24, జులై 2023, సోమవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 124*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 124*


🔴 *రాజనీతి సూత్రాణి - రెండవ అధ్యాయం* : 


📕 *సామాన్య నీతులు* : 📕


1. కేవలం ధనాని నిక్షేప్తుః న స్వార్థం, న దానం, న ధర్మః (కేవలం ధనాన్ని కూడబెట్టేవానికి దానివల్ల అతనికేమి ప్రయోజనం లేదు. దానమూ లేదు, ధర్మమూ లేదు. శ్రమ మాత్రం మిగులుతుంది.) 


2. నార్యా ఆగతో ర్థ తద్విపరీత మనర్ధభావం భజతే (స్త్రీ ద్వారా వచ్చిన అర్థం (ధనం) విపరీతంగా 'అనర్థం' (అపకారహేతువు) అవుతుంది.) 


3. యో ధర్మార్ధౌ న వ్యర్థయతి స కామః తద్విపరీతో నర్ధసేవీ (ధర్మార్థాలకి లోపం కలిగించనిదే కామం. వాటికి లోపం కలిగించే విధంగా కామాన్ని సేవించేవాడు అనర్ధాన్నే సేవిస్తున్నట్లు.) 


4. ఋజుస్వభావపరో జనో దుర్లభ 

(కపటం లేని స్వభావం గల మనిషి దొరకడం కష్టం.) 


5. అవమానేనాగతమైశ్వర్యమవమన్యత ఏవ సాధుః (సత్పురుషుడు అవమానపూర్వకంగా వచ్చిన ఐశ్వర్యాన్ని అవమానిస్తాడు.) 


6. బహునపి గుణాన్ ఏకదోషో గ్రసతి 

(ఒక్క దోషం గుణాల నన్నంటినీ మింగేస్తుంది.) 


7. మహాత్మానా పరేణ సాహసం న కర్తవ్యమ్ (మహాత్ముడైన శత్రువు విషయంలో సాహసకృత్యానికి దిగకూడదు.)


8. కదాచిదపి చారిత్రం న లజ్ఞయేత్ 

(మంచి నడవడికను ఏనాడూ విడువకూడదు.) 


9. క్షుధార్తో న తృణం చరతి సింహః 

(ఆకలితో బాధపడుతున్నా సింహం గడ్డి మేయదు.) 


10. ప్రాణాదపి ప్రత్యయో రక్షితవ్య 

(ప్రాణాల కంటే ఎక్కువగా జనవిశ్వాసాన్ని రక్షించుకోవాలి.) 


11. పిశునో నేతా పుత్ర దారైరపి త్యజ్యతే 

(చాడీలు చెప్పే నాయకుడ్ని భార్యాపుత్రాదులు కూడా విడిచివేస్తారు.) 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: