ఈనాటి సూక్తులు
55) వస్త్ర ముఖ్య స్త్వలంకారః
ప్రియ ముఖ్యంతు భోజనమ్,
గుణోముఖ్యంతు నారీణాం
విద్యాముఖ్యంతు పూరుషః !!
ఎన్ని నగలు పెట్టుకుని , ఎన్ని అలంకారాలు చేసి
కొన్నా, మంచివస్త్రాలు లేకపోతే ఆ అలంకారాలన్నీ వ్యర్థమే .
కనుక అలంకారాలు అన్ని టి లోకీ వస్త్రాలు ముఖ్యం . ఎన్ని పిండి
వంటలు , పరమాన్నాల తో భోజనం పెట్టినా ప్రీతి లేకపొతే తిన్నట్లే
వుండదు. కనుక భోజనానికి ప్రీతి ముఖ్యం . స్త్రీ లకు అందం వున్నా
ఇంకా ఎన్ని వున్నా గుణం మంచిది కాకపోతే అవన్నీ వ్యర్థమే కనుక
స్త్రీ లకు గుణమే ప్రధానం . అలాగే పురుషులకు ఎన్ని వున్నా
విద్య లేకపోతే అన్నీ వ్యర్థమే అవుతాయి .కాబట్టి పురుషులకు
విద్య యే ముఖ్యం .
56) ఉత్సాహ , సాహసం, ధైర్యం
బుద్ధి శ్శక్తి, పరాక్రమః
షడై తే యత్ర తిష్ఠంతి
తత్ర దేవోపి తిష్ఠతి !!
ప్రతి యొక్కరికీ ఉత్సాహం , సాహసం , ధైర్యం
తెలివి, శక్తి, పరాక్రమం వుండాలి , ఇవి లేనివారు ఏపనీ చేయలేని
వ్యర్థులు . ఈ ఆరు గుణాలు ఎవరియందు వుంటాయో , వారిలో
దేవుడుంటాడు. అనగా వారికి దైవ సహాయం వుంటుంది .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి