20, అక్టోబర్ 2020, మంగళవారం

ఆణిముత్యం

 *💎 ఆణిముత్యం💎*



దంతములకు మధ్య ఎంతో నేర్పును కల్గి

నాల్క సంచరించు నలగకుండ

నరుడు కూడ అటులె నడవంగ వలెనయా

సత్యమైన బాట సాయి మాట !

*భావం:*


కత్తుల బోనువంటి పలువరసలు మధ్యలో నాలుక ఏమాత్రమూ దెబ్బ తినకుండా ఎంతో మెలకువగా సంచరిస్తూ ఉంటుంది. మనిషి కూడా తోటి మానవుల మధ్య ఈ విధంగానే చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. సాయి చెప్పినట్లుగా నడుచుకోవడమే "సత్ప్రవర్తన" అనిపించుకుంటుంది.    

                        

*వివరణ:*


మన ఇంద్రియములు అన్ని ఒకే పనిని చేస్తాయి. కాని నోరు రెండు పనులు చేస్తుంది. దీని విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. ఒకటి తినడం, రెండు మాట్లాడం. మనము తినే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇక నోరు మాట్లాడే దానిలో 4 తప్పులు చేస్తుంది. అబద్దాలు చెప్పడం, చాడీలు చెప్పడం, దూషించడం, అతిగా మాట్లాడం. స్వామి ఎపుడూ చెపుతుంటారు "అతి బాష మతి హాని, మిత బాష అతి హాయి". ఎక్కువ మాట్లాడడం వల్ల మనలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అయినా నోరు మనకు చక్కని ఆదర్శన్ని చూపిస్తుంది.

1. చెడు పదార్దాన్ని నాలుక స్వీకరించదు, వెంటనే వుమ్మి వేస్తుంది. అలాగే మనం చెడు విషయాలను వెంటనే విసర్జించాలి.

2. నాలుక నీవు ఏ రకం తిన్నా అనగా తీపి,కారం,పులుపు,తన మీద వుంచుకోదు వెంటనే లోపలకి పంపుతుంది. అలాగే నీవు ప్రపంచములోని విషయములు నీలో వుంచకుండా జీవించాలి.

3. నీవు మాట్లాడే మాటల వల్ల నీ వ్యక్తిత్వం అందరికీ తెలుస్తుంది. మంచి మాట్లాడితే మంచివాడని, చెడు మాట్లాడితే చెడ్డవాడని.

4. నాలుక ఎంతో సున్నితంగా వుండి 32 పళ్ళ మధ్య పడకుండా అణిగి వుంటుంది. అలాగే ప్రపంచములోని వివిధ మానవత్వం కలవారి మధ్య మనము మంచిగా జీవించాలి అని బోధిస్తుంది.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

కామెంట్‌లు లేవు: