నక్షత్రములలో ఇది 13వ నక్షత్రము. హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రగ్రహం. రాశ్యాధిపతి - బుధుడు. అధిదేవత - సూర్యుడు. జంతువు - మహిషి(గేదె). హస్తనక్షత్రము నవాంశ విషయానికి వస్తే మొదటి పాదము - మేషరాశి, రెండవ పాదము - వృషభరాశి, మూడవ పాదము - మిధునరాశి, నాలుగవ పాదము - కర్కాటకరాశిలో ఉంటాయి.
హస్తా నక్షత్ర మొదటి పాదము
హస్తా నక్షత్ర అధిపతి చంద్రుడు. దేవగణ నక్షత్రం. కాబట్టి వీరు సాత్విక గుణం కలిగి ఉంటారు. భావోద్వేగాలు మారుతుంటాయి. అవేశపూరిత స్వభావం కలిగి ఉంటారు. ప్రేమ, ఆగ్రహం, అలక, అభిమానం వంటి భావాలు పరిస్థితులను బట్టి మార్చి ప్రదర్శిస్తారు. తరచూ అభిప్రాయాలూ కూడా మార్చుకుంటారు.
15 ఏళ్ల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహు దశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం జరుగుతుంది.
హస్త నక్షత్ర మొదటి పాదములోని జాతకులకు ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. సైనిక పరమైన ఉద్యోగాలు కూడా అనుకూలం. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. భూ సంబంధిత, అగ్ని సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.
33 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించిన సొమ్ము పదిల పరచుకుంటే ఇబ్బందులు ఎదురు కావు. 49 సంవత్సరాలకు మొదలయ్యే శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 68 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సాఫీగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా ఉంటుంది.
హస్తా నక్షత్ర రెండవ పాదము
ఆధ్యాత్మికం, ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. ఉద్రేకపూరిత స్వభావులైనా స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు.
13 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహు దశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాల్సి ఉంటుంది. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది.
ఇక వీరు సౌందర్య పోషణ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అలంకరణ వస్తువులను సేకరించడం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కళారంగం వీరికి అనుకూలం. కళారంగం వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వంటి వైద్య సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.
31 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించినది పదిల పరసుచుకుంటే ఇబ్బందులు ఉండవు. 47 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శని దశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి . 66 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా జరిగిపోతుంది.
హస్తా నక్షత్ర మూడవ పాదము
11 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి. జీవితంలో నిదానంగా స్థిరపడాలి. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం ఉంటుంది. 29 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి ఆరంభమవుతుంది. సంపాదించిన సొమ్ము పదిలపరచుకుంటే ఇబ్బందులు ఉండవు.
ఇక బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం. ఔషధ తయారీ, ఔషధ విక్రయశాల నిర్వహణ వంటి వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. మేధో సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.
45 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శనిద శ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 64 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సుఖంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా జరిగిపోతుంది.
హస్తా నక్షత్ర నాలుగవ పాదము
వీరికి తల్లి అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. మాతృ వర్గంతో అనుబంధం అధికంగా ఉంటుంది. 9 సంవత్సరాల వరకు విద్యలో ఆటంకాలు ఉండవు. కాని తరువాత వచ్చే రాహుదశ కారణంగా 18 సంవత్సరాలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యాభ్యాసంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ప్రయత్నా పూర్వకంగా వీటిని అధిగమించి విజయం సాధించాలి.
జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం ఉండే అవకాశాలు ఉంటాయి. రాహుదశ అనుకూలిస్తే విదేశీయానం, ఉన్నత విద్యాభ్యాసం కొనసాగుతుంది. 27 సంవత్సరాల వయసులో గురుదశ ప్రారంభంతో అభివృద్ధి మొదలవుతుంది. సంపాదించిన సొమ్ము పదిల పరచుకుంటే ఇబ్బందులు ఉండవు.
వీరికి ఔషధ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. బియ్యం, పాలు, డైరీ ఉత్పత్తులు, కాగితం.. వంటి వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలం.
43 సంవత్సరాలకు ఆరంభం అయ్యే శనిదశ కాలంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. 61 సంవత్సరాలకు వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కొంత ఉపశమనం కలిగిస్తుంది. తరువాత జీవితం సుఖంగా జరిగిపోతుంది. వృద్ధాప్యం కూడా సాఫీగా సాగిపోతుంది.
హస్తా నక్షత్ర జాతకుల గుణగణాలు
ఈ నక్షత్ర జాతకులు ఆకర్షణ కలిగి ఉంటారు. కోమలమైన శరీరం, పొడగైన ముఖ రూపం ఉంటుంది. అనుకున్న సముయములో ఇష్టమైన విద్య అభ్యసిస్తారు. చంచల స్వభావం కారణంగా తరచూ అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటి వారి కష్టాలను సులువుగా అర్ధం చేసుకుని అడగగానే వారికి, సహాయము చేస్తారు. మంచి స్నేహితులు ఉంటారు. ప్రేమ వివాహాలు జీవితములో ప్రధాన ప్రస్తావన అవుతుంది. వ్యుహాలు రహస్యం అయినా కొందరికి మాత్రమే చెబుతారు.
దూరప్రాంత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, జీవితంలో మంచి మలుపులు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో శక్తి సామర్ధ్యాలకు గుర్తింపుకు కొంత కాలం వేచి చూడాలి. న్యాయ స్థానాలను కూడా ఆశ్రయించాల్సి ఉంటుంది. సొంత తెలివి తేటలతో వ్యాపారాలను అభివృద్ధిపరచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారు. సహోదరీ వర్గము పట్ల అభిమానము కలిగి ఉంటారు. సంతానం పేరు ప్రతిష్టలు తెస్తారు....మీ... *చింతా గోపి శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి