20, అక్టోబర్ 2020, మంగళవారం

యమధర్మరాజు

 యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపుతాడు

భూలోకానికి వచ్చాడు ఆ దూత 

ఒక ఆవిడ అప్పుడే బిడ్డను ప్రసవించింది 

అంతకు ముందు వారం ఆమె భర్త చనిపోయాడు 

ఆ తల్లిని కూడా చంపేస్తే ఆ బిడ్డ ఆలనా పాలన ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండానే వెళ్ళిపోయాడు 


అదే విషయాన్నీ యమధర్మరాజుకు చెప్పగా 

దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించినందుకు నువ్వు నీ రూపు మారి భూలోకంలోకి వెళ్ళి దేవరహస్యం అర్థం అయ్యాకే ఇక్కడకు చేరుకుంటావని శాపం ఇచ్చాడు 


యమదూత పూర్తి నల్లని రూపంతో ఒక చోట మూలుగుతుండగా అక్కడకు ఓ దర్జీ వచ్చి చూసి జాలిపడి అతడిని ఇంటికి తీసుకు వెళ్తాడు 

తన ఇంటి ముందు ఆవరణలో అతను కుట్టుమిషన్ పెట్టుకుని బట్టలు కుడుతూ జీవనం సాగిస్తాడు 


యమదూతను తీసుకెళ్లి కూర్చోబెట్టి భార్యను పిలిచి భోజనం వడ్డించమంటాడు 

తాను తాగేందుకే గంజి లేదు అతిథికి విందుభోజనమా 

అన్నం లేదు ఏమీ లేదు వేళ్ళు అంటుంది 

యమదూత అక్కడనుండి వెళ్లిపోతుండగా మళ్ళీ ఆమె పిలిచి సరే లోపలి రా వచ్చి బోంచేయి అంటది 

అప్పుడు యమదూత ఒక నవ్వు నవ్వుతాడు 

అతడి శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది 


ఆ దర్జీ నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పని చేస్తూ ఇక్కడే ఉండొచ్చు అంటాడు అలా ఐదేళ్లు గడిచాక ఆ ఇంటిముందు ఓ స్థితిమంతురాలైన ఒక స్త్రీ ఇద్దరి పిల్లలతో దర్జీ దగ్గరకు వచ్చింది 

ఆ ఇద్దరి పిల్లలలో ఒకడు అవిటివాడు 

కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా 

 చాలా ఖరీధైన దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది 

అప్పుడు నవ్వాడు మరోసారి యమదూత 

మళ్ళీ శరీరం బంగారు వర్ణంలోకి రంగు మారింది 


మరొక పదేళ్లు గడిచింది ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు అప్పుడు ఓ ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో వచ్చి చాలా విలువచేసే గుడ్డను ఇచ్చి తనకు ఇరవై ఏళ్లకు చినిగిపోని సూట్ ఒకటి కుట్టమని మూడురోజుల్లో వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్తాడు 


యమదూత రెండు రోజులు కుట్టకుండానే జాప్యం చేసి మూడో రోజు ఒక దిండు కవర్ మరియు ఒక దుప్పటిలా కుట్టేస్తాడు అది చూసిన ఆ దర్జీ అయ్యో ఎంత పని చేసావు ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేను ఏమీ చెప్పాలి అని అంటుండగానే కారు డ్రైవర్ వచ్చి అయ్యా మా యజమాని చనిపోయారు ఆయనకు దిండు కవర్ దుప్పటి కుట్టివమని చెప్పి కుట్టినవి తీసుకుని వెళ్ళిపోతాడు 


అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత పూర్తిగా బంగారు వర్ణంలోకి మారి పైకి వెళ్లిపోతుండగా అప్పుడు దర్జీ అయ్యా మీరెవరు 

మీరు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి మూడు సార్లు మాత్రమే నవ్వారు మీరు నవ్వినప్రతిసారి మీ రంగు మారేది కారణం చెప్పండి అన్నాడు 


జరిగిన విషయం చెప్పి 

మొదటి సారి 

మీ భార్య అన్నం లేదు అని చెప్పింది 

అప్పుడు ఆమె దరిద్రదేవతలాగా కనిపించింది 

మళ్ళీ బోంచేయి అని పిలిచినప్పుడు 

నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది 

అప్పుడు తెలిసింది అభిప్రాయాలు మారుతాయి అని 


రెండవ సారి 

ఆ పిల్లాడు తల్లి ప్రాణాలను తీయమన్నపుడు అలోచించి వదిలేసాను కానీ అతనికి ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్కచేయకుండా తన బిడ్డకు సమానంగా చూసే వ్యక్తి దగ్గర చేసాడు 

అప్పుడు అర్థం అయింది దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఆ చోటును తప్పకుండ భర్తీ చేస్తాడు అని 


ఇక మూడోసారి 

అతడు మూడు రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు అందుకే అలా కుట్టాను కానీ అతను ఇరవై ఏళ్లకు చినిగిపోనంతగా ఒక సూట్ కుట్టమని ఇచ్చాడు 

మనం శాశ్వతం కాదు 

ఏ క్షణాన ఎవరూ పోతామో తెలియదు ఎంత కాలం ఉంటామో తెలియదు కానీ నమ్మకం 

ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగుచేసేస్తుంటారు 

అక్రమంగా సంపాదించి చెర్చేస్తుంటారు 

ఆశతో బతికేస్తుంటారు అని చెప్పి దేవరహస్యాలను తెలుసుకున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు.

కామెంట్‌లు లేవు: