**దశిక రాము**
*జయ జయ జగదంబ శివే*
*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*
*జయ జయ మహేశదయితే*
*జయ జయ చిద్గగన కౌముదీధారే||*
🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
**ఆర్యాశతకము**
🌹17.
శ్లోకం
**మధురస్మితేన రమతే**
**మాంసలకుచభారమన్ద గమనేన౹**
**మధ్యేకాఞ్చి మనోమే**
**మనసిజ సామ్రాజ్య గర్వబీజేన౹౹**
🌺భావం:
మన్మథుని సామ్రాజ్య గర్వమునకు మూలకారణమైన కామాక్షీదేవి , పరిపూర్ణవక్షస్థలభారము వలన మందగమనము గలదై,మధురమైనచిరునవ్వుతో కాంచీక్షేత్రమధ్యమమున కొలువై యున్నది. ఆచిదానంద స్వరూపిణి ని నా మనస్సునందు నిలుపుకొని ఆనందించుచున్నాను.
💮ధ్యాన మగ్నుడైన శంకరుని విచలితుని చేయబోయి ,ముక్కంటి ఆగ్రహానికి గురై బూడిద అయిన మన్మథుడు అమ్మవారి కటాక్షము తో తిరిగి జీవము ను పొంది మరల తనసామ్రాజ్యమును పునరుద్ధరణ చేసుకొనెను. సకలజీవ పోషణాభారము వహించు ఆ జగజ్జనని మధురహాసముతో కంచియందు కొలువై భక్తుల పాలించుచున్నది.
జీవప్రదాత,జీవనప్రదాత కూడా ఆ తల్లియే గదా! 🙏
🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱
🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹
సశేషం....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి