*శ్రీ కుబేర వీరాంజనేయుడు:*
శ్రీ రామునికి పరమదాస భక్తుడైన వీరాంజనేయుని లీలా అద్భుతాలు
అనేకం. మాటలతో వర్ణించలేము.
శ్రీ రామనామం జపించే భక్తులకు సదా సర్వకాలం తోడుగా వుంటూ వారి కష్టాలు తీర్చడం లో హనుమంతుని మించి వేరు దైవం లేదు.
అంజనాదేవి పుత్రుడైన
ఆంజనేయస్వామి , యీ భూలోకంలో అనేక
భంగిమల్లో అనేక ప్రదేశాల్లో అవతరించి రామ భక్తుల హృదయాల్లో కొలువై వున్నాడు. అలా అవతరించిన స్ధలాలలో
రాణీపేట జిల్లాలో వాలాజీ పేటకు నాలుగు దిశలలోను కొలువై కటాక్షిస్తున్నాడు.
ఇందులో నగరానికి ఉత్తర దిక్కున శ్రీ కామాక్షి పురంలో దర్శనం అనుగ్రహిస్తున్న హనుమంతుని ఆలయం
ప్రసిద్ధి చెందినది.
ఆలయంలో కుబేర దిశలో కొలువై వున్నందున శ్రీ కుబేర
వీరాంజనేయునిగా పిలువబడుతున్నాడు.
ప్రాచీనకాలంలో అగస్త్య మహర్షి స్ధాపించిన శివాలయం కూడా ఇక్కడ వుండడం ఒక విశేషం.
చాలా కాలం క్రితం ఈ ప్రాంత ప్రజలు పేరు తెలియని వ్యాధితో తీవ్రంగా బాధింపబడినారు.
ఆ సమయంలో ఆర్కాడు ప్రాంత ప్రముఖులకు
ఒక విషయం తట్టినది.
వారి ఆలోచనల ప్రకారం ,
వాలాజాపేటకి నాలుగు దిక్కులలోను నాలుగు
ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్టించి
పూజలు ప్రారంభించారు.
ఆ తరువాత ఆ వ్యాధి పూర్తిగా నిర్మూలమైనది. ఈనాటికీ
గ్రామస్థులు యీ విషయం
తలుచుకుంటూ వుంటారు.
సుమారు వేయి సంవత్సరాల ప్రాచీనమైన
యీ ఆంజనేయుని విగ్రహం భూమిలో నుండి లభించినది. ఎడమచేయి నడుమున,
గదాయుధం పట్టు కొన్న
కుడిచేయి పైకెత్తి ఆకాశం వైపు చూస్తున్న
భంగిమలో దర్శనం ప్రసాదిస్తున్నాడు.
విగ్రహం క్రిందవైపు శ్రీ రాముని పాదాలు కనిపిస్తాయి. ఆంజనేయుని
వాలం శిరస్సు పైకి చుట్టుకుని వుండగా, వాలమునకు ఒక గంట వుంటుంది. ఇటువంటి
విగ్రహాలను మధ్వాచార్యుల వారు
స్ధాపించినట్లు చెప్తారు.
ఇది ఉత్తరముఖ ఆలయం.
ఎదురుగుండా విజయనగర రాజులు తవ్వించిన పుష్కరిణి వున్నది. రాహు ,కేతువు,
కాళింగ నర్తన కృష్ణుని
విగ్రహాలు ప్రతిష్టించబడి వున్నవి. ఈ విగ్రహాలను
పూజించిన రాహు కేతు
సర్పదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
కంచి మహా పెరియవరు తనను దర్శింపవచ్చిన వారికి హనుమంతుని
పూజించమని ,
శ్రీరామ జయం లిఖించి జపించమని బోధించేవారు.
ఆయన బోధనలతో భక్తులు 1008 సార్లు వారి వారి
భాషలలో శ్రీ రామజయం వ్రాసి ఈ ఆలయానికి పంపిస్తున్నారు. వాటిని స్వామి పాదాలపై వుంచుతారు.
ఈ ఆలయం
పునరుద్ధరణకి శ్రీరామ నామం ముద్రించిన ఒక లక్షా
పదివేల ఇటుకలు ఉపయెగించడం విశిష్టమైనది.
ఆంజనేయుని దర్శించిన
భక్తులకు సర్వ శుభాలు లభిస్తాయి.
తమిళనాడు రాణీపేట జిల్లా ,వాలాజీ పేటలో
బి.డి.ఓ ఆఫీస్ వెనుక వున్న కామాక్షి పురంలో
శ్రీ కుబేర వీరాంజనేయ స్వామి ఆలయం వున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి