24, జులై 2023, సోమవారం

స్కంద పురాణం

:


సమాధానం ఇచ్చిన ప్రశ్న: స్కంద పురాణం అంటే ఏమిటి? నైమిశారణ్యంలో అంటారు అదిఎక్కడవుంది? సూత మహర్షి ఎవరు.?


నారాయణాంశ సంభూతుడు వేదవ్యాస మహర్షి 85000 శ్లోకములతో రాసిన పురాణం స్కాంద పురాణం. ఇది మొదట శివమూర్తి దండపానికి ఆ దండపాణి అగస్త్య మహర్షికి ఆ అగస్త్య మహర్షి నుంచి గురుపరంపరగా వచ్చిందీ పురాణం. 6 సంహితలతో ఉంటుంది పురాణం సనత్కుమార సంహిత, విష్ణు సంహిత, బ్రహ్మ సంహిత,సూర్య సంహిత, శివ సంహిత,సుతాది సంహితలతో ప్రదేశాలు గాధలు ఆ స్థలమునందలి తపః ప్రదేశాలు శక్తీ క్షేత్రాలు.ఇత్యాది కథలతో వివరణలతో ఉంటుంది పురాణం.

నైమిశారణ్యం అంటే ఇతః పూర్వం జైమిని, మైత్రేయుడు,వైశంపాయనుడు ఇత్యాది ఋషులు ఒక మహాయజ్ఞం తలపెట్టారు వారు బ్రహ్మను ప్రార్థించి కాళీ ప్రభావం లేని చోట యజ్ఞం చేయ సంకల్పించాము దయుంచి స్థలమును సూచించమని ప్రార్థన చేశారు ఆయన ఒక చక్రం నియోగించి అది పడిన ప్రదేశమే మీరు యాగం చేయవలసిన స్థలం అని చెప్పాడు ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి భూలోకంలో ఒకచోట భూమిని చీల్చి నేమి సృష్టించి

ఆగిపోయింది నేమి అంటే అంచు ఆ ప్రదేశం దండకారణ్యం అది నేమి సృష్టించి పడిపోయిన ప్రదేశం కాబట్టి అది నైమిశారణ్యం అయింది. లక్నో కి 100 కిలోమీటర్ల దూరంలో సీతాపూర్ జిల్లాలో ఉందీ ధామం.

సూతమహర్షి వృత్తాన్తమేమంటే

పృధు చక్రవర్తి పితామహ సంబంధమైన యజ్ఞాలు చేస్తుండగా శ్రీమహా విష్ణువు వచ్చి పౌరాణికుడై సూతుడు అనే పేరుతొ పిలువబడ్డాడు .ఆతర్వాత అతని సంతతి వారందరికీ ఈపేరేవచ్చింది అని బ్రహ్మాండ పురాణాంతర్గతమైనది .

పృధు చక్రవర్తి నూరు అశ్వమేధ యాగాలను చేద్దామనుకొని బ్రహ్మావర్త దేశం లో సరస్వతీ నదీ తీరాన 99పూర్తి చేసి ,నూరవది మొదలు పెట్టగా, ఈర్షతో ఇంద్రుడు యాగాశ్వం అపహిరించి తీసుకు వెళ్ళగా ,అతడి కొడుకు ఇంద్రుని జయించి గుర్రాన్ని తెచ్చాడు .ఇంద్రుడు మళ్ళీ ఎత్తుకు పోయాడు పృధువుకు కోపం వచ్చి విల్లు బాణాలతో యుద్ధానికి బయల్దేరాడు .యాగం మధ్యలో వెళ్లరాదని మునులు చెప్పగా విరమించాడు .బ్రహ్మ వచ్చి ‘’మీరు ఏ దేవుని కోసం యాగం చేస్తున్నారో ఆయన అంశ ఉన్నవాడు ఇంద్రుడు కనుక వధార్హుడు కాడు.పృధువుకు 101యాగాల ఫలితం నేను అందిస్తున్నాను .ఇతడు నారాయణ అంశ సంభూతుడు .ధర్మాన్ని కాపాడటానికి పుట్టాడు ‘’అని చెప్పగా సంతృప్తి చెంది ,ఇంద్రునితో స్నేహం పాటించాడు .పరమేశ్వరుడు ఇంద్రునితో ప్రత్యక్షమై ‘’సత్పురుషులు దేహాభిమానంతో ఉండకూడదు .మత్సరవికారం పొందరాదు ‘’అని ధర్మం బోధించి ఆశీర్వదించారు .అలాగే పృధు చక్రవర్తి ధర్మ బద్ధంగా పాలించి రాజ్యం కొడుకులకు అప్పగించి తపస్సుకు వెళ్ళాడు

భాగవతం లో రోమహర్షుడి కుమారుడు ఉగ్రశ్రవసుడు అనే ఈయనే శౌనకాదులకు పురాణాలు చెప్పాడనీ ఉన్నది .బలరాముడు సందర్శనకు వచ్చినప్పుడు ఆయనను చూచి గౌరవించలేదని కోపగించి సంహరించాడు.ప్రవచకుడు ప్రవచనం చేస్తుండగా ఎవరొచ్చినా లేవకూడదు అది ఈశ్వరుడైనా అని మహర్షులు చెప్పగా తప్పు తెలుసుకుని బలరాముడు ఉగ్రశ్రవసుని బతికించి పురాణ ప్రవచనం సాగేలా చేసాడు.ఈయనే సూత మహర్షి అని నామంతో అష్టాదశ పురాణాల సారాన్ని మహర్షుల ద్వారా లోకానికి పంచాడు

కామెంట్‌లు లేవు: