6, అక్టోబర్ 2020, మంగళవారం

రామాయణమ్..120

 

.

రాముడు శరభంగ మహాముని ఆశ్రమంలో ఉండగానే అక్కడ నివసించే మునులంతా ఆయన వద్దకు వెళ్ళారు .

.

వారిలో రకరకాల సంప్రదాయాలు అనుసరించి తపస్సు చేసుకునేవారున్నారు .వారందరూ గుంపుగా ఒకచోట పోగై రాముడిని కలిసి ప్రార్ధించారు. 

.

రామా రక్షకా ! నీవు తప్ప మాకెవరు దిక్కు ? నీ వద్దకు భిక్షుకులుగా వచ్చాము ,అర్ధిస్తున్నాము మాకు ప్రభువు నీవే కదా !

ఇక్ష్వాకులేకదా అనాది కాలంనుండి మాకు దిక్కు .రామా మూడులోకాలలో నీవంటి మహాధనుర్విద్యావేత్త ఎవడూలేడు, అలాంటి నీ పాలనలోకూడా మాకు రాక్షసుల బాధలు తప్పటం లేదు. 

.

మమ్ములను నీవే కాపాడాలి ప్రభూ ! అని ముక్త కంఠంతో మొరపెట్టుకున్నారు వారంతా . 

.

ఓ తాపసులారా మీరు నన్ను ఇలా ప్రార్ధించకూడదు. ఆజ్ఞాపించండి .మీ కోరిక నెరవేరుస్తాను ఇక మీరు నిశ్చింతగా ఉండండి .

.

రాక్షసులు నా పరాక్రమము ,నా తమ్ముడి పరాక్రమము ఇకముందు రుచి చూస్తారు,మీరు గుండెల మీద చెయ్యివేసుకొని ఏ భయమూ లేకుండా మీమీ కార్యాలు చూసుకోండి అని అభయమిచ్చి అక్కడనుండి సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం వైపుగా సాగిపోయాడు.

.

చాలాదూరం ప్రయాణం చేసి వారు ఆ ముని ఆశ్రమం చేరుకున్నారు.

.

రాముడిని చూడగానే ఆ ముసలి మునికి ఎక్కడలేని ఉత్సాహము ఉప్పొంగింది ఒక్కుదుటున లేచి ,రామా వచ్చావా! నీకోసమే చూస్తూ ఉన్నానయ్యా అని కౌగలించుకొన్నాడు.

.

మహర్షీ మాకు నివాస యోగ్యమైన ఒక స్థలాన్ని నీవు చూపగలవని శరభంగులవారు మాకు చెప్పినారు. కావున మాకు ఆచోటు చూపించండి స్వామీ అని ప్రార్ధించాడు రాముడు.

.

అంత ఆ మహర్షి రామా ఈ ఆశ్రమవాతావరణం చాలా ఆహ్లాదకరం గా ఉంటుంది నీవు ఇక్కడే వసియించవచ్చు అని అన్నాడు.

.

ఆయన మాటలు విన్న రాముడు ,ధనుర్బాణములతో నేను ఇక్కడ ఉంటె ఆశ్రమ ప్రశాంతతకు భంగం కలుగవచ్చు కావున వేరొక చోటు చూపించండి స్వామీ అని అడిగాడు.

.

అప్పటికే రాత్రి అయ్యింది ముని ఇచ్చిన ఆహారాన్ని తీసుకొని అక్కడే విశ్రమించారు మువ్వురూ.

.

రామాయణమ్ 121

.

తెల్లవారగానే సుతీక్ష్ణ మహాముని వద్ద సెలవు తీసుకొని దండకారణ్యములో నివసించే మునుల ఆశ్రమాలను చూడటానికి బయలు దేరాడు రాముడు.

.

అంతకుముందే వారందరికీ ,మిమ్ములను రక్కసుల బారి నుండి కాపాడతానని , అభయమిచ్చివున్నాడు రాఘవుడు,

'

ముగ్గురూ ఎప్పటిలాగే నడవ సాగారు.

అప్పటిదాకా మౌనంగా ఉన్న సీతమ్మ, రామా నేనొక మాట చెపుతాను విను అన్నది.

.

.మనిషికి కామము వలన మూడు రకాలైన వ్యసనాలు జనిస్తాయి .వాటిలో మొదటిది అబద్ధమాడటం!

  సత్యసంధుడవైన నీవు కలలో కూడా అసత్యమాడవు .

ఆ విషయములో సందేహములేదు.

.

ఇక రెండవది ,

.

పరుల భార్యలను కామించుట!

,ఎకపత్నీవ్రతుడవైన నీవు అలాంటి పాపపు పని ఎప్పుడూ చేయవు .అలాంటి కోరిక నీకు ఇప్పుడు లేదు ఇక ముందు కూడా కలుగదు అది సత్యము.

.

ఇక మూడవది !

.

అకారణముగా వైరము పూని క్రూరముగా ప్రవర్తించటం ,

నీకు రాక్షసులు ఏ అపకారం చేసారని వారితో వైరం పెట్టుకోవాలనుకుంటున్నావు ?.

.

నీకు ఏ అపకారం చేయనివారిని సంహరిస్తానని మునులకు ఎందుకు మాట ఇచ్చావు ,!

.

తాపస వృత్తినవలంబించి పదునాలుగేండ్లు అరణ్యములో గడపటానికొచ్చాము. ఆ పని పూర్తి చేసుకొని తిరిగి వెళ్దాము ,అయోధ్యకు వెళ్ళిన తరువాత మరల క్షత్రియ ధర్మము పాటించవచ్చు అడవిలో వద్దు. 

.

నీ చేతిలో ఉన్న ధనుర్బాణాలు నీలో క్రౌర్య ప్రవృత్తిని పెంచరాదు.

.

నీ సహధర్మచారిణిగా ధర్మము అని నాకు తెలిసినది నీకు చెప్పటం నా బాధ్యత ,ధర్మమూర్తివి! నీకు తెలియని ధర్మమేమున్నది.

.

అని హితవు పలికింది సీతమ్మ.

.

NB

.

భర్తకు ఏ సమయములో ఏ హితవు చెప్పాలో తెలిసిన తల్లి సీతమ్మ.

మౌనంగా ఏమీ కూర్చుని ఆయనతో నడవలేదు.

అరణ్యములో రాక్షససంహారము చేస్తాను అని మాట ఇచ్చాడాయన! దాని ఫలితమే రాబోయే రోజులలో వారిరువురూ ఎదుర్కొన్న కష్టాలు.

.

ముందే ఊహించి ఆవిడ హితవు పలికింది .

కామెంట్‌లు లేవు: