🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 55*
*****
*శ్లో:- ఉత్సాహస్సాహసం ధైర్యం ౹*
*బుద్ధి శ్శక్తి: పరాక్రమః ౹*
*షడేతే యత్ర వర్తంతే ౹*
*తత్ర దేవో౽పి తిష్ఠతి ౹౹*
*****
*భా:- లోకంలో ప్రతిఒక్కరు పని చక్కబడితే తన గొప్పతనంగా భావిస్తారు. అదే పనికి అడుగడుగునా ఆటంకా లెదురౌతుంటే దేవునిదయ లేదని నిందిస్తారు.1.పనినెరవేరవేరాలంటే ఉత్సాహం, సంకల్పబలంతో కూడిన "ప్రయత్నం" కావాలి. 2. ఎన్ని అవరోధా లెదురైనా, ఎదురొడ్డి దూసుకుపోగల "తెగువ" ఉండాలి. 3. గిట్టనివారు పలికే, నిస్సత్తువ, నీరసపు మాటలను లెక్కచేయని "ధైర్యం" అలవరచుకోవాలి. 4. కార్యసాధన దిశగా నిరంతర సునిశిత పరిశీలనా నైపుణ్యం గల "బుద్ధికుశలత" కలిగిఉండాలి. 5. పని పూర్తి కావడానికి అంగ, ఆర్థిక రూపేణ "శక్తి సంపన్నత" పుష్కలంగా ఉండాలి. 6. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక "బల సమృద్ధి" కలిగి ఉండాలి. ఈ ఆరు లక్షణాలు ఎక్కడ ఉంటాయో, అక్కడ దైవబలము కూడ తోడూనీడగా ఉంటుంది. ఆ కార్యము నూటికి నూరుశాతం జయము, విజయము, దిగ్విజయముగా సాధించబడుతుంది. "శ్రమ ఏవ జయతే" అనే ఆర్యోక్తి మన మెరిగినదే. కార్యసాధనకు ముందు ఈ ఆరు వనరులు ఉన్నాయా! లేవా! పరిశీలించుకోవాలని సారాంశము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి