"కాశ్యాంతు మరణాన్ముక్తిః"
శ్రీ రామకృష్ణ పరమహంస గారి అద్భుత దివ్య దర్శనాలలో ఇది ఓకటి....
కాశీ క్షేత్రములో మరణము, ముక్తి అనే నానుడికి బలము చేకూర్చే సంఘటన ఇది.
ఒక సమయములో రాణిరాసమణి తన పరివారము, అల్లుడు మథుర్, కొంతమంది పండితులు, రామకృష్ణుల వారితో కలసి కాశీ నగర సందర్శనకు నౌకల్లొ బయలుదేరారు.అలా కాశీలో వున్న రోజులలొ ఓకనాడు మధుర్,ఇంకొంతమంది పండాలతో కలసి గంగానదిపై విహారము చేస్తున్నారు.ఆ పడవ మణికర్ణికా ఘాట్ సమిపించగా,అక్కడి స్మశానములో జరుగుచున్న శవదహనాన్ని చూసి,అకస్మాత్తుగా ఆనందపరవశులై వడిగా పడవ అంచుకు వెళ్ళి సమాధిమగ్నులై నిలబడిపొయారు. (ఆ పరిస్థితులలొ సాధారణముగా దేహస్మృతి వుండదు అందువలన ఆయిన ఎక్కడ నదిలో పడిపొతారోఅని కొందరు రివ్వున ముందుకు వెళ్ళారు. కాని ఆయిన దివ్యదరహాసాలతో నిశ్చలముగా అక్కడ నిలబడి ఉండగా ఎవ్వరు కాపాడవలసిన అవసరము లేకుండా పొయింది). కొంత సేపటికి వారే ఈ అనుభూతిగూర్చి వివరించారు."పొడవరి పింగళవర్ణ జటాధారీ,శ్వేతవర్ణ పురుషుడు ఐన ఓక పురుషుడు మెల్లగా ఆడుగులు వేస్తూ ప్రతి చితి వద్దకు వెళ్ళి, నెమ్మదిగా అందలి జీవుని పైకెత్తి,చెవిలో తారకబ్రహ్మమంత్రము ఉపదేశించడము చూశాను! సర్వశక్తిమయి అయిన జగదాంబ - కాష్ఠానికి ఆవలి వైపు కూర్చుని,ఆ జీవుడి స్థూలసూక్ష్మ కారాణాది బంధాల నన్నిటిని విడదిసి,స్వయముగా మోక్ష ద్వారము తెరచి,కైవల్య ధామానికి పంపుతున్నది. ఎన్నో యుగాల తపొనిష్ఠలచే మాత్రమే పొందగ్గ అద్వైతానుభవాన్ని భూమానందాని శ్రీ విశ్వనాధుడు క్షణములో ఆ జీవులకు యీ రీతిన ప్రపాదించి వారిని కృతార్థులను చేస్తున్నాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి