండును. కాముకు ననేక భావములతో వ్యర్థముగ గనుచుండు వారకాంతవలె నేను స్వయంవర మండపమునకు వచ్చి వారకాంతా కృత్యమును చేయవలయునా! పెద్దల చేత నిర్ణీతమైన యిట్టి స్వయంవర ధర్మమును నేను పాటింపజాలను. నేను వ్రతనిష్ఠను పూని ఇపుడు పత్నీవ్రత మాచరింపగలను. ఒక సామాన్యకాంత మండపమున కేతెంచి తన మదిలోన పెక్కురీతుల సంకల్పించుకొని యందొక్కని వరించునట్లు నేనిపుడు పతివ్రతనై యెట్లు చేయగలను? పూర్వము సర్వాత్మ భావముతో నేను సుదర్శనునే వరించితిని. అతనినిగాక యితరుని వరింపజాలను, తండ్రీ! నీవు నా మేలుగోరు దేనియొక శుభముహూర్తమున వివాహ విధిప్రకారముగ నన్ను సుదర్శనునకు కన్యాదాన మొనరింపుము.
*ఇది శ్రీదేవి భాగవతమందలి తృతీయ స్కంధమున ఇరువదవ అధ్యాయము.*
[06/10, 3:31 pm] +91 99660 06009: *తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల*
1.తిరుమల పూర్వ నామధేయమేమిటి?
Ans.: *వరహాపర్వతం.*
2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు?
Ans. : *ఉగ్రాణం.*
3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?
Ans. : *నడిమిపడికావాలి.*
4. స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు?
Ans.: *పరిమళపు అర.*
5. సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు?
Ans.: *పోటు.*
6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?
Ans. : *30 అడుగులు.*
7. విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?
Ans.: *అంగప్రదక్షణ.*
8. బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?
Ans: *మహామణిమండపం.*
9. బంగారు వాకిలి దాటాక వచ్చేమండపాన్ని ఏమంటారు?
Ans.: *కొలువు మండపం.*
10. రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?
Ans. : *శయన మండపం.*
11. శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?
Ans.: *అద్దాల మండపం.*
12. అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి?
Ans.: *డోలా మండపం.*
13. అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి?
Ans. : *రంగనాయకుల మండపం.*
14. తిరుమల రాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది?
Ans.: *రాజా తొదరమల్లు.*
15. ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?
Ans.: *బలి పీఠం.*
16. శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?
Ans. : *కోయిల్ తిరుమంజనం.*
17. చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు?
Ans. : *4 సార్లు.*
18. విష్ణు సహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?
Ans.: *2 సార్లు*
19. సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?
Ans. : *29*
20. ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?
Ans. : *7 సార్లు*
[06/10, 3:38 pm] +91 93913 24915: *పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు మొబైల్స్ కాదు మీరే (తల్లిదండ్రులే)...!!!*
పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ, అది మరీ *శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..*
పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, ఇది ముమ్మాటికీ నిజం..
వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నారు..
ఇప్పుటి తరం పిల్లలు..
(10 సంవత్సరాలు దాటిన వాళ్ళు)
🔥 తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు..
🔥 మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..
🔥 లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..
🔥 కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...
🔥 రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవ మంటే లేవరు...
🔥 గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు..
🔥 తిడితే వస్తువులను విసిరి కొడతారు..
ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..
🔥 ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..
🔥 ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..
🔥 అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు..
🔥 20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..
🔥 బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి..
🔥 కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు..
వారిస్తే వెర్రి పనులు..
మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,
కానీ కారణం మనమే..
ఎందుకంటే *మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..*
చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..
గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..
*వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది*..
*కష్టం గురించి తెలిసేలా పెంచండి*
కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం *విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..*
ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..
మరికొంతమంది సోమరిపోతులు లా తయారు అవుతున్నారు..
*అభినయాలు కనపడడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..*
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..
భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..
మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..
కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం...
కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్..
చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...
గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..
అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..
3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..
5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..
10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..
వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..
అందుకే *తల్లిదండ్రులు మారాలి..*
*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?*
ఒక్కసారి ఆలోచన చేయండి...
*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?*
కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో, మసీదుకు వెళ్ళో
పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..
పిల్లలకు..👇
👉 *బాధ్యత*
👉 *మర్యాద*
👉 *గౌరవం*
👉 *కష్టం*
👉 *నష్టం*
👉 *ఓర్పు*
👉 *సహనం*
👉 *దాతృత్వం*
👉 *ప్రేమ*
👉 *అనురాగం*
👉 *సహాయం*
👉 *సహకారం*
👉 *నాయకత్వం*
👉 *మానసిక ద్రృఢత్వం*
👉 *కుటుంబ బంధాలు*
👉 *అనుబంధాలు*
👉 *దైవ భక్తి*
👉 *దేశ భక్తి*
*ఈ భావనలు సంప్రదాయాలు అంటే..*
కొంచెం *కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..*
ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, *ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..*
పిల్లలకు ప్రేమ, భయం తో పాటుగా వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిద్ధాం...
మనం కూడా మమేకమవుదాం...
*భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన, సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై బాటలు వేద్దాం.....*
🙏🏻 *లోకా సమస్తాః సుఖినోభవంతు* 🙏🏻
[06/10, 3:38 pm] +91 93913 24915: *పురుష సూక్త3 వ శ్లో కం
*శ్లోకం.. 3/25*
*ఏతావానస్య మహిమా! అతోజ్యాయాగ్ శ్చపూరుషః!!*
*పాదోస్య విశ్వా భూతాని! త్రిపాదస్యామృతం దివి!*
*భావం*
ఇక్కడ కానవస్తున్నదంతా భగవంతుని మహిమే! కానీ ఆ భగవంతుడు, వీటికంటే శ్రేష్టుడు. ఉద్భవమైనవన్నీ ఆయన పావుభాగము మాత్రమే! ఆయన ముప్పాతిక భాగము వినాశము లేని గగనములో ఉంది. పరమాత్మ మహిమ అపారము! ఈ ప్రపంచములో ఒక్క అంశాన్ని సైతమూ మనము తెలుసుకోలేదు. ఇది పరమాత్మ యొక్క పావుభాగము మాత్రమే అంటూ పరిమాణానికి అందని ఆయన మహిమను ఈ మంత్రము తెలుపుతుంది. వేదకాల ఋషులు ఈ ప్రపంచాన్నే ఒక మహాయజ్ఙంగా చూచినారు. పుట్టినవన్నీ గిడుతున్నాయి. కానవచ్చేవన్నీ కనుమరుగై పోతున్నాయి. మరణించేవి మరలా పుడుతున్నాయి. కనుమరుగైనవి కొత్తవి కానరావడానికి కారణమవుతున్నాయి. ఈ చక్రభ్రమణము దేన్ని సూచిస్తుంది? మనమీ ప్రపంచములో ఒక భాగము. ఇక్కడ మనం జీవించగోరితే ఇక్కడనుండీ పుచ్చుకొన్నవాటిని తిరిగి ఇచ్చేయ్యాలి. ఆహారము, నీరు, ప్రాణవాయువు మొదలైన వాటిని పరిగ్రహిస్తాము. బొగ్గుపులుసు వాయువు, వ్యర్థపదార్థాలను
తిరిగి ఇచ్చివేస్తున్నాము. తెలివిని పొందుతున్నాము. కొన్నింటిని తిరిగి ఇచ్చేస్తున్నాము. ఇది యజ్ఙ విధి. అందరూ ఈ నియమాన్ని పాటించి తీరాలి. ఈ ప్రపంచ మహాయజ్ఙములో ఒక చిన్న నమూనాయే అగ్నిలో ఆజ్యము పోసి చేసే యాగాలు. నెయ్యి మొదలైన ఆహుతులను అర్పిస్తాము. వర్షము, స్వర్గపదవి వంటివి ప్రాప్తించుకుంటాము. ఈ భావాన్నే గీత 3/11 లో చెబుతుంది. ఏమని? మీరు దేవతలను మెప్పించండి. వారు మిమ్ములను సంతోషపెడుతారు. ఈ సృష్టి సైతము ఈ యజ్ఞము వల్లే సంభవించింది. ఈ సూక్తములో రెండు కోవల సృష్టులు చెప్పబడినట్లు సాయనుడు వివరిస్తాడు. మొదటిది పూర్వ సృష్టి; రెండవది ఉత్తర సృష్టి. పూర్వ సృష్టిలో పరమాత్మ తనను ప్రపంచంగానూ అనేక ప్రాణులుగానూ సృష్టించుకున్నాడు. ఇది 4, 5 మంత్రాలలో వివరింపబడింది.
[06/10, 3:38 pm] +91 93913 24915: ✍️... రామ నామము ఎంత మధురం
మార్వాడా దేశంలో జానాబాయికి బాల్యం నుండి శ్రీరామనామ సంకీర్తనం చెయ్యడం అలవాటు.
నిరంతర శ్రీరామ సంకీర్తనం వలన ఆమె హృదయం రామనామంతో నిండిపోయింది.
నడుస్తుా,తింటుా, త్రాగుతుా, నిద్రపోతుా ఏపని చేస్తున్నా ఆమె నోటివెంట శ్రీరామ నామం ధ్వనిస్తుానే వుండేది.
ఆమె గురించి విని దేశాటన చేసే కబీర్ ఆమె వుండే గ్రామం ఆమె దర్శనం చెయ్యాలని వెళ్ళాడు.
ఆమె ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె పొరుగామెతో పిడకల కోసం తగవులాడుతున్నది.
అయ్యెా! అంత దుారంనుండి
ఈ తగవులు మారి కోసం వచ్చానా! అని కొంచెం బాధపడినా, ఆమె దగ్గరకు సమీపించి, అమ్మా! నీవు
పిడకలకోసమే కదా దెబ్బలాడు తున్నావు! అవి నీవే అని ఎలా చెప్పగలమ్మా. అని అడిగాడుట.
అంతట జానాబాయి నా పిడక వాయించి చుాడు 'రామ్ రామ్' అంటుంది. రా! విను! అని జానాబాయి పిడక వాయించింది.
'రామ్' ' రామ్' అని శబ్దం వచ్చిందట.
కబీర్ ఆమె రామభక్తికి, దృఢత్వానికి జోహార్లు అర్పించాడు.
ఎంత నిర్మలమైన ..
నిష్కపటమైన భక్తి....🙏🙏
🌸జై శ్రీమన్నారాయణ🌸
[06/10, 4:05 pm] +91 93913 24915: 🕉🌞🌎🌙🌟🚩
*-Swami Vivekananda's wisdom for daily inspiration - Oct 5.*_
*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - అక్టోబరు 5._*
*Through concentration of mind everything can be accomplished - even mountains can be crushed atoms. Concentration is the means through which we can gain anything and everything, mental, moral, or spiritual.*
*చిత్రైకాగ్రత ద్వారా సమస్తం సాధించవచ్చు. పర్వతాలను కూడా పరమాణువులుగా పొడి చేయవచ్చు. మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా ఏమైనా చేయడానికీ, ఏదైనా పొందడానికీ ఏకాగ్రతే మార్గం.*
🕉🌞🌎🌙🌟🚩
*-Inspiring Sayings of Swami Vivekananda / స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక వచనాలు.-*
*Every idea that strengthens you must be taken up and every thought that weakens you must be rejected.*
*మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతీ భావాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి.*
🕉🌞🌎🌙🌟🚩
[06/10, 4:05 pm] +91 93913 24915: *🌷29-మంద్రగీత🌷*
🕉🌞🌎🌙🌟🚩
*🥀చక్రభ్రమణము🥀*
*5. పనులు చేయుట మానినచో సమస్య తేలికపడునని భావించితివా? ప్రయత్నించిచూడుము. క్షణము కూడా కర్మాచరణము లేక నిలువలేవు.*
*నీవు చేయుచున్న పనులన్నియు నీ స్వభావము నుంచి వచ్చుచున్నవి గాని చేతులనుండి కాదు. నీ స్వభావమనగా ప్రకృతి. దానినుండి ఎప్పుడూ సత్వ రజో తమో గుణములు పుట్టుచుండును. వానినుండి నీకు గల గుణములు వివిధములుగా ఉత్పన్నమగుచుండును. నీలోని గుణముల ప్రేరేపణచే జరుగుచున్నవే నీవు చేయుచున్న పనులు. అనగా నీ తర్కమునకు, తెలివికి సంబంధించినవి కావు. నీవు చేయు పనులు నీచే చేయబడుచున్నవి గాని నీవు చేయుటలేదు. ప్రకృతి నీచే చేయించుచున్నది గాని నీ ఇచ్ఛతో వానికి సంబంధము లేదు. నీ గుణములను అనుసరించి ఇచ్ఛ అలవడును గాని ఇచ్ఛను అనుసరించి పనులు జరగవు. ఈ విషయమున ఎంత తెలివి గలవాడైనను అస్వతంత్రుడే.*
*6. స్వభావము ప్రేరేపించుచుండగా, తెలివి, తర్కము దానివెంట వచ్చుచుండగా నీవు పనుల వెంట ప్రేరేపింపబడుచున్నావు. ఇంకా చేయుట, మానుట నీకెట్లు లొంగును? నీవు ఆపగలిగినది భౌతిక శరీరమును మాత్రమే. కర్మేంద్రియములైన కాళ్ళు, చేతులు, మాట, స్త్రీ పురుష వాంఛ, మల మూత్రాది విసర్జనము నీకు లోకువయై ఉన్నవి. వాని ప్రవృత్తులను బంధించితివనుకొనుము. మనస్సు నీ స్వభావముచే ప్రేరేపింపబడి స్మరించుచుండును. ఇట్లు కర్మేంద్రియములను బంధించి ఇంద్రియార్థములను అందనీక వానినే మనస్సుతో స్మరించుచుండుట డంబాచారము అగును గాని సంయమము కాదు. కనుక సంయమము వలన కలుగవలసిన శాంతి కలుగదు.*
🕉🌞🌎🌙🌟🚩
[06/10, 4:19 pm] +91 99660 06009: *సామాజిక సూత్రం*
లోకంలో మనుషుల నడవడి విచిత్రంగా ఉంటుంది. తనదైతే ఒకలా, ఇతరుల విషయంలో మరోలా ప్రవర్తిస్తుంటారు. మనిషి ఎప్పుడు ఎలా నడుచుకోవాలో మహాభారతం చెప్పినట్టు మరే గ్రంథం చెప్పలేదేమో! భారతం ధర్మజ్యోతి.
భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలోని మరణాల వల్ల ధర్మరాజు ఎంతో మనస్తాపం చెందాడు. అతడి మనసులోని కలతను తీర్చడానికి ఎందరో హితవచనాలు పలికినా శాంతి చేకూరలేదు. వాసుదేవుడు అతణ్ని భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్లాడు. ధర్మరాజుకు ధర్మోపదేశం చేయమని కోరాడు. భీష్ముడు మహాజ్ఞాని. రాజనీతికి సంబంధించిన సమస్త విషయాలూ బోధించాడు. ధర్మం చాలా సూక్ష్మమైందని అది పలురీతుల్లో గోచరిస్తుందని చెబుతూ భీష్ముడు పరమ ధర్మమేమిటో వివరించాడు.
మహాభారతం శాంతిపర్వంలోని ‘ఒరులేమేమి యొనర్చిన నరవరయప్రియంబు తన మనంబున కగు...’అనే పద్యం ప్రపంచ వాంగ్మయంలోనే గొప్ప సూక్తి. కందుకూరి వీరేశలింగం ‘వివేకవర్ధిని’ పత్రికలో ఈ పద్యాన్ని ముఖతిలకంగా తీర్చిదిద్దారు. అనంతర కాలంలో కాశీనాథుని నాగేశ్వరరావు కూడా ‘ఆంధ్రపత్రిక’లో తమ ఆదర్శవాక్యంగా దీన్ని ప్రచురించేవారు. నాటికీ నేటికీ ఉత్తమ వ్యక్తిత్వానికి మార్గదర్శకమైన ప్రబోధం ఇందులో ఉంది.
ఇతరులు ఏది చేస్తే తన మనసుకు అప్రియం అవుతుందో తాను దాన్ని ఇతరులకు చేయకుండా ఉండటం సకల ధర్మాలకూ కుదురులాంటిది. ధర్మం రెండు విధాలుగా ఉంటుంది. అవి విధి నిషేధాలు- చేయవలసినవి, చేయకూడనివి. జన సామాన్యం కోసం ప్రతిపాదించిన ధర్మం- నిషేధాత్మకమైంది. అంటే- ఏం చేయకూడదో తెలియజేస్తుంది. తననెవరైనా కొట్టినా, గాయపరచినా దేహానికి నొప్పి కలుగుతుంది. అది మనసుకూ బాధ కలిగిస్తుంది. కొన్ని శారీరకమైనవి కావు... మానసికంగా బాధిస్తాయి. నింద, హేళన, చులకన చేసే మాటలు- ఇవన్నీ మనసును గాయపరుస్తాయి. కొన్ని మనసులో నాటుకుపోయి బతికినంతకాలం పీడిస్తూనే ఉంటాయి. అటువంటి పనులు తాను ఇతరులకు చేయ రాదని భారతం హెచ్చరిస్తుంది. అందరిపట్లా సమబుద్ధి కలిగిఉండాలి. లౌకికంగా ఇది చాలా ప్రయోజ నకరం. ఇతరులపై పగ ఉంటే ఎవరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. మనసులో పగ ఉంటే పామున్న ఇంట్లో నివసిస్తున్నట్టే అని భారతం చెబుతోంది. ఇతరుల విషయంలో మనం ఏం మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ఒక్క క్షణం వివేకంతో ఆలోచిస్తే మనం మంచి నిర్ణయం తీసుకోగలుగుతాం. ఎవరినీ బాధపెట్టం. తరవాత మనమూ బాధపడం.
దీన్ని మరోవిధంగానూ అన్వయించుకోవచ్చు. ఇతరులు తనపట్ల చేసిన ఏ పనులు తనకు ఆహ్లాదం కలిగించాయో అటువంటి పనులు తాను ఇతరులకు చేస్తూ ఉండటమే గొప్ప ధర్మం.
భారతంలోనే ఒక కథ ఉంది. సరమ దేవతల శునకం. సారమేయుడు దాని కొడుకు. జనమేజయుడు యజ్ఞం చేస్తుంటే ఆ పరిసరాలకు సారమేయుడు వచ్చి తిరుగాడుతున్నాడు. రాజుగారి తమ్ముళ్లు దాన్ని కొట్టి తరిమేశారు. అది ఏడుస్తూ తల్లితో మొరపెట్టుకుంది. సరమ ముందుగా తన కొడుకును అక్కడేమైనా పాడుపని చేశావా అని అడిగింది. ఏ తప్పూ చేయలేదని నిర్ధారించుకున్నాక రాజు దగ్గరకు వెళ్లింది. పసివాడు ఏ అపవిత్ర కార్యమూ చేయకుండా సంతోషంగా ఆడుకుంటూ తిరుగుతుంటే అతడి తమ్ముళ్లు అకారణంగా కొట్టి బాధించారని- ఇది చేయవచ్చు, ఇది చేయరాదని కొంచెమైనా ఆలోచించక సాధుజీవుల్ని హింసించే దుర్మార్గులకు ఆపదలు ముంచుకొస్తాయని నిందించి వెళ్లిపోయింది. నిష్కారణంగా, అనాలోచితంగా ఎవరికీ హాని కలిగించకూడదని ఇందులోని అంతరార్థం.
సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9966006009.
[06/10, 4:24 pm] +91 99660 06009: *శ్రీ*
ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన “శ్రీ” కారం రాస్తారెందుకు?
“శ్రీ” లక్ష్మీ ప్రదమైనది. మంగళకరమైనది మరియు మోక్ష దాయకమైనది. “శ్రీ” కారమున “శవర్ణ”, “రేఫ”, “ఈ” కారములు చేరి, “శ్రీ” అయినది. అందు “శవర్ణ” , “ఈ” కారములకు, “లక్ష్మీ దేవి” ఆధిదేవత, “రేపము” నకు, అగ్ని దేవుడు దేవత.
“శ్రియ మిచ్దేద్దు తాశనాత్!” అను పురాణ వచనానుసారముగా “అగ్నీ లక్ష్మీ ప్రదుడే, శుభకరుడే. ఈ ఇధంగా “శ్రీ” లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు.
మరియు, “శ” వర్ణమునకు గ్రహము “గురుడు”, “రేఫ “ఈ” కరములకు గ్రహములు “గురుడు”, “శుక్రుడు” గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున “శ్రీ” శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది.
నిఘంటువులో, “కమలా శ్రీర్హరి ప్రియా” అని ఉండటంతో, లక్ష్మీ నామలలో “శ్రీ” ఒకటి అని తెలియుచున్నది. కావున శుభకరమైంది.
ఇన్ని విధాలుగా “శ్రీ” సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, “శ్రీ” కారం తలమానికమై వెలుగొందుచున్నది. “శ్రీ” శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ ప్రాంతమందైననూ, ఏ భాషయందైననూ, “శ్రీ” అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుంటారు.
సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9966006009
[06/10, 4:46 pm] +91 93913 24915: ఉషఃకాలశ్చ గర్గశ్చ శకునం చ బృహస్పతి:౹
అంగిరాశ్చ మనోత్సాహో విప్రవాక్యం జనార్దనః౹౹
భావం
గర్గఆచార్యునిప్రకారం ప్రయాణానికి ఉష:కాలం మంచిది , బృహస్పతి మతం ప్రకారం మంచి శకునం చూసుకుని వెళ్ళాలి, అంగిరస్సు మతం ప్రకారం మనసు ఉత్సాహంగా ఉంటే బయలుదేరడమే, జనార్దన మతం ప్రకారం బ్రాహ్మణ వాక్యం అనుకూలంగా ఉంటే వెళ్ళాలి..
[06/10, 5:06 pm] +91 93913 24915: 🌼🌿మన సమస్యలకి సుందరకాండ పరిష్కారాలు.!🌼🌿
సుందరకాండ అద్భుతమైన పారాయణం,
ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు..
ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం
కాండం మొత్తం పారాయణ చేయలేరు,
అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది.
పారాయణ నియమాలతో ఉంటుంది.
ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.
1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి..
శ్లోకం.ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ ||
21 దినములు ,
108 సార్లు ,
శక్తి కొలది తమలపాకులు,
అరటిపళ్ళు నివేదన చేయాలి.
2. విద్యాప్రాప్తికి.
ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను .
3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన
3. భూతబాధ నివారణకు.
3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు
30 దినములు పారాయణ చేయవలెను .
1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన.
4. సర్వ కార్య సిద్దికి.
64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు
40 దినములు పారాయణ చేయవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
5. శత్రు నాశనముకు.
51 వ సర్గ అతినిష్ఠతో 2 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది ద్రాక్ష , బెల్లము నివేదన చేయవలెను.
6. వాహనప్రాప్తికి.
8 మరియి 9 వ సర్గలు ఏకాగ్రతతో 3 సార్లు
27 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.
7. మనశాంతికి.
11 వ సర్గ నిష్ఠతో 3 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.
అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
8. స్వగృహం కోరువారికి.
7వ సర్గ ఏకాగ్రతతో 1 సారి
40 దినములు పారాయణ చేయవలెను.
అరటిపళ్ళు చక్కెరతో నివేదన చేయవలెను.
9. యోగక్షేమాలకు.
13 వ సర్గ నిష్ఠతో 3 సార్లు
27 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటి , దానిమ్మ నివేదన చేయవలెను.
10. ఉద్యోగప్రాప్తికి.
63 వ సర్గ నిష్ఠతో 5 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను .
శక్తి కొలది అరటి ,దానిమ్మ నివేదన చేయవలెను.
11. రోగ నివారణకు.
34వ సర్గ ఏకాగ్రతతో 5 సార్లు ప్రతిదినము ,
21 దినములు పఠించవలెను.
శక్తి కొలది బెల్లపు ముక్క అరటిపళ్ళు నివేదన చేయవలెను.
12. దుఃఖనివృత్తికి.
67 వ సర్గ నిష్ఠతో ప్రయత్నం మానకుండా 3 సార్లు
21 దినములు పారాయణ చేయవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు,ఖర్జూరము నివేదన చేయవలెను.
13. దుస్వప్న నాశనానికి.
27వ సర్గ ఏకాగ్రతతో 1 సారి ప్రతిదినము పఠించవలెను . శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
14. దూరముగా ఉన్న ఆప్తులు క్షేమమునకు.
33 నుండి 40 వ సర్గ వరకు 1 సారి ,
21 దినములు నిష్ఠతో పఠించవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
15. ధనప్రాప్తికి.
15వ సర్గ ఏకాగ్రతతో 1 సారి
40 దినములు పఠించవలెను.
అరటిపళ్ళు, పటిక బెల్లం , మరియు
రామాయణం లో అయోధ్యకాండలో యాత్రాదానము
32 వ సర్గ 1 సారి ,
40 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్షనివేదన చేయవలెను . ( అగస్త్య , పరాశర , ఉమా సంహిత ప్రకారం చెప్పబడినది ).
16. దైవాపచారా ప్రాయశ్చిత్తం.
38 వ సర్గ ఏకాగ్రతతో 3 సార్లు
27 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు వీలైతే పనస నివేదన చేయవలెను.
17. బ్రహ్మజ్ఞానము కలుగుటకు.
19 వ సర్గ అతినిష్ఠతో రోజుకు ఒకసారి
1 సంవత్సరము పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
18. ఏలిననాటి శనీ దోష పరిహారమునకు.
సకల రోగ నివృత్తికి - సర్వ పాప నివృత్తికి
మొత్తం సుందరకాండ నిష్ఠతో 9 దినాలలో 1సారి
68 రోజులు చదువవలెను.
నివేదన రోజూ కొబ్బరికాయ సత్ఫాలితమునిచ్చును.
19. కన్యా వివాహమునకు.
9 దినములలో ఒకసారి పూర్తిగా
68 దినాలలో పఠించవలెను.
సీతారామ కళ్యాణం నిష్ఠతో 7 సార్లు
ప్రతిరోజు పఠించవలెను.
అప్పాలు , పాలు , పంచదార నివేదన చేయవలెను.
20. విదేశీ యానమునకు.
1 వ సర్గ ఏకాగ్రతతో రోజుకు 5 సార్లు
30 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు, ఖర్జూరము నివేదన చేయవలెను.
21. ధననష్ట నివృత్తికి.
55వ సర్గ నిష్ఠతో 3 సార్లు
30 దినములు పఠించవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు,పనస నివేదన చేయవలెను.
22. వ్యాజ్యములో విజయమునకు.
42 సర్గ అతి ఏకాగ్రతతో 3 సార్లు ,
21 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు, ద్రాక్ష , దానిమ్మ నివేదన చేయవలెను.
23. వ్యాపారాభివృద్ధికి.
15వ సర్గ నిష్ఠతో నియమంతో 5 సార్లు
21 దినములు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
24. పుత్ర సంతానానికి.
ప్రతిదినం 7 వ సర్గ నిష్ఠతో
68 రోజులు పారాయణ చేయవలెను .
శక్తి కొలది అరటిపళ్ళు , కొబ్బరికాయ ,నివేదన చేయవలెను.
శక్తి కొలది తమలపాకులతో అర్చన చేయవలెను . సుందరకాండ 16 రోజులు పారాయణ చేయవచ్చును.
25. ఋణ విముక్తికి.
28 వ సర్గ చాలా నిష్ఠగా రోజుకి 1 సారి
41 రోజులు పఠించవలెను.
శక్తి కొలది అరటిపళ్ళు నివేదన చేయవలెను.
🌼🌿శ్రీరామ జయరామ జయ జయరామ..🌼🌿
[06/10, 5:06 pm] +91 93913 24915: అహంకార స్వరూపాన్ని గుర్తించడమే చాలా కష్టం.. మానం మాట్లాడే నాలుగు మాట ల్లో అప్రయత్నం గా అహంకారం ధ్వనిస్తుంది..
మన లోని అహంకారాన్ని గుర్తించడం చాలా కష్టం.. మనల్ని మనం పరిచయం చేసుకోవడం లొనే అహంకారం బయట పడుతుంది.
.మన ఆస్తిత్వానికి గుర్తులు మనమే చెబుతాము. పదవి డబ్బు చదువు లేదా కళల్లో ప్రవేశం ద్వారా పరిచయం చేసుకుంటాము..
ఇలా పరిచయం చేసుకోవడం తప్పు కాదు. కానీ ఆ భావ ప్రకటన కోసం మనం ఉపయోగించే పదాల్లో అహంకారం బయట పడుతుంది. మన కంటే పెద్దలు ఎంతో వినయంగా నమ్రతగా గౌరవంగా స్నేహం గా మాట్లాడినా
చాలా మంది లో వినయం సౌజన్యం లోపిస్తున్నది..
.స్నేహం కోరి వచ్చిన వాళ్ళని తృణీకరిస్తూ మాట్లాడటం ఇప్పటి సంప్రదాయం అయిపోయింది.
ఒకప్పుడు పెద్దలతో ఎలా మాట్లాడాలో నేర్పించేవారు...కనీసం ఇప్పుడు
పలకరించిన వారికి నమస్కారం పెట్టడం కూడా అరుదు..
రామాయణం లో ఆంజనేయ స్వామి సుందరకాండ లో
చంప దగిన శత్రువే అయినప్పటికీ రావణాసురిడితో ఎంతో వినయంగా
గౌరవంగా పలుకుతాడు...అతడిని చూసి ఇలా అనుకుంటాడు.
అహో రూప మహో ధైర్య మహో సత్త్వ మహో ద్యుతిః
అహో రాక్షస రాజస్య సర్వ లక్షణ యుక్తతా !!
వాల్మీకి రామాయణం సుందరకాండ 49 వ సర్గ 17 వ శ్లోకం
ఆహా ఏమి ఈ రావణాసురుడి రూపం !ఏమి ఇతడి ధైర్యం !! ఏమి ఇతడి బలం ! ఏమి కాంతి ! ఏమి సర్వ లక్షణ సంపన్నత్వం.!
రావణాసురుడి ని చూసి హనుమ అనుకున్న మాటలివి.
శత్రువు లో కూడా ఉన్నా సద్గుణాలని ఆయన చూడగలిగాడు
స్నేహం కోరి వచ్చిన వారితో తృణీకరించి మాట్లాడటం చాలామంది లో
కనిపిస్తున్నది.
హనుమ తనని తాను పరిచయం చేసుకోవడం చాలా అద్భుతం గా
ఉంటుంది... ఎక్కడ తన గురించి చెప్పుకొడు.
" రావణాసురుడు హనుమ ని చూసి. ఆశ్చర్య పోతూ ఇలా అన్నాడు..
. నీవు. మహానుభావుడి లా కనిపిస్తున్నావు బ్రహ్మ తేజస్సు తో ఉన్నావు..ఏ దేవత పంపాడు "
అంటే ,
" నేను కేవలం వానరుడను.యుద్ధం కూడా ఆత్మ రక్షణ కోసమే చేశాను.
అస్త్ర పాసైర్ణ శక్యో అహం బద్ధుమ్ దేవాసు రేరేపి
పితా మహాదేవ వరో మమస్యేషో అభ్యుపాగతః
సుందరకాండ 50 వ సర్గ 16 వ శ్లోకం.
"దేవతలు అసురులు కూడా నన్ను అస్త్ర పాశాలతో బంధించలేరు.
నీకు ఏవో వరాలు లభించినట్లే నాకు కూడా ఈ వారలు బ్రహ్మ దేవుని నుండి లభించాయి.."
ఇదీ హనుమ వినయం..తన శక్తి ని తానూ చెప్పుకోలేదు.
సూచించాడు. శత్రువుల వద్ద కూడా వినయం నమ్రత పాటించాడు...
శ్రీ రామ చంద్రుడి దూత ని , సుగ్రీవుడి మంత్రిని అని మాత్రం చెప్పుకున్నాడు. అహంకారం అనుమాత్రం లేదు...
ఒక సారి. మన మాటలని. మనం పరిశీలించుకోవడం చాలా. అవసరం
..
శ్రీ సీత హనుమత్సమెత రామచంద్ర. కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి