💥చెప్పండి ప్లీస్💥
❤️మనకు ఒక శరీరం ఉంది,
అంతరంగం ఉంది,
సరే మనమేటు ఆత్మ స్వరూపులం.
మరి
మనతో కర్మ చేయించేది,
శరీరమా,
అంతరంగమా
ఆత్మా
ఏది.
శరీరం ఏమో సప్తదాతువులతో,
తల్లిదండ్రులు వలన,
వారు తిన్న అన్న రసం వల్ల ఏర్పడింది.
ఇది పంచ కర్మెన్ద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు తో ఏర్పడింది.
ఈ ఇంద్రియాలు స్వయంగా జడము.
(ఏవరైనా వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి శవం చూస్తే అర్థం అవుతుంది మనకి ఈ విషయము).
ఆత్మ ఏమో శక్తి స్వరూపం,
ఎదో ఒక దానితో అది ప్రకటితం అవుతుంది.
దాన్నే ఉపాది అంటారు.
ఉదాహరణకి విద్యుత్చ్ఛక్తి (electricity) ఉంది కదా, అది మన ఇంట్లో వైర్లలలో,
బయట transformerలో,
కరెంట్ తీగలతో,
ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ లలో ఉంటుంది.
కానీ అది వ్యక్తం కావాలి అంటే,
మన ఇంట్లో ఒక బుల్బ్ లేక,
ఒక ఫ్యాన్ అన్నా ఉండాలి.
వాటి ద్వారా మాత్రమే విద్యుత్చ్ఛక్తి వ్యక్తము అవుతుంది.
అలానే ఆత్మ విద్యుత్చ్ఛక్తి లాంటిది,
అది వ్యక్తము కావాలంటే,
దేహేంద్రియా మనో బుద్ధులు కావాలి.
ఇక అంతరంగం అన్నది మనో బుద్ది, చిత్త అహంకారములతో ఉంటుంది.
ఇప్పుడు చెప్పండి.
మనతో కర్మలు చేయించేది ఏది శరీరమా, అంతరంగమా, లేక ఆత్మనా
మనని ఉద్ధరించేది ఏది శరీరమా, అంతరంగమా, లేక ఆత్మనా
మనకి నిజమైన మిత్రుడు కానీ శత్రువుకాని ఎవ్వరు?
ఈ ప్రపంచంలోని ప్రాణి కొటినా లేక,
మన శరీరమా లేక,
అంతరంగమా లేక
ఆత్మనా,
లేదు వేరెవరు కారు
పరమాత్మ అంటారా?
చెప్పండి
ఈ ప్రశ్నలకి సమాధానము చెప్పండి
ఒక వేళ మీ సమాధానము శరీరము అయితే, ఎందుకు ఎలా చెప్పండి
కాదు ఆత్మ అయితే అయితే ఎందుకు ఎలా చెప్పేండి,
కాదు అంతరంగం అంటారా అప్పుడు కూడా అయితే ఎందుకు ఎలా చెప్పేండి,
ఇవేవీ కావు, నాకేమి తెలియదు అంటారా, కనీసం ఆదైనా చెప్పండి.
💥❤️💥❤️💥❤️💥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి