కాంచిపురం మూడు " డై" లు
ఎంతో కాలం గా కంచిలో నివసించే వారికి సైతం తెలియని మూడు డై లను గురించి పరమాచార్య వారు ఒకసారి వివరించారు.
మొదటి డై.. వడై. కంచి లో మిరియాల వడలు చాలా ప్రసిద్ధి. ఇవి చాలా రుచిగా ఉండి చాలా రోజులు నిలవ ఉంటాయి.
రెండవ డై.. కుడై
కుడై అంటే గొడుగు. దేవాలయాలలో స్వామి వార్లకు ఉపయోగించే గొడుగు రకరకాల డిజైన్ లలో ఆకర్షనీయంగా ఇక్కడ తయారు చేస్తారు.వాటిని దేశంలోని అనేక దేవాలయాలలోనే కాక విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.
మూడవ డై.. నడై
నడై అంటే నడక. వరదరాజస్వామి వారి పల్లకి లేదా వాహనోత్సవం కనుల విందుగా ఉంటుంది. వాహనాన్ని మోసేవారు కదనానికి వెళ్లే సైనికుల లాగా ఎంతో ఉత్సాహం తో మోస్తారు.వారి నడక ను సూచిస్తూ నడై అనే పదం వచ్చింది.
*** మూడు డై లతో పాటు మూడు కోటి లు కూడా ఉన్నాయి.1. కామకోటి.శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థాన గర్భాలయ విమానం.
2.రుద్రకోటి. ఏకాంబరేశ్వర దేవస్థాన గర్భాలయ విమానం.
3. పుణ్యకోటి. వరదరాజస్వామి దేవస్థాన గర్భాలయ విమానం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి