6, అక్టోబర్ 2020, మంగళవారం

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *వందేమాతరం*

                                                                                                                                                                                          *


*రోజుకో పద్యం: 1918 (౧౯౧౮)*


*10.1-904-*


*క. మీవెంట వత్తు నే నై*

*రావణనాగంబు నెక్కి రయ మొప్పంగా*

*దేవగణంబులతోడను*

*గోవిందుని మంద లెల్లఁ గొందలపెట్టన్. "* 🌺



*_భావము: ఇంద్రుడు ఆ మేఘాలతో ఇంకా ఇలా అంటున్నాడు: "మీరు ఇతర దేవగణములతో కలిసి రాళ్ళ వర్షం కురిపించి ఆ కృష్ణుణ్ణి , ఆలమందలను అల్లకల్లోలం చేసి క్షోభ పెట్టండి, నేను కూడా మీ వెంట ఐరావతము నెక్కి వేగంగా వస్తాను”._* 🙏



*_Meaning: Indra further told the clouds: "Together with other celestial beings shower hailstorm and create tumult and turmoil for all those in Brindavan including Krishna. I will follow you on my Airavata elephant"._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1919 (౧౯౧౯)*


*10.1-905-వ.*

*10.1-906-*


*ఉ. "అక్కట! వానఁ దోగి వ్రజ మాకుల మయ్యెఁ గదయ్య! కృష్ణ! నీ*

*వెక్కడనుంటి? వింత తడవేల సహించితి? నీ పదాబ్జముల్*

*దిక్కుగ నున్న గోపకులు దీనత నొంద భయాపహారివై*

*గ్రక్కునఁ గావ కిట్లునికి కారుణికోత్తమ! నీకుఁ బాడియే?* 🌺



*_భావము: ఈ విధముగా ఇంద్రుడు ఎంతో పటాటోపముతో వజ్రాయుధమును విక్షేపించి పట్టుదలతో కోపించి సంకెళ్లు విప్పించగా ఝంఝామారుతం వీచి అమోఘమైన మేఘములు దట్టముగా కమ్ముకొని, అంధకారముచేత సూర్య మండలమును కప్పి వేసింది. కుండకి చిల్లు పడిన రీతిలో వర్షపు ధారలు లావుగా పడుతూ, రాళ్ళ వాన, పిడుగులను కూడా కురిపిస్తూ మిట్ట పల్లములను సమతలముగా చేసేశాయి. భూమి అంతా సముద్రము లాగా కనిపిస్తోంది. ప్రళయకాలము వలె మెరుస్తున్న మెరుపులకు దూడలు మూర్ఛ పోతున్నాయి, భయంకరమైన ఉరుముల నుండి వెలువడే దుందుభుల శబ్దములచే చెవులు చిల్లులు పడి కుంగిపోయి ఆవులు పడిపోతున్నాయి. పరమశివుని గదా ఘాతములకు పుట్టిన పిడుగులకు, భయానకమైన రాళ్లవానకు భీతిల్లి రక్షించు రక్షించమని మొరపెట్టుకునే ఆంబోతులు, గోపకులు, గోప స్త్రీలు పిల్లలతో సహా కృష్ణునికి నమస్కరించారు.*

 

*ఇదంతా గమనిస్తున్న కొందరు బుద్ధిమంతులగు పెద్దలు "కృష్ణా! నీవే కాపాడాలి", అని ఇంకా ఇలా అంటున్నారు: "ఈ వాన భీభత్సానికి నంద వ్రజము అతలాకుతలమైంది, ఎక్కడున్నావయ్యా ఇంత సేపు? ఎందుకు ఇంత ఓర్పు వహిస్తున్నావు? నీ పాదకమలములనే నమ్మి నీవే దిక్కని అంటున్న గోపకుల దీనావస్థను ఎలా సహించావు? ఓ దయానిధీ! మా భయమును పోగొట్టి రక్షించగల వాడవు నీవొక్కడవే. మరి నీకు ఇలా ఊరకుండుట తగునా ?"_* 🙏



*_Meaning: Indra with pomp and show curved his Vajrayudha and resolutely released the wind waves. Dark clouds formed and covered the rays of Sun creating shadow of gloom. With lightning and thunder, heavy torrential downpour started raining elephants and camels.* 


*With flooding, the earth looked like massive sea levelling all uplands. The calves fainted at the dazzling lightnings, and the cows were falling to the ground not able to bear the sounds of thunder. Frightened by the thunderbolts and raining of stones, elders in the clan, bulls, men and women folk of Yadavas appealed to Sri Krishna to save them from the fury and ferocity of nature thus:* 

*"The intensity of ferity and frenzy of rain and stones confounded the inhabitants and caused bewilderment in all of us. Why you are tolerating this calamitous and catastrophic situation? Why are you ignoring the miserable state of your dependents? You are the One and the Only Saviour. How can You remain quiet in these direful circumstances?"_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

కామెంట్‌లు లేవు: