*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 9 / Sri Devi Mahatyam - Durga Saptasati - 9 🌹*
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
*అధ్యాయము 2*
*🌻. మహిషాసుర సైన్యవధ - 3 🌻*
దేవతలు, ఋషులు తనను కొనియాడుచుండగా, ఆయాస లక్షణాలు ఏమీ లేని ముఖంతో, ఈశ్వరి అసుర దేహాలపై తన శస్త్రాస్త్రాలను ప్రయోగించింది.
దేవి వాహనమైన సింహం కూడా కోపంతో జూలు విదుర్చుచు అరణ్యంలో కార్చిచ్చువలె అసురసైన్యంలో సంచరించింది. యుద్ధం చేస్తూ దేవి విడిచే నిట్టూర్పులు వెంటనే నూర్లకొలది, వేలకొలది ఆమె సైన్యగణంగా రూపొందుచున్నాయి.
దేవి శక్తిచే అభివృద్ధి నొందుతున్న ఉత్సాహంతో ఈ సైన్యం గండ్రగొడ్డళ్ళతో, గుదియులతో,
అడ్డకత్తులతో తాకి అసురగణాలను నాశమొనర్చెను. ఈ సైన్యంలో కొందఱు ఆ యుద్ధమహోత్సవంలో తప్పెటలు కొట్టారు; కొందరు శంఖాలు ఊదారు. (50-54)
మణికొందఱు మృదంగం వాయించారు. అంతట దేవి తన త్రిశూలంతో, గదతో, బల్లెంలు కురిపించడంతో, ఖడ్గాదులతో నలకడంచేత, నూర్లకొలది మహాసురులను వధించింది. కొందఱిని తన ఘంటానినాదంతో అవశులైన వారిని పడద్రోసింది. ఇతరులను తన పాశంతో బంధించి నేలపై ఈడ్చింది. కొందఱు తీక్ష్మమైన ఆమె ఖడ్గపు వ్రేటులచే రెండుగా నఱకబడ్డారు.
ఇతరులు తీవ్రమైన ఆమె గదదెబ్బలు తిని భూమిపై పడిపోయారు. మరికొందరు ఆమె రొకటిపోటులతో
తీవ్రంగా గాయపడి నెత్తురు కక్కుకున్నారు. కొందరి వక్షం ఆమె త్రిశూల పోటుచే భిన్నమవడంతో భూమిపై పడిపోయారు. (55-59)
కొందరు సురవైరులు ఎడతెగక గ్రుచ్చుకొంటున్న బాణసమూహంచే ముళ్ళపందులను పోలి రణాంగణంలో ప్రాణాలు వదిలారు. కొందరి బాహువులు, కొందరి కంఠాలు తెగిపోయాయి. కొందరి శిరస్సులు నేలపై దొర్లాడాయి. కొందరి నడుములు ఖండింపబడ్డాయి. కొందరు మహాసురులు పిక్కలు తెగిపోవడంతో భూమిపై కూలారు. (60-61)
ఒకే చేయి, ఒకే కన్ను, ఒకే కాలు నిలిచి ఉన్న కొందరిని దేవి మరల రెండు ముక్కలుగా ఖండించింది. మరికొందరు శిరస్సులు ఛేదింపబడి పడిపోయి మళ్ళీ లేచారు. (62)
కొన్ని మొండాలు ఉత్తమాయుధాలు తీసుకుని దేవితో పోరాడాయి. మరికొన్ని మొండాలు ఆ యుద్ధంలో వాద్యాల లయను అనుసరించి నృత్యం చేసాయి. (63)
ఇతర మహాసురుల మొండాలు ఖడ్గాలు, బల్లాలు, కుంతములు ఇంకా చేతబట్టుకుని అప్పుడే తెగిన తలలతో “ఆగు, ఆగు” అని దేవిని ఉద్దేశించి కేకలు వేసాయి.
ఆ యుద్ధం జరిగిన రంగం అసురులు, ఏనుగులు, గుఱ్ఱములు, రథములు కూలి ఉండడం చేత నడువ శక్యంకాకుండా ఉంది. అసురుల, వారి ఏనుగుల, గుజ్రాల రక్తసమూహం వెంటనే మహానదీరూపమై ఆ సైన్యం మధ్యలో ప్రవహించింది.
గడ్డి, కట్టెల పెద్దరాశిని అగ్ని ఎలా క్షయమొనరుస్తుందో అలా ఆ అసుర మహాసైన్యాన్ని అంబిక క్షణమాత్రాన నాశనం చేసింది.
(64–67)
దేవి వాహనమైన సింహం జూలు విదుర్చుచు, మహానాదం చేస్తూ, సురవైరుల దేహాలలో ప్రాణాలకై వెదకుతున్నట్లు ఆ రణరంగంలో సంచరించింది. (68)
అక్కడ దేవీగణాలు అసురులతో చేసిన యుద్ధవైఖరిని చూసి సంతుష్టులై దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. (69)
శ్రీమార్కండేయ పురాణమునందలి సావర్ణి మన్వంతరమున “దేవీ మాహాత్మ్యము” లో “మహిషాసుర సైన్యవధ” యను పేరిటి ద్వితీయాధ్యాయము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
ఓం నమః శివాయ:
*దేవీ నవరాత్రులు - నవ దుర్గలు - (4)శ్రీపార్వతిదేవి (కాత్యాయనీ)/కూష్మాండా*
*శ్రీ పార్వతిదేవి అష్టోత్తర శతనామావళిః / సహస్రనామం*
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*శ్రీపార్వతి దేవి (కాత్యాయని)*
శ్రీ పార్వతిదేవి హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పరమేశ్వరుల బిడ్డలు.
పురాణాలలో దక్షుని కుమార్తె అయిన 'సతీదేవి' (దాక్షాయణి) శివునికి ఇల్లాలు. కాని దక్షయజ్ఞంలో తనకు, శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతి అయ్యింది. తరువాత ఆమె హిమవంతుడు, మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వత రాజ తనయ గనుక 'పార్వతి' అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపసు ఆచరించి (ఉమ, అపర్ణ అనే పేర్లు ఈ తపసు కారణం వలన వచ్చాయి.) శివుని వరించింది. శివుడు ఆమెను తన శరీరంలో సగంగా స్వీకరించాడు.
హిమవంతునికి మేరువుకూఁతురైన మనోరమయందు పుట్టిన రెండవ కొమార్తె. ఈమె యొక్క అక్క గంగాదేవి. తొలిజన్మమున ఈమె దక్షుని కూఁతురు అయిన ఉమాదేవి.
అపుడు తన తండ్రి అయిన దక్షప్రజాపతి చేసిన యజ్ఞమునకు తన భర్త అగు రుద్రుని పిలువక అవమానించెను అని అలిగి మహాకాళి స్వరూపమును వహించి అత్యాగ్రహమున దేహత్యాగముచేసి ఆవల పార్వతిగ పుట్టి రుద్రునికి భార్య అయ్యెను. ఈమె ఒకకాలమున రుద్రునితో కూడి ఉండఁగా దేవతలు ఆకూటమికి విఘ్నముచేసిరి. అందువలన వారికి స్వభార్యల యందు పుత్రసంతానము లేకుండునటుల ఈమె శపియించెను.
మఱియు ఆకాలము నందు రుద్రునికి రేతస్సుజాఱి భూమియందు పడెను. భూమి దానిని ధరింపను ఓపక దేవతలసహాయమున అగ్నిని వాయువును వహించునట్లు చేయఁగా వారు ఆరేతస్సును హిమవత్పర్వత సమీపమున గంగయందు చేర్చిరి. అది కారణముగా గంగ గర్భము తాల్చి ఆగర్భమును భరింపలేక శరవణమునందు విడిచిపుచ్చెను. అందు కుమారస్వామి పుట్టెను.
అతనికి షట్కృత్తికలు పాలిచ్చిరి కనుక కార్తికేయుఁడు అను పేరును, ఆపాలు ఆఱుముఖములతో ఒక్కతేపనె అతఁడు పానముచేసెను కనుక షణ్ముఖుఁడు అను పేరును అతనికి కలిగెను. స్ఖలితము అయిన రేతస్సువలన పుట్టినందున స్కందుఁడు అనియు అంటారు. ఇది కాక పార్వతి తన దేహమున కూడవలసిన తన భర్తయొక్క రేతస్సును భూమిధరించినందున భూమికి బహు భర్తలు కలుగునట్లు శాపము ఇచ్చెను.
మఱియు గంగా నిర్గతమైన ఈసౌమ్యతేజము వలన సువర్ణము మొదలగు లోహములు కలిగినట్లును, ఆగంగానిక్షేపమువలన పొదలునట్టి సువర్ణ ప్రభల చేత తృణవృక్ష లతాగుల్మ ప్రభృతి ఉద్భిజ్జములు సువర్ణంబులు అయ్యెను అనియు పురాణములు చెప్పుచు ఉన్నాయి. వినాయకుడు, కుమారస్వామి వారి పుత్రులు.
💫💫💫💫💫💫
*శ్రీ పార్వతీ దేవి(కాత్యాయనీ) అష్టోత్తర శతనామావళి*
💫💫💫💫💫💫
ఓం పార్వత్యై నమః
ఓం మహా దేవ్యై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం సరస్వత్యై నమః
ఓం చండికాయై నమః
ఓం లోకజనన్యై నమః
ఓం సర్వదేవాదీ దేవతాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం పరమాయై నమః
ఓం ఈశాయై నమః 10
ఓం నాగేంద్రతనయాయై నమః
ఓం సత్యై నమః
ఓం బ్రహ్మచారిణ్యై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం త్రిలోచన్యై నమః
ఓం బ్రహ్మణ్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం కాళరాత్ర్యై నమః 20
ఓం తపస్విన్యై నమః
ఓం శివదూత్యై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం విష్ణుసోదరయ్యై నమః
ఓం చిత్కళాయై నమః
ఓం చిన్మయాకారాయై నమః
ఓం మహిషాసురమర్దిన్యై నమః
ఓం కాత్యాయిన్యై నమః
ఓం కాలరూపాయై నమః 30
ఓం గిరిజాయై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం మాతృకాయై నమః
ఓం శ్రీమాత్రేనమః
ఓం మహాగౌర్యై నమః
ఓం రామాయై నమః
ఓం శుచిస్మితాయై నమః
ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః
ఓం రాజ్యలక్ష్మ్యై నమః 40
ఓం శివప్రియాయై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం మాహాశక్త్యై నమః
ఓం నవోఢాయై నమః
ఓం భగ్యదాయిన్యై నమః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం సదానందాయై నమః
ఓం యౌవనాయై నమః
ఓం మోహిన్యై నమః
ఓం అజ్ఞానశుధ్యై నమః 50
ఓం జ్ఞానగమ్యాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిత్యస్వరూపిణ్యై నమః
ఓం పుష్పాకారాయై నమః
ఓం పురుషార్ధప్రదాయిన్యై నమః
ఓం మహారూపాయై నమః
ఓం మహారౌద్ర్యై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం వామదేవ్యై నమః
ఓం వరదాయై నమః 60
ఓం భయనాశిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వచన్యై నమః
ఓం వారాహ్యై నమః
ఓం విశ్వతోషిన్యై నమః
ఓం వర్ధనీయాయై నమః
ఓం విశాలాక్షాయై నమః
ఓం కులసంపత్ప్రదాయిన్యై నమః
ఓం ఆర్ధదుఃఖచ్చేద దక్షాయై నమః
ఓం అంబాయై నమః 70
ఓం నిఖిలయోగిన్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కమలాకారయై నమః
ఓం రక్తవర్ణాయై నమః
ఓం కళానిధయై నమః
ఓం మధుప్రియాయై నమః
ఓం కళ్యాణ్యై నమః
ఓం కరుణాయై నమః
ఓం జనస్ధానాయై నమః
ఓం వీరపత్న్యై నమః 80
ఓం విరూపాక్ష్యై నమః
ఓం వీరాధితాయై నమః
ఓం హేమాభాసాయై నమః
ఓం సృష్టిరూపాయై నమః
ఓం సృష్టిసంహారకారిణ్యై నమః
ఓం రంజనాయై నమః
ఓం యౌవనాకారాయై నమః
ఓం పరమేశప్రియాయై నమః
ఓం పరాయై నమః
ఓం
పుష్పిణ్యై నమః 90
ఓం సదాపురస్థాయిన్యై నమః
ఓం తరోర్మూలతలంగతాయై నమః
ఓం హరవాహసమాయుక్తయై నమః
ఓం మోక్షపరాయణాయై నమః
ఓం ధరాధరభవాయై నమః
ఓం ముక్తాయై నమః
ఓం వరమంత్రాయై నమః
ఓం కరప్రదాయై నమః
ఓం వాగ్భవ్యై నమః
ఓం దేవ్యై నమః 100
ఓం క్లీం కారిణ్యై నమః
ఓం సంవిదే నమః
ఓం ఈశ్వర్యై నమః
ఓం హ్రీంకారబీజాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం ప్రణవాత్మికాయై నమః
ఓం శ్రీ మహాగౌర్యై నమః
ఓం శుభప్రదాయై నమః 108.
🕉🌞🌎🌙🌟🚩
*కూష్మాండా*
ॐॐॐॐॐॐॐॐॐ
కూష్మాండా దుర్గా, నవదుర్గల్లో నాలుగో అవతారం. నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. "కు" అంటే చిన్న, "ఊష్మ" అంటే శక్తి, "అండా" అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది
అని అర్ధం.
ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తీ లభిస్తాయని భక్తుల విశ్వాసం.
*రూపం:-*
కుష్మాండా దుర్గా దేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం, ఖడ్గం, గద,
పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి/సింహం.
*విశ్వ ఆవిర్భావం:-*
ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి, తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగును ఇచ్చింది కుష్మాండా దుర్గా దేవి అని పురాణోక్తి. సూర్యుని మధ్యభాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవీ పురాణం.
త్రిమూర్తులు, త్రిమాతల సృష్టి.
*మహాకాళీ:-*
కుష్మాండా దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది. ఈమె చాలా ఉగ్ర స్వరూపమైనది. ఈ అమ్మవారికి పది తలలు, పది చేతులు, పది కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతి వేళ్ళు, 30 కాలి వేళ్ళు ఉన్నాయి. చిందరవందరగా ఉండే జుట్టుతో, నాలుకలు బయట పెట్టి ఉంటుంది. ఆమె తెల్లటి పళ్ళు, తన 10 నాలుకలను కొరుకుతున్నట్టుగా ఉంటాయి. మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు. ఆయుధం, త్రిశూలం, చక్రం, బాణం, డాలు, తెంచిన రాక్షసుని తల, పుర్రె, నత్త గుల్ల, ధనువు, కర్ర ధరించి ఉంటుంది కాళీ. కూష్మాండా దేవి ఈమెకు మహాకాళీ అని పేరు పెట్టింది.
*మహాలక్ష్మి:-*
కుష్మాండా దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించింది. ఆ చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుల్ల, ఘంట, ఉచ్చు, బల్లెం, కొరడా, ధనువు, డాలు, మధుకలశం, నీటిపాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి, గట్టిగా గర్జించిందిట. అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండా దేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది.
*మహాసరస్వతి:-*
కుష్మాండాదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి, తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది. తెల్లటి బట్టలు కట్టుకుని, తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న ఢమరుకం, నత్తగుల్ల, ఘంట, విల్లు, నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది. కుష్మాండాదేవి ఆమెను మహా సరస్వతి అని పిలిచింది.
*శక్తి:-*
కుష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే, ఆమె నుండి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది. అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, ఢమరుకం, జపమాల, కమండలం ఉన్నాయి. కూష్మాండా దుర్గా అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళీ శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి, నాలుగు చేతుల్లో పాశం, జపమాల పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. ఇలా కలసి పుట్టిన శివుడు, శక్తి(సరస్వతీదేవి)లు అన్నాచెల్లెళ్ళు అని అంటారు.
*బ్రహ్మ/లక్షి*
కుష్మాండా దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. నాలుగు ముఖాలతో, నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామరపువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకుని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి. అందంగా, లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామరమొగ్గలు, కింద రెండు చేతులూ అభయ ముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది అమె. కుష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది. ఇలా కలసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవిలు కూడా అన్నాచెల్లెళ్ళే.
*ధ్యానశ్లోకం:-*
"సురాసంపూర్ణ కలశం రుధిరప్లుత మేవ చ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభమస్తు మే!!"
🕉🌞🌎🌙🌟🚩
*శ్రీ ఆది శంకరాచార్య విరచితం శ్రీ పార్వతీ వల్లభ నీలకంఠాష్టకం*
💫💫💫💫💫💫
*1) నమో భూతనాధం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్య
తేజం |*
*నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||*
*2) సదా తీర్ధసిద్ధం సదా భక్తరక్షం సదా శైవపూజ్యం సదా శుద్ధభస్మం |*
*సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||*
*3) శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానం సదా చర్మవేష్టం |*
*పిశోచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం ||*
*4) ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం |*
*కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మలేపం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||*
*5) శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం బృహద్దీర్ఘకేశం సదామాం త్రినేత్రం |*
*ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||*
*6) ఉదాసం సుదాసం సుకైలాస వాసం ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవం |*
*అజా హేమకల్పదృమం కల్పసేవ్యం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||*
*7) మునీనాం వరేణ్యాం గుణం రూపవర్ణం ద్విజానాం పఠంతం శివం వేద శాస్త్రం |*
*అహో దీనవత్సం కృపాలం శివం హి భజే పార్వతీవల్లభం నీలకంఠం ||*
*8) సదా భావనాధ స్సదా సేవ్యమానం సదా భక్తిదేవం సదా పూజ్యమానం |*
*సదా తీర్ధవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీవల్లభం నీలకంఠం ||*
*ఫలం :- ఇష్టకామ్యార్ధ సిద్ధి, ఆధ్యాత్మికాభివృద్ధి.*
🕉🌞🌎🌙🌟🚩
*శ్రీపార్వతీదేవి సహస్రనామస్తోత్రం*
💫💫💫💫💫💫
హిమవానువాచ . కా త్వం దేవి విశాలాక్షి శశాంకావయవాంకితే . న జానే త్వామహం వత్సే యథావద్ బ్రూహి పృచ్ఛతే .. 1.. గిరీంద్రవచనం శ్రుత్వా తతః సా పరమేశ్వరీ . వ్యాజహార మహాశైలం యోగినామభయప్రదా .. 2.. దేవ్యువాచ . మాం విద్ధి పరమాం శక్తిం పరమేశ్వరసమాశ్రయాం . అనన్యామవ్యయామేకాం యాం పశ్యంతి ముముక్షవః .. 3.. అహం వై సర్వభావానామాత్మా సర్వాంతరా శివా . శాశ్వతైశ్వర్యవిజ్ఞానమూర్తిః సర్వప్రవర్తికా .. 4.. అనంతాఽనంతమహిమా సంసారార్ణవతారిణీ . దివ్యం దదామి తే చక్షుః పశ్య మే రూపమైశ్వరం .. 5.. ఏతావదుక్త్వా విజ్ఞానం దత్త్వా హిమవతే స్వయం . స్వం రూపం దర్శయామాస దివ్యం తత్ పారమేశ్వరం .. 6.. కోటిసూర్యప్రతీకాశం తేజోబింబం నిరాకులం . జ్వాలామాలాసహస్రాఢ్యం కాలానలశతోపమం .. 7.. దంష్ట్రాకరాలం దుర్ధర్షం జటామండలమండితం . త్రిశూలవరహస్తం చ ఘోరరూపం భయానకం .. 8.. ప్రశాంతం సౌమ్యవదనమనంతాశ్చర్యసంయుతం . చంద్రావయవలక్ష్మాణం చంద్రకోటిసమప్రభం .. 9.. కిరీటినం గదాహస్తం నూపురైరుపశోభితం . దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం .. 10.. శంఖచక్రధరం కామ్యం త్రినేత్రం కృత్తివాససం . అండస్థం చాండబాహ్యస్థం బాహ్యమాభ్యంతరం పరం .. 11.. సర్వశక్తిమయం శుభ్రం సర్వాకారం సనాతనం . బ్రహ్మేంద్రోపేంద్రయోగీంద్రైర్వంద్యమానపదాంబుజం .. 12.. సర్వతః పాణిపాదాంతం సర్వతోఽక్షిశిరోముఖం . సర్వమావృత్య తిష్ఠంతం దదర్శ పరమేశ్వరం .. 13.. దృష్ట్వా తదీదృశం రూపం దేవ్యా మాహేశ్వరం పరం . భయేన చ సమావిష్టః స రాజా హృష్టమానసః .. 14.. ఆత్మన్యాధాయ చాత్మానమోంకారం సమనుస్మరన్ . నామ్నామష్టసహస్రేణ తుష్టావ పరమేశ్వరీం .. 15.. హిమవానువాచ . ఓం శివోమా పరమా శక్తిరనంతా నిష్కలాఽమలా . శాంతా మాహేశ్వరీ నిత్యా శాశ్వతీ పరమాక్షరా .. 1.. అచింత్యా కేవలాఽనంత్యా శివాత్మా పరమాత్మికా . అనాదిరవ్యయా శుద్ధా దేవాత్మా సర్వగాఽచలా .. 2.. ఏకానేకవిభాగస్థా మాయాతీతా సునిర్మలా . మహామాహేశ్వరీ సత్యా మహాదేవీ నిరంజనా .. 3.. కాష్ఠా సర్వాంతరస్థా చ చిచ్ఛక్తిరతిలాలసా . నందా సర్వాత్మికా విద్యా జ్యోతీరూపాఽమృతాక్షరా .. 4.. శాంతిః ప్రతిష్ఠా సర్వేషాం నివృత్తిరమృతప్రదా . వ్యోమమూర్తిర్వ్యోమలయా వ్యోమాధారాఽచ్యుతాఽమరా .. 5.. అనాదినిధనాఽమోఘా కారణాత్మా కలాఽకలా . క్రతుః ప్రథమజా నాభిరమృతస్యాత్మసంశ్రయా .. 6.. ప్రాణేశ్వరప్రియా మాతా మహామహిషఘాతినీ . ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ .. 7.. సర్వశక్తికలాకారా జ్యోత్స్నా ద్యౌర్మహిమాస్పదా . సర్వకార్యనియంత్రీ చ సర్వభూతేశ్వరేశ్వరీ .. 8.. అనాదిరవ్యక్తగుహా మహానందా సనాతనీ . ఆకాశయోనిర్యోగస్థా మహాయోగేశ్వరేశ్వరీ .. 9.. మహామాయా సుదుష్పూరా మూలప్రకృతిరీశ్వరీ . సంసారయోనిః సకలా సర్వశక్తిసముద్భవా .. 10.. సంసారపారా దుర్వారా దుర్నిరీక్ష్యా దురాసదా . ప్రాణశక్తిః ప్రాణవిద్యా యోగినీ పరమా కలా .. 11.. మహావిభూతిర్దుర్ధర్షా మూలప్రకృతిసంభవా . అనాద్యనంతవిభవా పరార్థా పురుషారణిః .. 12.. సర్గస్థిత్యంతకరణీ సుదుర్వాచ్యా దురత్యయా . శబ్దయోనిః శబ్దమయీ నాదాఖ్యా నాదవిగ్రహా .. 13.. ప్రధానపురుషాతీతా ప్రధానపురుషాత్మికా . పురాణీ చిన్మయీ పుంసామాదిః పురుషరూపిణీ .. 14.. భూతాంతరాత్మా కూటస్థా మహాపురుషసంజ్ఞితా . జన్మమృత్యుజరాతీతా సర్వశక్తిసమన్వితా .. 15.. వ్యాపినీ చానవచ్ఛిన్నా ప్రధానానుప్రవేశినీ . క్షేత్రజ్ఞశక్తిరవ్యక్తలక్షణా మూలవర్జితా .. 16.. అనాదిమాయాసంభిన్నా త్రితత్త్వా ప్రకృతిర్గుహా . మహామాయాసముత్పన్నా తామసీ పౌరుషీ ధ్రువా .. 17.. వ్యక్తావ్యక్తాత్మికా కృష్ణా రక్తా శుక్లా ప్రసూతికా . అకార్యా కార్యజననీ నిత్యం ప్రసవధర్మిణీ .. 18.. సర్గప్రలయనిర్ముక్తా సృష్టిస్థిత్యంతధర్మిణీ . బ్రహ్మగర్భా చతుర్వింశా పద్మనాభాఽచ్యుతాత్మికా .. 19.. వైద్యుతీ శాశ్వతీ యోని
ర్జగన్మాతేశ్వరప్రియా . సర్వాధారా మహారూపా సర్వైశ్వర్యసమన్వితా .. 20.. విశ్వరూపా మహాగర్భా విశ్వేశేచ్ఛానువర్తినీ . మహీయసీ బ్రహ్మయోనిర్మహాలక్ష్మీసముద్భవా .. 21.. మహావిమానమధ్యస్థా మహానిద్రాత్మహేతుకా . సర్వసాధారణీ సూక్ష్మా హ్యవిద్యా పారమార్థికా .. 22.. అనంతరూపాఽనంతస్థా దేవీ పురుషమోహినీ . అనేకాకారసంస్థానా కాలత్రయవివర్జితా .. 23.. బ్రహ్మజన్మా హరేర్మూర్తిర్బ్రహ్మవిష్ణుశివాత్మికా . బ్రహ్మేశవిష్ణుజననీ బ్రహ్మాఖ్యా బ్రహ్మసంశ్రయా .. 24.. వ్యక్తా ప్రథమజా బ్రాహ్మీ మహతీ జ్ఞానరూపిణీ . వైరాగ్యైశ్వర్యధర్మాత్మా బ్రహ్మమూర్తిర్హృదిస్థితా . అపాంయోనిః స్వయంభూతిర్మానసీ తత్త్వసంభవా .. 25.. ఈశ్వరాణీ చ శర్వాణీ శంకరార్ధశరీరిణీ . భవానీ చైవ రుద్రాణీ మహాలక్ష్మీరథాంబికా .. 26.. మహేశ్వరసముత్పన్నా భుక్తిముక్తిఫలప్రదా . సర్వేశ్వరీ సర్వవంద్యా నిత్యం ముదితమానసా .. 27.. బ్రహ్మేంద్రోపేంద్రనమితా శంకరేచ్ఛానువర్తినీ . ఈశ్వరార్ధాసనగతా మహేశ్వరపతివ్రతా .. 28.. సకృద్విభావితా సర్వా సముద్రపరిశోషిణీ . పార్వతీ హిమవత్పుత్రీ పరమానందదాయినీ .. 29.. గుణాఢ్యా యోగజా యోగ్యా జ్ఞానమూర్తిర్వికాసినీ . సావిత్రీ కమలా లక్ష్మీః శ్రీరనంతోరసి స్థితా .. 30.. సరోజనిలయా ముద్రా యోగనిద్రా సురార్దినీ . సరస్వతీ సర్వవిద్యా జగజ్జ్యేష్ఠా సుమంగలా .. 31.. వాగ్దేవీ వరదా వాచ్యా కీర్తిః సర్వార్థసాధికా . యోగీశ్వరీ బ్రహ్మవిద్యా మహావిద్యా సుశోభనా .. 32.. గుహ్యవిద్యాత్మవిద్యా చ ధర్మవిద్యాత్మభావితా . స్వాహా విశ్వంభరా సిద్ధిః స్వధా మేధా ధృతిః శ్రుతిః .. 33.. నీతిః సునీతిః సుకృతిర్మాధవీ నరవాహినీ . అజా విభావరీ సౌమ్యా భోగినీ భోగదాయినీ .. 34.. శోభా వంశకరీ లోలా మాలినీ పరమేష్ఠినీ . త్రైలోక్యసుందరీ రమ్యా సుందరీ కామచారిణీ .. 35.. మహానుభావా సత్త్వస్థా మహామహిషమర్దనీ . పద్మమాలా పాపహరా విచిత్రా ముకుటాననా .. 36.. కాంతా చిత్రాంబరధరా దివ్యాభరణభూషితా . హంసాఖ్యా వ్యోమనిలయా జగత్సృష్టివివర్ధినీ .. 37.. నిర్యంత్రా యంత్రవాహస్థా నందినీ భద్రకాలికా . ఆదిత్యవర్ణా కౌమారీ మయూరవరవాహినీ .. 38.. వృషాసనగతా గౌరీ మహాకాలీ సురార్చితా . అదితిర్నియతా రౌద్రీ పద్మగర్భా వివాహనా .. 39.. విరూపాక్షీ లేలిహానా మహాపురనివాసినీ . మహాఫలాఽనవద్యాంగీ కామపూరా విభావరీ .. 40.. విచిత్రరత్నముకుటా ప్రణతార్తిప్రభంజనీ . కౌశికీ కర్షణీ రాత్రిస్త్రిదశార్త్తివినాశినీ .. 41.. బహురూపా సురూపా చ విరూపా రూపవర్జితా . భక్తార్తిశమనీ భవ్యా భవభావవినాశినీ .. 42.. నిర్గుణా నిత్యవిభవా నిఃసారా నిరపత్రపా . యశస్వినీ సామగీతిర్భవాంగనిలయాలయా .. 43.. దీక్షా విద్యాధరీ దీప్తా మహేంద్రవినిపాతినీ . సర్వాతిశాయినీ విద్యా సర్వసిద్ధిప్రదాయినీ .. 44.. సర్వేశ్వరప్రియా తార్క్ష్యా సముద్రాంతరవాసినీ . అకలంకా నిరాధారా నిత్యసిద్ధా నిరామయా .. 45.. కామధేనుర్బృహద్గర్భా ధీమతీ మోహనాశినీ . నిఃసంకల్పా నిరాతంకా వినయా వినయప్రదా .. 46.. జ్వాలామాలా సహస్రాఢ్యా దేవదేవీ మనోన్మనీ . మహాభగవతీ దుర్గా వాసుదేవసముద్భవా .. 47.. మహేంద్రోపేంద్రభగినీ భక్తిగమ్యా పరావరా . జ్ఞానజ్ఞేయా జరాతీతా వేదాంతవిషయా గతిః .. 48.. దక్షిణా దహనా దాహ్యా సర్వభూతనమస్కృతా . యోగమాయా విభావజ్ఞా మహామాయా మహీయసీ .. 49.. సంధ్యా సర్వసముద్భూతిర్బ్రహ్మవృక్షాశ్రయానతిః . బీజాంకురసముద్భూతిర్మహాశక్తిర్మహామతిః .. 50.. ఖ్యాతిః ప్రజ్ఞా చితిః సంవిత్ మహాభోగీంద్రశాయినీ . వికృతిః శాంకరీ శాస్త్రీ గణగంధర్వసేవితా .. 51.. వైశ్వానరీ మహాశాలా దేవసేనా గుహప్రియా . మహారాత్రిః శివానందా శచీ దుఃస్వప్ననాశినీ .. 52.. ఇజ్యా పూజ్యా జగద్ధాత్రీ దుర్విజ్ఞేయా సురూపిణీ . గుహాంబికా గుణోత్పత్తిర్మహాపీఠా మరుత్సుతా .. 53.. హవ్యవాహాంతర్యాగాదిః హవ్యవాహసముద్భవా . జగద్యోనిర్జగన్మాతా జన్మమృత్యుజరాతిగా .. 54.. బుద్ధిమాతా బుద్ధిమతీ పురుషాంతరవాసినీ . తరస్వినీ సమాధిస్థా త్రినేత్రా దివి సంస్థితా .. 55.. సర్వేంద్రియమనోమాతా సర్వభూతహృది స్థితా . సంసారతారిణీ విద్యా బ్రహ్మవాదిమనోలయా .. 56.. బ్రహ్మాణీ బృహతీ బ్రాహ్మీ బ్రహ్మభూతా భవారణిః . హిరణ్మయీ మహారాత్రిః సంసారపరివర్త్తికా .. 57.. సుమాలినీ సురూపా చ భావినీ తారిణీ ప్రభా . ఉన్మీలనీ సర్వసహా సర్వప్రత్యయసాక్షిణీ .. 58.. సుసౌమ్యా చంద్రవదనా తాండవాసక్తమానసా . సత్త్వశుద్ధికరీ శుద్ధిర్మలత్రయవినాశినీ .. 59.. జగత్ప్రియా జగన్మూర్తిస్త్రిమూర్తిరమృతాశ్రయా . నిరాశ్రయా నిరాహారా నిరంకురవనోద్భవా .. 60.. చంద్రహస్తా విచిత్రాంగీ స్రగ్విణీ పద్మధారిణీ . పరావరవిధానజ్ఞా మహాపురుషపూర్వజా .. 61.. విద్యేశ్వరప్రియా విద్యా విద్యుజ్జిహ్వా జితశ్రమా . విద్యామయీ సహస్రాక్షీ సహస్రవదనాత్మజా .. 62.. సహస్రరశ్మిః సత్త్వస్థా మహేశ్వరపదాశ్రయా . క్షాలినీ సన్మయీ వ్యాప్తా తైజసీ పద్మబోధికా .. 63.. మహామాయాశ్రయా మాన్యా మహాదేవమనోరమా . వ్యోమలక్ష్మీః సింహరథా చేకితానాఽమితప్రభా .. 64.. వీరేశ్వరీ విమానస్థా విశోకా శోకనాశినీ . అనాహతా కుండలినీ నలినీ పద్మవాసినీ .. 65.. సదానందా సదాకీర్తిః సర్వభూతాశ్రయస్థితా . వాగ్దేవతా బ్రహ్మకలా
కలాతీతా కలారణిః .. 66.. బ్రహ్మశ్రీర్బ్రహ్మహృదయా బ్రహ్మవిష్ణుశివప్రియా . వ్యోమశక్తిః క్రియాశక్తిర్జ్ఞానశక్తిః పరాగతిః .. 67.. క్షోభికా బంధికా భేద్యా భేదాభేదవివర్జితా . అభిన్నాభిన్నసంస్థానా వంశినీ వంశహారిణీ .. 68.. గుహ్యశక్తిర్గుణాతీతా సర్వదా సర్వతోముఖీ . భగినీ భగవత్పత్నీ సకలా కాలకారిణీ .. 69.. సర్వవిత్ సర్వతోభద్రా గుహ్యాతీతా గుహారణిః . ప్రక్రియా యోగమాతా చ గంగా విశ్వేశ్వరేశ్వరీ .. 70.. కపిలా కాపిలా కాంతా కనకాభా కలాంతరా . పుణ్యా పుష్కరిణీ భోక్త్రీ పురందరపురస్సరా .. 71.. పోషణీ పరమైశ్వర్యభూతిదా భూతిభూషణా . పంచబ్రహ్మసముత్పత్తిః పరమార్థార్థవిగ్రహా .. 72.. ధర్మోదయా భానుమతీ యోగిజ్ఞేయా మనోజవా . మనోహరా మనోరక్షా తాపసీ వేదరూపిణీ .. 73.. వేదశక్తిర్వేదమాతా వేదవిద్యాప్రకాశినీ . యోగేశ్వరేశ్వరీ మాతా మహాశక్తిర్మనోమయీ .. 74.. విశ్వావస్థా వియన్మూర్తిర్విద్యున్మాలా విహాయసీ . కిన్నరీ సురభీ వంద్యా నందినీ నందివల్లభా .. 75.. భారతీ పరమానందా పరాపరవిభేదికా . సర్వప్రహరణోపేతా కామ్యా కామేశ్వరేశ్వరీ .. 76.. అచింత్యాఽచింత్యవిభవా హృల్లేఖా కనకప్రభా . కూష్మాండీ ధనరత్నాఢ్యా సుగంధా గంధదాయినీ .. 77.. త్రివిక్రమపదోద్భూతా ధనుష్పాణిః శివోదయా . సుదుర్లభా ధనాధ్యక్షా ధన్యా పింగలలోచనా .. 78.. శాంతిః ప్రభావతీ దీప్తిః పంకజాయతలోచనా . ఆద్యా హృత్కమలోద్భూతా గవాం మాతా రణప్రియా .. 79.. సత్క్రియా గిరిజా శుద్ధా నిత్యపుష్టా నిరంతరా . దుర్గాకాత్యాయనీ చండీ చర్చికా శాంతవిగ్రహా .. 80.. హిరణ్యవర్ణా రజనీ జగద్యంత్రప్రవర్తికా . మందరాద్రినివాసా చ శారదా స్వర్ణమాలినీ .. 81.. రత్నమాలా రత్నగర్భా పృథ్వీ విశ్వప్రమాథినీ . పద్మాననా పద్మనిభా నిత్యతుష్టాఽమృతోద్భవా .. 82.. ధున్వతీ దుఃప్రకంప్యా చ సూర్యమాతా దృషద్వతీ . మహేంద్రభగినీ మాన్యా వరేణ్యా వరదర్పితా .. 83.. కల్యాణీ కమలా రామా పంచభూతా వరప్రదా . వాచ్యా వరేశ్వరీ వంద్యా దుర్జయా దురతిక్రమా .. 84.. కాలరాత్రిర్మహావేగా వీరభద్రప్రియా హితా . భద్రకాలీ జగన్మాతా భక్తానాం భద్రదాయినీ .. 85.. కరాలా పింగలాకారా నామభేదాఽమహామదా . యశస్వినీ యశోదా చ షడధ్వపరివర్త్తికా .. 86.. శంఖినీ పద్మినీ సాంఖ్యా సాంఖ్యయోగప్రవర్తికా . చైత్రా సంవత్సరారూఢా జగత్సంపూరణీంద్రజా .. 87.. శుంభారిః ఖేచరీ స్వస్థా కంబుగ్రీవా కలిప్రియా . ఖగధ్వజా ఖగారూఢా పరార్ధ్యా పరమాలినీ .. 88.. ఐశ్వర్యవర్త్మనిలయా విరక్తా గరుడాసనా . జయంతీ హృద్గుహా రమ్యా గహ్వరేష్ఠా గణాగ్రణీః .. 89.. సంకల్పసిద్ధా సామ్యస్థా సర్వవిజ్ఞానదాయినీ . కలికల్మషహంత్రీ చ గుహ్యోపనిషదుత్తమా .. 90.. నిష్ఠా దృష్టిః స్మృతిర్వ్యాప్తిః పుష్టిస్తుష్టిః క్రియావతీ . విశ్వామరేశ్వరేశానా భుక్తిర్ముక్తిః శివాఽమృతా .. 91.. లోహితా సర్పమాలా చ భీషణీ వనమాలినీ . అనంతశయనాఽనన్యా నరనారాయణోద్భవా .. 92.. నృసింహీ దైత్యమథనీ శంఖచక్రగదాధరా . సంకర్షణసముత్పత్తిరంబికాపాదసంశ్రయా .. 93.. మహాజ్వాలా మహామూర్తిః సుమూర్తిః సర్వకామధుక్ . సుప్రభా సుస్తనా గౌరీ ధర్మకామార్థమోక్షదా .. 94.. భ్రూమధ్యనిలయా పూర్వా పురాణపురుషారణిః . మహావిభూతిదా మధ్యా సరోజనయనా సమా .. 95.. అష్టాదశభుజాఽనాద్యా నీలోత్పలదలప్రభా . సర్వశక్త్యాసనారూఢా ధర్మాధర్మార్థవర్జితా .. 96.. వైరాగ్యజ్ఞాననిరతా నిరాలోకా నిరింద్రియా . విచిత్రగహనాధారా శాశ్వతస్థానవాసినీ .. 97.. స్థానేశ్వరీ నిరానందా త్రిశూలవరధారిణీ . అశేషదేవతామూర్తిర్దేవతా వరదేవతా . గణాంబికా గిరేః పుత్రీ నిశుంభవినిపాతినీ .. 98.. అవర్ణా వర్ణరహితా నివర్ణా బీజసంభవా . అనంతవర్ణాఽనన్యస్థా శంకరీ శాంతమానసా .. 99.. అగోత్రా గోమతీ గోప్త్రీ గుహ్యరూపా గుణోత్తరా . గౌర్గీర్గవ్యప్రియా గౌణీ గణేశ్వరనమస్కృతా .. 100.. సత్యమాత్రా సత్యసంధా త్రిసంధ్యా సంధివర్జితా . సర్వవాదాశ్రయా సంఖ్యా సాంఖ్యయోగసముద్భవా .. 101.. అసంఖ్యేయాఽప్రమేయాఖ్యా శూన్యా శుద్ధకులోద్భవా . బిందునాదసముత్పత్తిః శంభువామా శశిప్రభా .. 102.. విసంగా భేదరహితా మనోజ్ఞా మధుసూదనీ . మహాశ్రీః శ్రీసముత్పత్తిస్తమఃపారే ప్రతిష్ఠితా .. 103.. త్రితత్త్వమాతా త్రివిధా సుసూక్ష్మపదసంశ్రయా . శాంత్యతీతా మలాతీతా నిర్వికారా నిరాశ్రయా .. 104.. శివాఖ్యా చిత్తనిలయా శివజ్ఞానస్వరూపిణీ . దైత్యదానవనిర్మాత్రీ కాశ్యపీ కాలకల్పికా .. 105.. శాస్త్రయోనిః క్రియామూర్తిశ్చతుర్వర్గప్రదర్శికా . నారాయణీ నరోద్భూతిః కౌముదీ లింగధారిణీ .. 106.. కాముకీ లలితా భావా పరాపరవిభూతిదా . పరాంతజాతమహిమా బడవా వామలోచనా .. 107.. సుభద్రా దేవకీ సీతా వేదవేదాంగపారగా . మనస్వినీ మన్యుమాతా మహామన్యుసముద్భవా .. 108.. అమృత్యురమృతా స్వాహా పురుహూతా పురుష్టుతా . అశోచ్యా భిన్నవిషయా హిరణ్యరజతప్రియా .. 109.. హిరణ్యా రాజతీ హైమీ హేమాభరణభూషితా . విభ్రాజమానా దుర్జ్ఞేయా జ్యోతిష్టోమఫలప్రదా .. 110.. మహానిద్రాసముద్భూతిరనిద్రా సత్యదేవతా . దీర్ఘా కకుద్మినీ హృద్యా శాంతిదా శాంతివర్ధినీ .. 111.. లక్ష్మ్యాదిశక్తిజననీ శక్తిచక్రప్రవర్తికా . త్రిశక్తిజననీ జన్యా షడూర్మిపరివర్జితా .. 112.. సుధామా కర్మకరణీ యుగాంతదహనాత్మి
కా . సంకర్షణీ జగద్ధాత్రీ కామయోనిః కిరీటినీ .. 113.. ఐంద్రీ త్రైలోక్యనమితా వైష్ణవీ పరమేశ్వరీ . ప్రద్యుమ్నదయితా దాంతా యుగ్మదృష్టిస్త్రిలోచనా .. 114.. మదోత్కటా హంసగతిః ప్రచండా చండవిక్రమా . వృషావేశా వియన్మాతా వింధ్యపర్వతవాసినీ .. 115.. హిమవన్మేరునిలయా కైలాసగిరివాసినీ . చాణూరహంతృతనయా నీతిజ్ఞా కామరూపిణీ .. 116.. వేదవిద్యావ్రతస్నాతా ధర్మశీలాఽనిలాశనా . వీరభద్రప్రియా వీరా మహాకాలసముద్భవా .. 117.. విద్యాధరప్రియా సిద్ధా విద్యాధరనిరాకృతిః . ఆప్యాయనీ హరంతీ చ పావనీ పోషణీ ఖిలా .. 118.. మాతృకా మన్మథోద్భూతా వారిజా వాహనప్రియా . కరీషిణీ సుధావాణీ వీణావాదనతత్పరా .. 119.. సేవితా సేవికా సేవ్యా సినీవాలీ గురుత్మతీ . అరుంధతీ హిరణ్యాక్షీ మృగాంకా మానదాయినీ .. 120.. వసుప్రదా వసుమతీ వసోర్ధారా వసుంధరా . ధరాధరా వరారోహా వరావరసహస్రదా .. 121.. శ్రీఫలా శ్రీమతీ శ్రీశా శ్రీనివాసా శివప్రియా . శ్రీధరా శ్రీకరీ కల్యా శ్రీధరార్ధశరీరిణీ .. 122.. అనంతదృష్టిరక్షుద్రా ధాత్రీశా ధనదప్రియా . నిహంత్రీ దైత్యసంఘానాం సింహికా సింహవాహనా .. 123.. సుషేణా చంద్రనిలయా సుకీర్తిశ్ఛిన్నసంశయా . రసజ్ఞా రసదా రామా లేలిహానాఽమృతస్రవా .. 124.. నిత్యోదితా స్వయంజ్యోతిరుత్సుకా మృతజీవనీ . వజ్రదండా వజ్రజిహ్వా వైదేహీ వజ్రవిగ్రహా .. 125.. మంగల్యా మంగలా మాలా మలినా మలహారిణీ . గాంధర్వీ గారుడీ చాంద్రీ కంబలాశ్వతరప్రియా .. 126.. సౌదామినీ జనానందా భ్రుకుటీకుటిలాననా . కర్ణికారకరా కక్ష్యా కంసప్రాణాపహారిణీ .. 127.. యుగంధరా యుగావర్త్తా త్రిసంధ్యా హర్షవర్ధనీ . ప్రత్యక్షదేవతా దివ్యా దివ్యగంధా దివాపరా .. 128.. శక్రాసనగతా శాక్రీ సాధ్వీ నారీ శవాసనా . ఇష్టా విశిష్టా శిష్టేష్టా శిష్టాశిష్టప్రపూజితా .. 129.. శతరూపా శతావర్త్తా వినతా సురభిః సురా . సురేంద్రమాతా సుద్యుమ్నా సుషుమ్నా సూర్యసంస్థితా .. 130.. సమీక్ష్యా సత్ప్రతిష్ఠా చ నివృత్తిర్జ్ఞానపారగా . ధర్మశాస్త్రార్థకుశలా ధర్మజ్ఞా ధర్మవాహనా .. 131.. ధర్మాధర్మవినిర్మాత్రీ ధార్మికాణాం శివప్రదా . ధర్మశక్తిర్ధర్మమయీ విధర్మా విశ్వధర్మిణీ .. 132.. ధర్మాంతరా ధర్మమేఘా ధర్మపూర్వా ధనావహా . ధర్మోపదేష్ట్రీ ధర్మాత్మా ధర్మగమ్యా ధరాధరా .. 133.. కాపాలీశా కలామూర్తిః కలాకలితవిగ్రహా . సర్వశక్తివినిర్ముక్తా సర్వశక్త్యాశ్రయాశ్రయా .. 134.. సర్వా సర్వేశ్వరీ సూక్ష్మా సుసూక్ష్మా జ్ఞానరూపిణీ . ప్రధానపురుషేశేశా మహాదేవైకసాక్షిణీ . సదాశివా వియన్మూర్తిర్విశ్వమూర్తిరమూర్తికా .. 135.. ఏవం నామ్నాం సహస్రేణ స్తుత్వాఽసౌ హిమవాన్ గిరిః . భూయః ప్రణమ్య భీతాత్మా ప్రోవాచేదం కృతాంజలిః .. 1.. యదేతదైశ్వరం రూపం ఘోరం తే పరమేశ్వరి . భీతోఽస్మి సాంప్రతం దృష్ట్వా రూపమన్యత్ ప్రదర్శయ .. 2.. ఏవముక్తాఽథ సా దేవీ తేన శైలేన పార్వతీ . సంహృత్య దర్శయామాస స్వరూపమపరం పునః .. 3.. నీలోత్పలదలప్రఖ్యం నీలోత్పలసుగంధికం . ద్వినేత్రం ద్విభుజం సౌమ్యం నీలాలకవిభూషితం .. 4.. రక్తపాదాంబుజతలం సురక్తకరపల్లవం . శ్రీమద్ విశాలసంవృత్తలలాటతిలకోజ్జ్వలం .. 5.. భూషితం చారుసర్వాంగం భూషణైరతికోమలం . దధానమురసా మాలాం విశాలాం హేమనిర్మితాం .. 6.. ఈషత్స్మితం సుబింబోష్ఠం నూపురారావసంయుతం . ప్రసన్నవదనం దివ్యమనంతమహిమాస్పదం .. 7.. తదీదృశం సమాలోక్య స్వరూపం శైలసత్తమః . భీతిం సంత్యజ్య హృష్టాత్మా బభాషే పరమేశ్వరీం .. 8.. .. ఇతి శ్రీకూర్మపురాణే పార్వతీ సహస్రనామ స్తోత్రం సంపూర్ణం.
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి