6, అక్టోబర్ 2020, మంగళవారం

**సౌందర్య లహరి శ్లోకము - 17**

 దశిక రాము**




**శ్రీ శంకర భగవత్పాద విరచితము**


**శ్రీ లలితాంబికాయైనమః**


శ్లోకమ్ 17


**సవిత్రీ భిర్వాచాం**


**శశిమణిశిలాభఙ్గ రుచిభి**


**ర్వశిన్యాద్యాభిస్త్వాం**


**సహజనని సఞ్చిన్తయతి యః**


**సకర్తా కావ్యానాం**


**భవతి మహతాం భఙ్గిరుచిభి**


**ర్వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః !!**


అమ్మా ! వాక్కులను సృజించేవారూ, చంద్ర కాంత

మణుల శకలాల మాదిరి తెల్లనయిన దేహ ముఖ

కాంతి గలవారు ఐన వశిన్యాది శక్తులచే సేవించబడుతున్న నిన్ను ఎవరు చక్కగా ధ్యానిస్తాడో అతడు కాళిదాసు మొదలైన కవుల యొక్క కవిత్వ రచన

మాదిరి రుచిమంతాలై సరస్వతీ దేవియొక్క ముఖ కమల పరిమళంబుల వెదజల్లే మృదువైన వాగ్గుంభనలతో సమర్థుడై కవితల్లజుడవుతున్నాడు.

-


**ఓం కన్యకాయైనమః**


**ఓం దుర్గాయైనమః**


**ఓం కలిదోష విఘాతిన్యైనమః**


🙏🙏🙏


**ధర్మము - సంస్కృతి**

కామెంట్‌లు లేవు: