6, అక్టోబర్ 2020, మంగళవారం

శ్రీ సామ్రాజ్య లక్ష్మీ అష్టోత్తర పరివార దేవతా సహిత మహా శాంతి యజ్ఞం.

 శ్రీరస్తు. శుభమస్తు. అవిఘ్నమస్తు.

       ఓం శ్రీo హ్రీం శ్రీ మాత్రేనమః

     శ్ర మాతా, శ్రీ మహారాగ్ని , శ్రీ చక్ర సింహసిని అయిన జగన్మాత అనుగ్రహము ఉంటే సకల శుభాలు జరుతాయి.సర్వ కార్యసిద్ధి, భోగ మోక్ష ప్రదాయని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితుల నుండి ఉపశమనం కోసం వేద పండితుల నిర్ణయించిన విధంగా ,ది .17- 10- 2020 నిజ ఆశ్వీయుజ మాస శుద్ధ పాడ్యమి తిథి శుభముహూర్తము నందు దేవి నవరాత్రుల మొదటి రోజు అమ్మవారి ఆశీర్వాదంతో , పుణ్య నదీ జలములు, విశేష పూజా ద్రవ్యాలతో 108 మంది మణిద్వీప పరివారదేవతలను ప్రత్యేక సంకల్పంతో , షోడశోపచారాలతో, ఆవాహన చేసి 108 ప్రత్యేక కలశముల స్థాపన చేసి, విశ్వశాంతి కోసం విజయదశమి పర్వదినము రోజున మహా శాంతి హోమం జరుగుతుంది. ఆ రోజు నుండి నిరంతరాయంగా శ్రీ సామ్రాజ్య లక్ష్మీ అష్టోత్తర పరివార దేవతా సహిత మహా శాంతి యజ్ఞం నిర్వహించాలని లోక హితులైన మహర్షులు నిర్ణయించడం జరిగింది.


అమ్మ వారి స్వరూపాలలో అత్యంత విశేష మైన శ్రీ సామ్రాజ్య లక్ష్మీ ఆరాధన వలన విశేష ఫలితాలను సత్వరమే పొందవచ్చని శాస్త్ర వచనం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సకల జీవ కోటి శ్రేయస్సు కోసం ఋషి సంప్ర దాయకులు, సిద్ద గురువులు పూజ్యశ్రీ శ్రీకృపా నిధి మహరాజ్ వారు ఈ మహా సంకల్పం చేసారు. కర్ణాటక రాష్ట్రంలో మధుగరైకి దగ్గరలో పవిత్ర పుణ్య క్షేత్రంగా నిర్మిస్తున్న శ్రీ సామ్రాజ్య లక్ష్మీ అమ్మవారి మహా సంస్థానం ఆవరణలో ప్రత్యేకముగా నిర్మించిన యాగశాల నందు ప్రతి దినము ఈ యజ్ఞం నిర్వహించాలని తలపెట్టారు.


ఈ యజ్ఞము ద్వారా జరుగుతున్న విశ్వ కల్యాణ ప్రయోజనములు.


1. ప్రకృతి శక్తులకు శాంతి చేకూరుతుంది.

2. పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి.

3.వ్యాపార రంగంలో పురోభివృద్ధి ఉంటుంది.

4. ఉద్యోగులకు వత్తిడి నుండి ఊరట లభిస్తుంది.

5. విద్యార్థులకు జ్ఞాన సిద్ధి కలిగి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది.

6.అందరి ఆరోగ్యానికి అనుకూలత ఏర్పడుతుంది.

7.దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది.

8.సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులనుండి ఉపశమనం లభిస్తుంది.

9.కార్య జయం సిద్ధిస్తుంది.


ఈ మహాయజ్ఞం లో ప్రత్యక్షముగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే వారి మనోవాంఛలు నెరవేరతాయి.


ఇక్కడ జరిగే విశేష పూజలు.


అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో మంగళ స్నానము,

విశేష ద్రవ్యాలతో అభిషేకము,

వేద పండితులచే వేద పఠనం,

శ్రీ చక్ర నవావరణ అర్చన,

కుంకుమ పూజ,

శ్రీ చండి సప్తశతి పారాయణం,

దశ మహా విద్యల హోమము,

శ్రీ సామ్రాజ్య లక్ష్మీ బీజాక్షర సహిత నిత్య శాంతి మహాయజ్ఞం,

గోపూజ.


365 రోజులు ప్రతీ నిత్యం ఈ కార్యక్రమములు జరుగుతూ ఉంటాయి. కోర్టు వివాదాలు,ఉన్నత పదవీ ప్రాప్తి, వివాహ, సంతాన, ఆరోగ్య, ఆర్థిక, వ్యాపార,ఉద్యోగ సమస్యలకు మరియు దుష్ట గ్రహ ప్రయోగములకు, నరఘోష నివారణకు ప్రత్యేక హోమములు నిర్వహించబడును.


ఈ విశేష కార్యక్రమంలో పాల్గొనుటకు ఆశక్తి గలవారు ఈ క్రింది నెం లో సంప్రదించండి.



                 శ్రీ సామ్రాజ్య లక్ష్మీ మహాసంస్థానం


                           9901901116

కామెంట్‌లు లేవు: