శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
శా||
చైత్రంబందున పల్లవించు తరులన్, జానైన పూఁదీవలన్
గోత్రాంకంబున నుండి జారు నదులన్; క్రొమ్మావి లేఁగొమ్మలన్
గాత్రంబుల్ సవరించు కోయిలల రాగాలాప సంశోభలన్
చిత్రం బుల్లము దోతువే ప్రకృతివై శ్రీ సిద్ధలింగేశ్వరా!
భావం;
చైత్రమాసంలో చిగురిస్తున్నటువంటి చెట్లు,అందంగా ప్రాకుతున్న పూల తీగెలు,కొండలమీద నుండి పారే సెలయేర్లు,క్రొత్తగా చిగురించిన లేత మామిడి కొమ్మలు,రాగాలు తీయటానికి గొంతు సవరించు కుంటున్న కోకిలలు,ఇంతటి అందమైన ప్రకృతి రూపంలో మనస్సు దోచుకుంటూ శోభిల్లుతున్నావు కదయ్యా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
..సుబ్బు శివకుమార్ చిల్లర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి