*దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి/చంద్రఘంట*
అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు.
అన్నపూర్ణ అంటే ఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు. సర్వమంగళకారిణి, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ విషయానే్న, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందచేస్తున్నాయి.
శరన్నవరాత్రుల్లో అమ్మవారు.. ఈరోజు.. అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చింది.. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటిచెప్పే అవతారం.. అన్నపూర్ణ.. ఆకలితో ఉన్న వారెవరికైనా అన్నం పెట్టి ఆదరించమనే సందేశము…అమ్మవారు మనకు ఇస్తుంది. కుటుంబంలో తల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతారము మనకు బోదపడేలా చేస్తుంది.అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.
సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి.
అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. భూమియే- అన్నము. ఆకాశము అన్నాదము, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపైగల జలమును సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై, అన్నము, పుత్రపౌత్రాభివృద్ధి పశు సంపద బ్రహ్మవర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు.
అన్నం ఎలా పుడుతుందనే విషయాన్నికూడా వేదం వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది.
ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి. అన్నపూర్ణాదేవి.
దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము.
ప్రకృతి స్వరూపం- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులగా నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.
‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.
‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.
దీపావళిరోజున కూడా కాశీక్షేత్రంలో అన్నపూరాణ దేవిని, స్వర్ణ ఆభరణాలతో అలంకరించి దేవాలయాన్ని దివ్యకాంతులీనే దీపాలతో అలంకరిస్తారు. ‘కాశీ’ అంటే వెలుగు. అందుకే వారణాసికి కాశీ అని పేరు వచ్చింది.అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసుకొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది, అఖిల భువనసాక్షి- అన్నపూర్ణాదేవి.
శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళిః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం శివాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం భీమాయై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం శర్వాణ్యై నమః ||
ఓం శివవల్లభాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం విద్యాదాత్రై నమః
ఓం విశారదాయై నమః
ఓం కుమార్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం బాలాయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం శ్రియై నమః ||
ఓం భయహారిణ్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం విష్ణుజనన్యై నమః
ఓం బ్రహ్మాదిజనన్యై నమః
ఓం గణేశజనన్యై నమః
ఓం శక్త్యై నమః
ఓం కుమారజనన్యై నమః
ఓం శుభాయై నమః
ఓం భోగప్రదాయై నమః
ఓం భగవత్యై నమః ||
ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః
ఓం భవరోగహరాయై నమః
ఓం భవ్యాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం పరమమంగళాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం చంచలాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం చారుచంద్రకళాధరాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః ||
ఓం విశ్వమాత్రే నమః
ఓం విశ్వవంద్యాయై నమః
ఓం విలాసిన్యై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం కళ్యాణనిలాయాయై నమః
ఓం రుద్రాణ్యై నమః
ఓం కమలాసనాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం శుభయై నమః
ఓం అనంతాయై నమః ||
ఓం వృత్తపీనపయోధరాయై నమః
ఓం అంబాయై నమః
ఓం సంహారమథన్యై నమః
ఓం మృడాన్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం విష్ణుసంసేవితాయై నమః
ఓం సిద్ధాయై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం సురసేవితాయై నమః
ఓం పరమానందదాయై నమః ||
ఓం శాంత్యై నమః
ఓం పరమానందరూపిణ్యై నమః
ఓం పరమానందజనన్యై నమః
ఓం పరాయై నమః
ఓం ఆనందప్రదాయిన్యై నమః
ఓం పరోపకారనిరతాయై నమః
ఓం పరమాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పూర్ణచంద్రాభవదనాయై నమః
ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః ||
ఓం శుభలక్షణసంపన్నాయై నమః
ఓం శుభానందగుణార్ణవాయై నమః
ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం రతిప్రియాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చండమథన్యై నమః
ఓం చండదర్పనివారిణ్యై నమః
ఓం మార్తాండనయనాయై నమః
ఓం సాధ్వ్యై నమః ||
ఓం చంద్రాగ్నినయనాయై నమః
ఓం సత్యై నమః
ఓం పుండరీకహరాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం పుణ్యరూపిణ్యై నమః
ఓం మాయాతీతాయై నమః
ఓం శ్రేష్ఠమాయాయై నమః
ఓం శ్రేష్ఠధర్మాత్మవన్దితాయై నమః
ఓం అసృష్ట్యై నమః ||
ఓం సంగరహితాయై నమః
ఓం సృష్టిహేతవే నమః
ఓం కపర్దిన్యై నమః
ఓం వృషారూఢాయై నమః
ఓం శూలహస్తాయై నమః
ఓం స్థితిసంహారకారిణ్యై నమః
ఓం మందస్మితాయై నమః
ఓం స్కందమాత్రే నమః
ఓం శుద్ధచిత్తాయై నమః
ఓం మునిస్తుతాయై నమః ||
ఓం మహాభగవత్యై నమః
ఓం దక్షాయై నమః
ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః
ఓం సర్వార్థదాత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సదాశివకుటుంబిన్యై నమః
ఓం నిత్యసుందరసర్వాంగ్యై నమః
ఓం సచ్చిదానందలక్షణాయై నమః ||
దుర్గామాత యొక్క మూడవ శక్తి 'చంద్రఘంట’/అన్నపూర్ణాదేవి అలంకారం
దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి.
ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము.
ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది.
ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిల లాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది.
సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం.
ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.
శ్రీఅన్నపూర్ణదేవి విశిష్ఠత
అన్నం పరబ్రహ్మ స్వరూపం.
సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం.
అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది.
ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది.
అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది.
అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం,
సమయస్పూర్తి,
వాక్శుద్ది,
వాక్సిద్ధి,
భక్తిశ్రద్ధలు,
ఐశ్వర్యం కలుగుతాయి.
భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి.
బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచిన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని ఆర్షవాక్యం.
ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి
తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి.
” హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి.
అమ్మవారికి దధ్యోదనము, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి.
అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది.
ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది.
చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు.
దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది.
అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి.
ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.
ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి.
ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము.
ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది.
ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు.
ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.
ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది.
ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి.
వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి.
వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది.
చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు.
ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది.
ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు.
కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.
మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి.
అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై,
సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.
మంత్రము: హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా
అనే మంత్రం జపించాలి.
అన్నపూర్ణ అష్టోత్తర శత నామావళి
శ్రీ అన్నపూర్ణాష్టకమ్ పారాయణం చేయవలెను.
శ్రీఅన్నపూర్ణాష్టకం
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోర పావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 1 ||
నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 2 ||
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౩ ||
కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 4 ||
దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 5 ||
ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 6 ||
ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 7 ||
దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 8 ||
చంద్రార్కానలకోటి
కోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 9 ||
క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || 10
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || 11 ||
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ !12 ||
చంద్రఘంటా దుర్గా, దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రాకారంతో, గంట కలగి ఉన్నది అని అర్ధం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా దేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించినవారి పాపాలు, ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది.
శివుడు, పార్వతి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకా దేవి, హిమవంతులు కూడా పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత, ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది.
అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి, తమ కుటుంబం భయపడకుండా ఉండేలా
తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని వేషంలో, లెక్కలేనన్ని నగలతో తయారవుతాడు. అప్పుడు ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు,
బంధువులూ భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు. ఆ తరువాత శివ,పార్వతులు వివాహం చేసుకుంటారు. అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటా అవతారం ఎత్తింది.
శివ, పార్వతుల కుమార్తె కౌషికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ, నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా, ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు.
ఆమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కౌషికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి, అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ, నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు.
చంద్రఘంటా దుర్గా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్భాణాలు, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటా దుర్గాదేవి పులి మీదగానీ, సింహం మీదగానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికీ ప్రతీకలు. అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా, ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి.
పులి లేదా సంహవాహిని అయిన అమ్మవారు ధైర్య ప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమయినా, ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఉగ్రరూపంలో ఉండే ఈ అమ్మవారిని చండి, చాముండాదేవి అని పిలుస్తారు.
ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మిక. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాశం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుందిట ఈ అమ్మవారు.
రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంటానినాదానికే గుండెలవిసాయని దేవి పురాణం చెబుతోంది. అయితే ఈ ఘంటానినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమనీ, ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో, ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది.
ధ్యాన శ్లోకం:-
పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా!!
*శ్రీ మాత్రే నమః*
*ఓం శ్రీ అన్నపూర్ణేశ్వరీ దేవ్యై నమః*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి